Take a fresh look at your lifestyle.

రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ ప్రదర్శనకు ఎంపికైన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు

0 20

రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ ప్రదర్శనకు ఎంపికైన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు
నిర్దేశం, నిజామాబాద్ :
రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ ప్రదర్శనకు నిజామాబాద్ జిల్లా సిరికొండ సత్యశోధక్ పాఠశాల చెందిన ఇద్దరి విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపి కైనాయని తెలుపుటకు సంతోషిస్తున్నామంటున్నారు ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య. గత డిసెంబర్ మాసంలో జిల్లా స్థాయి ఆన్ లైన్ ప్రదర్శనలో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సి.హెచ్. కృతిక తయారు చేసిన ‘కార్న్ కాబ్ రోస్టింగ్ మెషిన్’ (మొక్కజొన్న కంకులను కాల్చుటకు ఉపయోగపడు యంత్రం) మరియు 7వ తరగతి విద్యార్ధి జి. అద్వైత్ రెడ్డి తయారు చేసిన ‘పిలింగ్ ద గ్రైన్స్ ఆపరేటింగ్ మెషిన్’ (ధాన్యాని కుప్పగా, ఆర బెట్టుటకు ఉపయోగపడు యంత్రం) ల పనితీరు ప్రాజెక్ట్ లను సమర్పించడమైనది.


పాఠశాల గైడ్ టీచర్ సతీష్ పర్యవేక్షణలో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యలతో తయారుచేసి రూపొందించిన రెండు ఇన్ స్పైర్ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడమైనది. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపికలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికకావడం సంతోషదాయకమని విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందిస్తన్నామని తెలుపుటకు చక్కటి నిదర్శనమని, ఎంపికైన విద్యార్థులకు, సంపూర్ణ సహకారం అందించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పత్రిక ముఖంగా అభినందనలు తెలిజేయడమైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking