Blog

  • భీమాకోరేగావ్ అమరవీరుల బహుజన  విజయ్ దివాస్

    భీమాకోరేగావ్ అమరవీరుల బహుజన  విజయ్ దివాస్

    జనవరి ఒకటిన గ్రామ గ్రామాన
    “బహుజన  విజయ్ దివాస్” గా
    పాటిద్ధాం…!

    “భీమాకోరేగావ్”అమరవీరుల
    ఆశయాల పూదోటలో
    లాల్-నీల్  మల్లెలై పూస్తాం…

    చరిత్ర నిండా నెత్తురొలికిన ఆనవాళ్లే
    ఆ నెత్తుటి విత్తనాలకు మొలకెత్తిన
    మోదుగు చెట్ల వనంలో విరబూసిన
    అగ్నిపూలై పూస్తాం

    చరిత్రలో కోల్పోయిన “ఆశోక మౌర్య సామ్రాజ్య”
    బహుజన రాజ్యాధికార సాధనకై
    లాల్ -నీల్ ఐక్య శక్తులుగా పిడికిలెత్తి పురోగమిస్తాం..

    సారవంతమైన సింధు నాగరికత త్యాగాల నేలపై
    వీరుల వాగ్దానపు విత్తనాలై మొలకెత్తుతాం..
    ఫూలే-అంబెడ్కర్, పెరియార్,మార్క్స్ లు కలలుగన్న
    సామ్యవాద బహుజన రాజ్యాధికార సాధనకోసం
    పునరంకితమవుతాం…!

    మానవ చరిత్ర పరిణామక్రమంలో
    గెలుపొటముల అనుభావలను
    గుండెల్లో పదిలంగా దాచుకుంటాం

    తాత్కాలిక ఓటమిని అదిగమిస్తూ
    భవిష్యత్తు ఆశయాల ప్రయాణంలో
    నిరాశకే నిరాశను పుట్టిస్తామని
    వాగ్దానం చేస్తూ…

    వీరుల నెత్తుటి త్యాగాల
    జెండాను ఎద ఎదపై మోస్తాం
    మరో ప్రపంచపు సాధన కోసం దారులు వేస్తాం..!!

    మిత్రులారా….!
    ఒక శ్రామిక వర్గ విప్లవ సైద్ధాంతిక వేత్త
    చెప్పినట్లుగా
    విత్తనం తాను నశించిపోతూ
    పంటను వాగ్దానం చేసినట్లు
    ఒక వీరుడు నేలకొరుగుతూ నూతన వ్యవస్థను వాగ్దానం చేసినట్లుగా…

    భీమాకోరేగావ్ (మహార్ ) బహుజన జాతుల
    వీరయోధుల వీరోచిత పోరాట ధీరత్వం
    భారతీయ సమాజంలో అసమానతల

    దాష్టీక వ్యవస్థ చరిత్ర ఉన్నంతకాలం వారి పోరాట వారసత్వం చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంటుంది.

    భారతీయ సమాజంలో అత్యంత అవమానకరమైన రీతిలో ఉత్పత్తి జాతులై బహుజనులను
    ముఖ్యంగా దళితులకు మూతికి ముంతా,
    ముడ్డికి చీపురు కట్టి
    ఊరవతల ఉంచి నీచమైన జాతిగా చిత్రీకరించబడిన
    జాతులకులు తిరుగుబాటు ద్వారా చరిత్రలో అద్భుతమైన విజయం సాధించిన రోజే జనవరి ఒకటికి ఉన్న చారిత్రక నేపథ్యం.
    ★1818 జనవరి ఒకటిన మహారాష్ట్రలోని ,
    పూనే జిల్లా కు ముప్పై కిలోమీటర్ల దూరంలో
    భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామంలో 500 వందల మంది బహుజన జాతుల (మహార్) సిపాయిలకు

    ★ 28 వేలమంది  పీష్వా బ్రాహ్మణాధిపత్య దోపిడి

    సైన్యాలకు మద్య జరిగిన యుద్ధంలో 28 వేల పీష్వాల సైనికులను తుదముట్టించారు కేవలం
    ఐదు వందల మంది(మహార్)బహుజన జాతుల వీర యోధులు.
    ఈ సందర్భంగా జరిగిన వీరోచిత పోరాటంలో
    ★ 23 మంది బహుజన వీరులు వీరమరణం పొందారు.
    వారి జ్ఞాపకార్థంగా
    ( విజయ్ స్తంభం ) నిర్మించారు,
    నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయంలో.
    1928లో ఇక్కడ జరిగిన మొదటి సంస్మరణ
    సభకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో జరిగింది. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం
    జనవరి 1 న డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్ గారు
    కచ్చితంగా భీమాకోరేగావ్ మృతవీరుల సంస్మరణ
    విజయ్ స్థంభం (స్థూపం) వద్ద నివాళులు అర్పించేవారు.
    ★ భీమాకోరేగావ్ వారసత్వ సంపదను జాగ్రత్తగా భధ్రపర్చి జాతికి అందించినవారు
    “మహాత్మా జ్యోతి బా ఫూలే” గారు.
    ఒకవేళ మహాత్మా జ్యోతిబా ఫూలే గనుక
    భీమాకోరేగావ్ వీరుల చరిత్ర రాసి పెట్టకపోయిఉంటే, భారతదేశంలో జరిగిన దాదాపు రెండు వందల తిరుగుబాట్లలో అతి ముఖ్యమైన,
    అత్యంత సాహసోపేతమైన
    తిరుగుబాటు ద్వారా ఆధిపత్య అగ్రవర్ణ పీష్వా పాలనను కూలదోసిన
    ఒక అద్భుతమైన చరిత్రను నేటి
    బహుజన ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు.
    ★ భారతీయ సమాజంలో జరిగిన అనేకానేక చారిత్రక నేపథ్యం కలిగిన బహుజన వీరుల నెత్తురొలికిన రహదార్లు ఎన్నో…ఎన్నెన్నో…
    ఉంటాయి.
    ఆ రహదారుల ఆనవాళ్లను చెరిపేశామని సంబరాలు జరుపుకున్నారు ఆధిపత్య దోపిడి వర్గాలు..
    కానీ ఈరోజు వందలు వేల సంఖ్యలో నిజమైన
    ఫూలే-అంబెడ్కర్, పెరియార్ ల వారసులు
    మరుగున పడిపోయిన చరిత్రను పరిశోధించడం ప్రారంభించారు…

    ★ ముప్పైఐదు సంవత్సరాల నా మార్క్సిస్టు ఉద్యమ జీవితంలో జరిగిన ప్రజా ఉద్యమాల అనుభావల స్పూర్తితో పనిచేసిన నాకు,
    2015 నుండి భారతీయ విప్లవ దంపతులు మహాత్మా జోతి బా,సావిత్రమ్మ,
    డాక్టర్ బాబాసాహేబ్,రామబాయి అంబెడ్కర్ లతోపాటు,
    పెరియార్, ఛత్రపతి జీజావ్ బాయి, ఛత్రపతి శివాజీ, సాహుమహారాజ్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, దళిత పాంథర్స్, తదితర మహానీయుల చరిత్ర పఠనం ఎప్పుడైతే పఠించడం ప్రారంభించానో
    నా ముప్పై ఐదు సంవత్సరాల మా‌ర్క్సిస్టు
    ఉద్యమ జీవితానికి మరింత చైతన్యతను పొందే అవకాశం ఏర్పడింది.
    ★ మిత్రులారా..!
    2015 నుండి
    నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భీమాకోరేగావ్ అమరవీరుల సంస్మరణ సభను జరుపుతున్నాము.
    ఈరోజు దేశంలో బహుజన సంఘాలు భీమాకోరేగావ్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం అభినందనీయం.
    మహోన్నతమైన వీరుల నెత్తురొలికిన నేల,
    భీమా భూమికి లాల్-నీల్ సలాంలతో…
    శ్రద్ధాంజలి గట్టిద్ధాం.

    ★  నిజమైన ఫూలే-అంబెడ్కర్, పెరియార్,మార్క్స్ ల వారసులైన ప్రతి బహుజన,వామపక్ష పార్టీలు, సంఘాలు, రచయితలు, కవులు

    జనవరి 1-1-2023న వినమ్రంగా
    పిడికిలెత్తి నివాళులర్పిద్ధామని తెలియజేస్తూ..

    జైభీం లాల్ సలాంలతో…

    దండి వెంకట్

     

  • బీసీ సింహం వర్సెస్ రెడ్డి సామ్రాజ్యం!

    బీసీ సింహం వర్సెస్ రెడ్డి సామ్రాజ్యం!

    బీసీ సింహం వర్సెస్ రెడ్డి సామ్రాజ్యం!

    తారాస్థాయికి ‘పవర్ స్ట్రగుల్’ పొలిటిక్స్..
    పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను దెబ్బకు సీఎం రేవంత్ కుట్ర..
    మహేశ్‌కు బీసీల మద్దతు.. తొలగిస్తే పార్టీకి భారీ నష్టం!*
    బిగ్ టీవీలో మహేశ్‌పై ‘క్యారెక్టర్ అసాసినేషన్’.. వెనక రేవంత్?*
    భగీరత్ ‘రేప్’ కేసు.. రేవంత్‌పై అధిష్టానం సీరియస్!

    (యాటకర్ల మల్లేష్)

    కుక్కను చంపాలంటే దానికి ఎర్లు లేసినయాని ప్రచారం చేయాలి.. ఇదిగో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఇదే జరుగుతుంది. ప్రభుత్వంలో సీఎం – పార్టీలో పీసీసీ చీఫ్ ఇద్దరూ పెద్దలే.. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వాళ్లిద్దరూ సమన్వయంతో ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.. కానీ.. వాళ్లిద్దరి మధ్య విభేదాలు వస్తే..? న్యాయం వైపు నిలబడిన వారి వైపే అధిష్టానం నిలబడుతుంది. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి కాలంలో ప్రతి ఆంశం హల్ చల్ అవుతుంది.
    తెలంగాణ కాంగ్రెస్‌లో భూకంపం మొదలైంది. ఒకవైపు బీసీల ‘ఆత్మగౌరవ’ నినాదం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధికార భీమం. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేసి రెడ్డి వర్గం జరుపుతున్న ‘బిగ్ టీవీ’ ఆపరేషన్‌తో పార్టీలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా బిగ్ టీవీలో వచ్చిన కథనాల వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికే నష్టం అనేది విశ్లేషకుల వాదాన. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి – పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ల మధ్య దూరం పెరుగడానికి కారణం రాబోయే కాలంలో బీసీ వాదం బలపడటమే.. పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్‌ను తప్పించి రెడ్డి వర్గానికి చెందిన తన అనుచరులను పెట్టుకోవడానికి రెడ్డి వర్గం కుట్ర చేసి బిగ్ టీవీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా లేనివి ఉన్నట్లు కట్టు కథలు కల్పించి ప్రసారం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    “రాబోయే ఎన్నికల్లో బీసీ సీఎం” – మహేశ్ బాంబు, రెడ్డిలు షాక్!*

    సీఎం రేవంత్ రెడ్డి మీడియా చీట్ ఛాట్ లో మాట్లాడుతూ 2034 వరకు ముఖ్యమంత్రిని నేనే అంటూ బహిరంగంగా ప్రకటించడం పాత కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడని విషయం. అతని వ్యవహరశైళి సైతం రాబోయే కాలంలో బీజీపీలోకి వెళ్లి సీఎం అవుతారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాకుండా ఏడాది క్రితం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ సభలో బాంబు పేల్చారు. “రాబోయే ఎన్నికల తర్వాత బీసీ బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటాడు” అని స్పష్టంగా ప్రకటించడంతో కాంగ్రెస్‌లో రెడ్డి లాబీలు ఉలిక్కిపడ్డాయి. రెడ్డిలు ఆధిపత్యం ఉన్న పార్టీలో ఈ వ్యాఖ్యలు జీర్ణించుకోలేకపోయాయి. ఇది కేవలం ఒక ప్రకటన కాదు.. భవిష్యత్ పవర్ ఎక్వేషన్‌లో బీసీలు చేస్తున్న తీవ్రమైన హెచ్చరిక.

    బిగ్ టీవీలో మహేశ్‌పై ‘క్యారెక్టర్ అసాసినేషన్’.. వెనక రేవంత్?*

    ఇటీవల బిగ్ టీవీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫెయిల్యూర్ అనే కథనాలు విరుచుకుపడ్డాయి. కానీ పార్టీ వర్గాలు చెబుతున్నది ఏమిటంటే.. ఈ కథనాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఉందని. మహేశ్ కుమార్ గౌడ్‌ను దెబ్బతీసి, అధిష్టానం ముందు ఆయన క్రెడిబిలిటీని ధ్వంసం చేయాలనే వ్యూహం పని చేస్తోందని సోషల్ మీడియా గుసగుసలు. అయితే. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఉద్వేశ్యపూర్వకంగా ప్రసారం చేసారని ఆ కథనాల వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికే నష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

    అయితే మహేశ్ కుమార్ గౌడ్ రాముడు మంచి బాలుడిలా అందరినీ కలుపుకొని పోయే నాయకుడు. వివాదాలకు అతీతంగా పని చేస్తున్న నమ్మిన బంటు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కాంగ్రెస్ వర్గీయులు గెలిశారని క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లకే దక్కింది.

    భగీరత్ ‘రేప్’ కేసు.. రేవంత్‌పై అధిష్టానం సీరియస్!

    ఈ యుద్ధానికి నిజమైన కారణం కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరత్ మైనర్ బాలిక రేప్ కేసు అని తెలుస్తోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతిన్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధిష్టానానికి నివేదిక పంపినట్లు సీఎం భావించి బిగ్ టీవీలో కథనాలు ఇప్పించినట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కాషాయ శిబిరం వైపు మొగ్గుచూపుతున్నారనే అనుమానాలు అధిష్టానం వర్గంలో బలపడుతున్నాయి. ఢిల్లీలో రేవంత్‌కు ఇప్పటి వరకు ఉన్న ప్రాధాన్యత తగ్గడం, కేరళ విజయం వంటి అంశాలు కూడా ఈ ఉద్రిక్తతకు తోడయ్యాయి.

    మహేశ్‌కు బీసీల మద్దతు.. తొలగిస్తే పార్టీకి భారీ నష్టం!*

    ఇప్పటికే బీసీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్‌కు మద్దతుగా పత్రికా ప్రకటనలు ఇచ్చి సంకేతాలు పంపారు. పీసీసీ చీఫ్‌ను తొలగిస్తే బీసీలు కాంగ్రెస్ నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది రేవంత్ రెడ్డికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరిగే పరిస్థితి.

    తాజా టాక్:

    రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే.. ఈ యుద్ధం కేవలం వ్యక్తుల మధ్య కాదు. తెలంగాణలో రెడ్డి-బీసీ పవర్ షిఫ్టింగ్ యుద్ధం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు కదా.. అధిష్టానం ఏ మూల్యాంకనం చేస్తుందో అనేది కీలకం. ఈ రాజకీయ డ్రామా ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీట్ అవుతున్నాయి!

  • పీరియడ్స్‌ రోజు!!

    పీరియడ్స్‌ రోజు!!

    పీరియడ్స్‌ రోజు!!

    (చిన్న కథ)

    సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన అంజలి చిరుతిండ్లు తిని, వారండలో పుస్తకాలు రాసుకుంటూ కూర్చుంది. హఠాత్తుగా శరీరంలో కొన్ని చోట్ల తీవ్రమైన నొప్పి మొదలైంది. ఏదో మార్పు వచ్చినట్టు అనిపించింది. అమ్మకు చెప్పగానే ఆమె ముఖం వెలిగిపోయింది. గడియారం వైపు చూసి, తేదీని గమనించి అంజలిని లోపలికి తీసుకెళ్లి, ఒక గదిలో కూర్చోబెట్టింది. కొంతసేపటికి స్నానం చేయించింది.

    మరుసటి రోజు ఇరుగుపొరుగువారికి, బంధువులకు తెలియజేసింది. హడావిడిగా కార్యక్రమాలు జరిగాయి. అంజలికి ఏమీ అర్థం కాలేదు. “ఏంటమ్మా ఇదంతా?” అని అడిగితే, “అవి తెలుస్తాయి లే” అని అమ్మ మెల్లగా చెప్పింది.

    ఆ రోజుల్లో ఎక్కడికీ వెళ్లనివ్వలేదు. ఎవరితో మాట్లాడనివ్వలేదు. చీకటిలో బంధించినట్టు అనిపించింది అంజలికి.

    నెలలు గడిచేకొద్దీ అంజలికి విషయాలు అర్థమవుతున్నాయి. తనకు, తన అమ్మకు మధ్య ఎంతో తేడా ఉందని తెలిసింది. నెలసరి సమయంలో అమ్మ ఇంటి పనులు చేస్తూ హుషారుగా ఉండేది కాదు. మూడు రోజులు తీవ్ర బాధను సహించేది.

    “అమ్మా, ఈ సమయంలో నువ్వు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోవు?” అని అడిగితే అమ్మ నవ్వుతూ, “నాకు నరకం లాగా ఉంటుంది అంజు. శరీరం అంతా నొప్పితో మండిపోతుంది. కానీ ఇంటి వాళ్లకు ఇది మామూలు విషయం. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా మాత్రలు అడుగుతారు. కానీ మన సమస్య వచ్చినప్పుడు పట్టించుకోరు” అని బాధగా చెప్పింది.

    అంజలి మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి.

    ఒకరోజు అమ్మ పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలోనే అంజలి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. మొదటి రోజు కాలేజీ కబుర్లతో గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామునే పీరియడ్స్ మొదలయ్యాయి. తీవ్ర నొప్పితో నిద్రలేవలేక అటూ ఇటూ తిరుగుతూ ఉంది.

    నాన్న సుబ్బారావు లేపేశాడు. “వాటర్ పెట్టు, స్నానం చేయాలి.”
    “నాన్నా… నాకు బాగాలేదు. పీరియడ్స్‌లో ఉన్నాను” అంది అంజలి నొప్పితో.

    సుబ్బారావు ముఖం మారిపోయింది. “హాస్టల్ వెళ్లి గారాబం అంతా నువ్వే తెచ్చావ్. మీ అమ్మ లాగా నువ్వూ మొదలైనావా..?” అని కఠినంగా అన్నాడు.

    ఆ మాటలు అంజలి గుండెల్లో గుచ్చుకున్నాయి. లేచి స్నానం చేసి, ఇంటి పనులు చేసింది. కానీ శరీరం సహకరించడం లేదు. అమ్మ బాధలు గుర్తుకొచ్చాయి. “బయటి గాయాలకు జాలి చూపిస్తారు… కానీ మన శరీరంలో ప్రతి నెలా జరిగే నరకం గురించి వీళ్లకు ఏమీ తెలియదు” అని మనసులో అనుకుంది.

    సాయంత్రం అమ్మ వచ్చి అంజలిని చూసి అర్థం చేసుకుంది. హాట్ వాటర్ బాటిల్ ఇచ్చి, ప్రేమగా చూసుకుంది.

    రాత్రి భోజనం సమయంలో టీవీలో డాక్టర్ వివేక్ గారి ప్రోగ్రామ్ వచ్చింది. వారు ఋతుస్రావం (పీరియడ్స్) గురించి వివరంగా చెప్పారు:

    “ఇది మహిళల జీవితంలో సహజమైన ప్రక్రియ. ప్రతి నెలా 3-7 రోజులు కొనసాగుతుంది. చాలా మందికి తీవ్ర నొప్పి, అలసట, భావోద్వేగ మార్పులు ఉంటాయి. ఈ సమయంలో విశ్రాంతి, పోషకాహారం చాలా అవసరం. మన ఇంటి ఆడవాళ్లను అర్థం చేసుకోవాలి…”

    ఆ మాటలు విన్న సుబ్బారావు మొదట తన కూతురి వైపు చూశాడు. తర్వాత నిశ్శబ్దంగా వినసాగాడు.

    కరెంటు పోయింది. చీకటిలో కూర్చుని అంజలి తండ్రితో మాట్లాడింది.
    “నాన్నా… ప్రతి నెలా ఇలాగే ఉంటుందా?”
    “హ్మ్… టీవీలో చెప్పినట్టు ఎవరికైనా ఉంటుంది కదా…” అని సుబ్బారావు మెల్లగా అన్నాడు.

    ఆ రాత్రి అంజలికి ఒక విషయం అర్థమైంది. కొన్ని విషయాలు చెప్పే వరకు అర్థం కావు. అడిగే వరకు తెలియవు.

    ఒక చిన్న విషయం కూడా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆ రోజు అంజలికి అర్థమైంది.

    – ఆండ్ర హర్షిత రెడ్డి, రచయిత
    సెల్: 6303794126

  • పిత్తాశయ వ్యాధులపై అవగాహన అవసరం

    పిత్తాశయ వ్యాధులపై అవగాహన అవసరం

    పిత్తాశయ వ్యాధులపై అవగాహన అవసరం

    ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పిత్తాశయ రాళ్లు (Gallbladder Stones) , వాటికి సంబంధించిన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. నిపుణులు దీనిని ఒక ప్రజారోగ్య హెచ్చరికగా భావిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ సమస్యను ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండడం అవసరం.

    1. పిత్తాశయం అంటే ఏమిటి?

    పిత్తాశయం (Gallbladder) అనేది మన కాలేయం (Liver) క్రింద ఉండే ఒక చిన్న పియర్ (బేరి) పండు ఆకారపు అవయవం. కాలేయం ఉత్పత్తి చేసే ‘పిత్త రసం’ (Bile juice) ఇక్కడ నిల్వ చేయబడుతుంది. మనం తినే ఆహారంలోని కొవ్వులను (Fats) జీర్ణం చేయడానికి ఈ పిత్త రసం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే, ఈ రసంలో కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ పరిమాణం పెరిగినప్పుడు, అది గట్టిపడి రాళ్లుగా మారుతుంది.

    2. పిత్తాశయ రాళ్ల లక్షణాలు

    చాలా మందిలో ఈ రాళ్లు ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించవు (వీటిని సైలెంట్ స్టోన్స్ అంటారు). కానీ, రాయి పిత్తవాహిక అడ్డుపడినప్పుడు క్రింది లక్షణాలు కనిపిస్తాయి…
    * కడుపు నొప్పి: కడుపుకు కుడివైపు పైభాగంలో లేదా ఛాతీ ఎముక కింద అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం.
    * నొప్పి వ్యాపించడం: ఈ నొప్పి కుడి భుజానికి లేదా వీపు భాగానికి పాకవచ్చు.
    * జీర్ణ సమస్యలు: తరచుగా అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావడం.
    * వికారం మరియు వాంతులు: ఆహారం తిన్న తర్వాత వికారంగా అనిపించడం లేదా వాంతులు అవ్వడం.

    3. కారణాలు , ప్రమాద కారకాలు (Risk Factors)

    పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి…
    * ఆహారపు అలవాట్లు: ఎక్కువ కొవ్వు (Fat), కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోవడం, పీచు పదార్థం (Fiber) తక్కువగా తినడం.
    * అధిక బరువు (Obesity): శరీరంలో అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడతాయి.
    * లింగం మరియు వయసు: పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ప్రమాదం ఎక్కువ.
    * త్వరగా బరువు తగ్గడం: కొందరు డైటింగ్ లతో అతి తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గుతారు. దీనివల్ల కాలేయం అదనపు కొలెస్ట్రాల్‌ను విడుదల చేసి రాళ్లు ఏర్పడేలా చేస్తుంది.
    * జన్యుపరమైన కారణాలు: కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వచ్చే అవకాశం ఉంది.
    * మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది.

    4. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు (Complications)

    సకాలంలో చికిత్స తీసుకోకపోతే పిత్తాశయ రాళ్లు ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు…
    * పిత్తాశయ వాపు (Cholecystitis): రాయి పిత్తాశయ ద్వారానికి అడ్డుపడటం వల్ల తీవ్రమైన వాపు, ఇన్ఫెక్షన్ వస్తుంది.
    * కామెర్లు (Jaundice): పిత్త రసం ప్రవహించే పైప్ (Bile duct) లో రాయి అడ్డుపడితే, పిత్త రసం రక్తంలో కలిసి కామెర్లకు దారితీస్తుంది.
    * ప్యాంక్రియాటైటిస్ (Pancreatitis): పిత్తాశయ రాయి ప్యాంక్రియాటిక్ నాళాన్ని అడ్డుకుంటే, ప్యాంక్రియాస్ తీవ్రమైన వాపునకు గురవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.
    * పిత్తాశయ క్యాన్సర్: చాలా అరుదుగా, దీర్ఘకాలంగా పిత్తాశయ రాళ్ల సమస్య ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

    5. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

    క్రింది తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని (Gastroenterologist / Surgeon) సంప్రదించాలి.

    -కడుపులో భరించలేనంత తీవ్రమైన నొప్పి రావడం (కనీసం కూర్చోలేనంత నొప్పి).
    -చర్మం మరియు కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్ల లక్షణాలు).
    -వణుకుతో కూడిన తీవ్రమైన జ్వరం రావడం.
    -నిరంతరాయంగా వాంతులు అవ్వడం

    పిత్తాశయ రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి , క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasound Scan) ద్వారా సమస్యను గుర్తించి, వైద్యుల సలహా మేరకు చికిత్స (అవసరమైతే లాపరోస్కోపిక్ సర్జరీ) తీసుకోవడం ఉత్తమం.

    — వి. వి. ప్రసాదరావు,
    జన విజ్ఞాన వేదిక

  • మహారాష్ట్రలో దారుణం.. పులి దాడిలో నలుగురు మహిళలు మృతి

    మహారాష్ట్రలో దారుణం.. పులి దాడిలో నలుగురు మహిళలు మృతి

    మహారాష్ట్రలో దారుణం.. పులి దాడిలో నలుగురు మహిళలు మృతి

    నిర్దేశం, ముంబై :

    మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై పులి దాడి చేసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.

    ఉదయం 8 గంటల సమయంలో అడవిలోకి వెళ్లిన మహిళలపై ఒకేసారి పులి మాటువేసి దాడి చేయడంతో ఘటన స్థలంలోనే నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులు *దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, సునీతా కౌశిక్ మొహర్లే* (వయసు 33 నుంచి 45 సంవత్సరాల మధ్య).

    ఈ ఘటనతో సిందేవహి తాలుకా గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నది. ఫారెస్ట్ రేంజ్ అధికారి అంజలీ సాయంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

    ఈ సంఘటన అటవీ ప్రాంతంలో బీడీ ఆకుల సేకరణపై ఆధారపడి జీవనం సాగిస్తున్న స్త్రీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

  • మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ సోదాలు..

    మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ సోదాలు..

    మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ సోదాలు..

    8 ఇళ్లలో తనిఖీలు*

    నిర్దేశం, హైదరాబాద్:** రంగారెడ్డి జిల్లా మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు చేశారు.

    ఈ మధ్యాహ్నం నుంచి వంశీ మోహన్‌కు చెందిన శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం తదితర ప్రాంతాల్లోని *8 ఇళ్లలో* ఏసీబీ బృందాలు ఒకేసారి సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ముఖ్యమైన పత్రాలు, ఆస్తి సంబంధిత డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా సీజ్ చేసినట్లు సమాచారం.

    *ఆరోపణలు ఏమిటి?*

    వంశీ మోహన్ శేరిలింగంపల్లి ఆర్డీవోగా పని చేసిన సమయంలో ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో *8 ఎకరాల* ప్రభుత్వ భూమిని తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత ఒక రియల్టర్‌కు దారా దత్తం చేసినట్లు ఏసీబీ ఆరోపించింది.

    అంతేకాకుండా ఒక రియల్టర్ నుంచి *10 ప్లాట్లు* గిఫ్ట్ డీడ్‌ల ద్వారా తీసుకున్నట్లు కూడా ఏసీబీ గుర్తించింది. వంశీ మోహన్ పేరిట, అతని కుటుంబ సభ్యుల పేరిట వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

    ఈ కేసులో ఏసీబీ మరిన్ని వివరాలు సేకరిస్తోంది. వంశీ మోహన్ ప్రస్తుతం మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

  • కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి..

    కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి..

    కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి..

    42% రిజర్వేషన్లు, 9వ షెడ్యూల్‌లో చేర్చాలి : బీ.ఆర్. కృష్ణ ముదిరాజ్

    నిర్దేశం, హైదరాబాద్:

    తెలంగాణలో బీసీ సమాజం దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాలను ఎదుర్కొంటోందని ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఆర్. కృష్ణ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీసీల అభివృద్ధి పేరుతో హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు.
    కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని క్రిష్ణ ముదిరాజ్ డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఆర్. కృష్ణ ముదిరాజ్ కోరారు.

    అంతేకాకుండా, బీసీల రిజర్వేషన్లను రాజ్యాంగంలోని *9వ షెడ్యూల్‌*లో చేర్చి రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో బీసీ సమాజం తీవ్ర నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని బి.ఆర్. కృష్ణ ముదిరాజ్ హెచ్చరించారు.

    ప్రజలకు పిలుపు:

    బీసీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలని బి.ఆర్. కృష్ణ ముదిరాజ్ పిలుపునిచ్చారు. “సబ్బండ బీసీ బంధువులారా.. కుంభకర్ణ నిద్రలో నుంచి ప్రభుత్వాన్ని లేవండి. మన హక్కులు, అధికారాలు అంతమవుతున్నాయి” అని బి.ఆర్. కృష్ణ ముదిరాజ్ వ్యాఖ్యానించారు.

  • తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ముంబై నాయకులు

    తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ముంబై నాయకులు

    తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ముంబై నాయకులు

    నిర్దేశం, హైదరాబాద్ :

    తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని “తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ” ఆధ్వర్యంలో గురువారం హైద్రాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం విజయవంతంగా సాగింది. ఇందులో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ట్విన్ హైద్రాబాద్ సిటీలు, మరి ముఖ్యంగా ముంబై మహానగరం నుంచి, ఇంచుమించు మొత్తం 150మంది ప్రతినిధులు హాజరైయ్యారు. ఐతే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన “కేశవరావు (కేకే) కమిటీ” రాజకీయ పార్టీలకు అతీతంగా నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు లభించే విధంగా నిస్పక్షపాతంగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. ఈ సమావేశానికి ముంబై మహానగరం నుంచి “ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ” వైస్ ప్రెసిడెంట్ కాసుల నర్సింహ గౌడ్ హాజరై ముంబై రీజియన్ (ముంబై, నవీముంబై, భివండి ప్రాంతా) ల్లో అనాడు జరిపిన అనేక ఉద్యమ కార్యక్రమాల చరిత్రను సవిస్తరంగా వివరించారు. అయితే కేకే కమిటీ వారు ముంబై రీజియన్లోని కార్యకర్త, నాయకులను గుర్తించాలని, తాము అన్ని రకాల ఆధారాలు సేకరించి సమర్పించే పనిలో ఉన్నామని నర్సింహ గౌడ్ సభ ముఖాన తెల్పారు. సభకు తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమన్వయకర్త రామగిరి ప్రకాశ్ చారి అధ్యక్షత వహించారు.

  • నిజామాబాద్‌లో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” జిల్లా స్థాయి సమావేశం 

    నిజామాబాద్‌లో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” జిల్లా స్థాయి సమావేశం 

    నిజామాబాద్‌లో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” జిల్లా స్థాయి సమావేశం 

    నిర్దేశం, నిజామాబాద్:

    ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి మరియు పారదర్శక పాలనను లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”** జిల్లా స్థాయి కార్యక్రమం నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించబడింది.

    ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, పట్టణ-గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడం, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

    నగరం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, విద్య, పచ్చదనం, ప్రజా సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు.

    ముఖ్య అతిథులు:

    – నిజామాబాద్ జిల్లా కలెక్టర్
    – నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి
    – నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్
    – నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
    – నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్

    జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    ప్రజల భాగస్వామ్యంతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ప్రతి వర్గం సంక్షేమానికి కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో పని చేస్తామని తెలిపారు.

  • జెన్-జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా?

    జెన్-జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా?

    జెన్-జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా?

    భారతదేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయం మొదలైందా? సంప్రదాయ జెండాలు, మైకులు, భారీ బహిరంగ సభలు లేవు… కానీ కోట్లాది మంది యువతను కదిలించే ఒక అదృశ్య తుఫాను ఇంటర్నెట్ తెరలపై కదులుతోంది. అదే ‘జెన్-జీ’ (Gen Z) డిజిటల్ విప్లవం. నిన్నమొన్నటి వరకు కేవలం రీల్స్, మీమ్స్, ట్రెండింగ్ సాంగ్స్‌కే పరిమితం అనుకున్న నేటి తరం యువత… ఒకే ఒక్క మాటతో దేశవ్యాప్తంగా వ్యవస్థలను ప్రశ్నించే స్థాయికి చేరింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కేవలం కొద్దిరోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, గూగుల్ సెర్చ్ ఇంజిన్లను షేక్ చేస్తున్న ‘కాక్‌రోచ్ జంత పార్టీ’ (CJP) దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

    అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఈ మధ్య కాలంలో కోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను లేదా నిరసనకారులను ఉద్దేశించి “బొద్దింకలు”, “సమాజానికి పరాన్నజీవులు” అనే తరహా వ్యాఖ్యలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన చర్చ నడిచింది. ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు సందర్భం ఏదైనప్పటికీ, దేశంలో ఉద్యోగాలు లేక, భవిష్యత్తుపై భయంతో ఉన్న యువత మనోభావాలను ఆ మాటలు తీవ్రంగా గాయపరిచాయి. వ్యవస్థ తమను ‘బొద్దింకలు’ అని అవమానిస్తే… అదే పేరును ఒక ఆయుధంగా మార్చుకోవాలని యువత భావించింది. ఫలితమే సోషల్ మీడియా వ్యూహకర్తల నేతృత్వంలో పుట్టుకొచ్చిన ‘కాక్‌రోచ్ జంత పార్టీ’. “మమ్మల్ని ఎంత తొక్కేయాలని చూసినా మేము బలిష్టమైనవాళ్లం, వ్యవస్థను ప్రశ్నించేందుకు మళ్లీ వస్తాం” (Cockroach is back) అనే నినాదంతో యువత డిజిటల్ విప్లవానికి తెరతీసింది.

    ఈ వ్యవహారం కేవలం ఒక ఆన్‌లైన్ పేజీకో, మీమ్‌కో పరిమితం కాలేదు. దీని వెనుక దేశంలో పేరుకుపోయిన నిరుద్యోగ సమస్య, యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తి దాగి ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య దాదాపు 45 కోట్లకు పైగా ఉందంటూ వస్తున్న గణాంకాలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రకటనలు ఈ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాలతో విసిగిపోయిన యువతకు ఈ ‘కాక్‌రోచ్’ ట్రెండ్ ఒక ఉమ్మడి గొంతుకగా మారింది. రాజకీయ విశ్లేషకుల సైతం షాక్ అయ్యేలా… ఏ రాజకీయ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా రాని రీచ్, కేవలం కొద్ది రోజుల్లోనే ఈ డిజిటల్ నిరసనకు రావడం గమనార్హం.

    ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే భారతదేశంలో ‘జెన్-జీ’ ఉద్యమం అధికారికంగా ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకో అనుకూలమో, వ్యతిరేకమో కాదు… యువత సమస్యలను పట్టించుకోని ప్రతి వ్యవస్థకూ హెచ్చరిక. నిన్నటివరకు యువతను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన రాజకీయ శక్తులకు, ఇకపై వారి డిజిటల్ ఐక్యతను ఎదుర్కోవడం అంత సులువు కాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియా స్క్రీన్ల నుండి మొదలైన ఈ ‘బొద్దింకల’ నిరసన… రేపటి దేశ రాజకీయ గమనాన్ని ఎలా మార్చబోతుందో వేచి చూడాలి.

    — వివరం

  • పుష్కరాల పుణ్యం… నదుల కాలుష్యం!

    పుష్కరాల పుణ్యం… నదుల కాలుష్యం!

    పుష్కరాల పుణ్యం… నదుల కాలుష్యం!

    నదులను దేవతలుగా పూజించడం, పుష్కరాలు రాగానే నదీ స్నానాల కోసం కోట్ల మంది పరుగులు తీయడం మన దేశంలో తరచూ చూసేదే. అయితే, ఈ భక్తి వెనుక దాగున్న పర్యావరణ విధ్వంసాన్ని, సామాజిక వైరుధ్యాలను కాస్త శాస్త్రీయ దృక్పథంతో గమనిస్తే అసలు నిజాలు బోధపడతాయి. “చేసిన పాపాలు పోవాలని గంగానదికి వెళ్తే, ఉన్న గోచీ కొట్టుకుపోయింది” అనే సామెత ఊరికే పుట్టలేదు. నదిలో మునిగితే మన పాపాలు పోతాయో లేదో శాస్త్రానికి తెలియదు కానీ, కోట్ల మంది ఒకేసారి దిగి స్నానాలు చేయడం వల్ల, సబ్బులు, రసాయనాలు వదలడం వల్ల ఆ నదీ జలాలు మాత్రం తీవ్రంగా కలుషితమై రోగాల పాలు అవుతాయనేది శాస్త్రీయ నిజం.

    ఇందులో మరో విచిత్రమైన సామాజిక కోణం ఏమిటంటే, తల్లిదండ్రులు బతికున్నంత కాలం వృద్ధాప్యంలో వారిని కనీసం పట్టించుకోని వారు కూడా, వారు చనిపోయాక మాత్రం మోక్షం కోసం అస్తికలను పట్టుకుని నదుల వైపు పరుగెడుతుంటారు. బతికుండగా ఇవ్వని ఆదరణ, చనిపోయాక బూడిదను నీటిలో కలపడం వల్ల వచ్చేస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. కేవలం అస్తికలే కాదు, పుణ్యం వస్తుందనే భ్రమతో లీటర్ల కొద్దీ పాలు, కిలోల కొద్దీ నెయ్యిని నదుల్లో పారబోస్తుంటారు. ఒకవైపు దేశంలో ఎంతో మంది పిల్లలు పాలు లేక పోషకాహార లోపంతో బాధపడుతుంటే, మరోవైపు పాలను ఇలా నది పాలు చేయడం ఎంతవరకు న్యాయం? పైగా, నీటిపై పేరుకుపోయే ఈ నూనె, నెయ్యి పొరల వల్ల నీటిలోకి ఆక్సిజన్ అందక లోపల ఉండే చేపలు, ఇతర జలచరాలు ఊపిరాడక చనిపోతాయి. నదిని పవిత్రం చేస్తున్నామనే భ్రమలో, అక్కడొక పర్యావరణ విపత్తును సృష్టిస్తున్నామనే కనీస స్పృహ భక్తులకు ఉండడం లేదు.

    ఇక పుష్కరాలు రాగానే పాలకులు, మంత్రులు విఐపి ఘాట్‌లలో కెమెరాల ముందు మునకలు వేస్తూ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు నదుల్లో కలుస్తున్నప్పుడు, డ్రైనేజీ నీరు పవిత్ర నదులను మురికికూపాలుగా మారుస్తున్నప్పుడు రాని పట్టుదల, కేవలం పుష్కరాల పబ్లిసిటీ కోసం, ఓట్ల రాజకీయాల కోసం ప్రదర్శిస్తుంటారు. కంటికి కనిపించని సరస్వతి నదికి అంతర్వాహినిగా పుష్కరాలు నిర్వహిస్తూ, కళ్ల ముందే నదులు కలుషితమవుతుంటే పట్టించుకోని పద్ధతి మనది. నదులను “అమ్మ” అని నోటితో పిలుస్తూనే, వాటిని వ్యర్థాలు పారబోసే డస్ట్‌బిన్‌లుగా మార్చేస్తున్న ఈ అశాస్త్రీయ ధోరణి మారాలి. చనిపోయిన వారి జ్ఞాపకార్థం నదిని మురికి చేయడం కంటే, ఒక మొక్క నాటి దానికి నీళ్లు పోయడం ఎంతో ఉత్తమం. మూఢనమ్మకాలను పక్కన పెట్టి, భక్తికి కాస్త శాస్త్రీయ ఆలోచనను జోడించినప్పుడే మన పర్యావరణానికి, మన నదులకు నిజమైన మోక్షం లభిస్తుంది.

    — వి. వి. ప్రసాదరావు,
    జన విజ్ఞాన వేదిక

  • సోషల్ మీడియాలో ‘బొద్దింకల’ విప్లవం

    సోషల్ మీడియాలో ‘బొద్దింకల’ విప్లవం

    సోషల్ మీడియాలో ‘బొద్దింకల’ విప్లవం

    4 రోజుల్లో కోటి మార్కును దాటిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’!

    హైదరాబాద్: భారతీయ సోషల్ మీడియా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రికార్డు నమోదైంది. కేవలం ఒక జోక్‌గా, పొలిటికల్ సెటైర్ (రాజకీయ వ్యంగ్యం) గా సోషల్ మీడియాలో ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. మే 16న ప్రారంభమైన ఈ పారడీ ఖాతా, కేవలం నాలుగు రోజుల్లోనే (మే 20 నాటికి) 10 మిలియన్ల (1 కోటి) ఫాలోవర్ల మైలురాయిని దాటి దూసుకుపోతోంది.
    ప్రస్తుతం ఈ డిజిటల్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య దేశ అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (8.7 మిలియన్లు) కంటే దాదాపు 15 లక్షలకు పైగా దాటిపోవడం విశేషం. బిజెపి ఇప్పటివరకు 18 వేలకు పైగా పోస్టులు పెడితే, సిజెపి కేవలం 54 పోస్టులతోనే ఈ ఘనత సాధించింది. “యువత శక్తిని తక్కువ అంచనా వేయకండి” అంటూ సిజెపి దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

    అసలు ఏమిటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’?

    ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన ఒక గౌరవ న్యాయమూర్తి విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా యువత డిజిటల్ వేదికలపై తిరుగుబాటు ప్రారంభించింది. తమను తాము “సోమరులు, నిరుద్యోగుల గొంతుక”గా ప్రకటించుకుంటూ, ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ని తెరపైకి తెచ్చారు.

    తెర వెనుక ఉన్న వ్యూహకర్త ఎవరు?

    మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన అభిజీత్, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్నవాడు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ‘మీమ్ ఆధారిత’ ప్రచారంతో ఈయన గుర్తింపు పొందారు.

    ఆలోచింపజేసే ‘వ్యంగ్య’ మేనిఫెస్టో:

    ఈ పార్టీ తమ సిద్ధాంతాన్ని “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరి)” అని పేర్కొంటూ ఒక 5 పాయింట్ల మేనిఫెస్టోను విడుదల చేసింది.
    1. విశ్రాంత న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు.
    2. పార్లమెంట్‌లో స్థానాలు పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి.
    3. ఫిరాయింపులకు పాల్పడే MLAలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల నిషేధం విధించాలి.
    4. విద్యామండలి (CBSE) రీ-చెకింగ్ ఫీజులను రద్దు చేయాలి.
    5. NEET పరీక్షా విధానంలో నష్టపోయిన విద్యార్థులకు తక్షణ న్యాయం చేయాలి.

    తాజా పరిణామం: ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నిలిపివేత!

    ఈ డిజిటల్ తుఫాను సృష్టిస్తున్న ప్రభావం వల్ల, ఇన్‌స్టాగ్రామ్‌లో బిజెపిని దాటిన కొన్ని గంటల్లోనే, గురువారం (మే 21) ఉదయం భారతదేశంలో ఈ పార్టీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను నిలిపివేసారు (Withheld). దీనిపై వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ, “ఊహించినట్లే మా అకౌంట్‌ను నిలిపివేశారు” అని పేర్కొన్నారు. అయినప్పటికీ, వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే 1.6 లక్షల మందికి పైగా యువత డిజిటల్ సభ్యత్వం తీసుకోవడం విశేషం.
    అఖిలేష్ యాదవ్, మహువా మోయిత్రా, మనీష్ సిసోడియా వంటి ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ ట్రెండ్‌పై స్పందించడంతో, ఇది కేవలం ఇంటర్నెట్ జోక్ మాత్రమే కాదని, దేశంలోని నిరుద్యోగ యువత అసంతృప్తిని తెలియజేసే ఒక సరికొత్త ‘జెన్-జీ (Gen-Z) డిజిటల్ తిరుగుబాటు’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • అమ్మతనంపై…….. రాజకీయ పెత్తనమా?

    అమ్మతనంపై…….. రాజకీయ పెత్తనమా?

    అమ్మతనంపై……..
    రాజకీయ పెత్తనమా?

    “ఇన్నాళ్ళూ…
    ఆడాళ్ళ హక్కులపై
    వివక్షే అనుకుంటే

    ఇప్పుడు ఏకంగా..
    గర్భాశయాలపైనే
    రాజకీయ పెత్తనం

    అమ్మతనంపై
    ఏమిటీ
    రాజకీయ క్రీనీడ?

    ఓట్లకోసం…
    గర్భాశయాలకు
    తూట్లా…?

    ప్రలోభాలతో
    పిల్లల్ని…
    పుట్టించాలా?

    పిల్లలే….
    సంపద
    అంటారా.!

    సంపద సృష్టంటే
    ఇదేనా!
    బాబూ..?

    *ఎ. రజాహుస్సేన్..!!

  • అమ్మ చావును వరమడిగిన శాపగ్రస్తుణ్ణి నేను!!

    అమ్మ చావును వరమడిగిన శాపగ్రస్తుణ్ణి నేను!!

    అమ్మ చావును వరమడిగిన శాపగ్రస్తుణ్ణి నేను!!

    *అక్కడ అమ్మ సముద్రం మీద చందమామై
    ధవళ శీతుమయూఖాంగుళులతో ప్రేమగా
    నా వొళ్లంతా నిమురుతుంది!!*

    *“ఎన్ని రక్త కణాలను కూడగట్టి కూడగట్టి
    పాలపొంగుగా పోగు చేసిందో.. అమృత కలశం లాంటి
    గోరువెచ్చని స్తన్యాన్ని నోటికిచ్చింది!!*

    *బాల భరతుడు సింహాలతోను ఏనుగులతోను
    ఆటలాడినట్లు అమ్మ వక్షస్థలం మీద ఆడుకోవాలనుంది!!”*

    *పరిచయం*

    పాఠకులకు పరిచయం అక్కర్లేని ఆచార్య శిఖామణి గారు. అయినా, ఆయన గురించి కొన్ని మాటలు చెప్పడం అవసరం.

    శిఖామణి (అసలు పేరు: కర్రి సంజీవరావు) 1957 అక్టోబరు 30న యానాం (పాండిచ్చేరి)లో జన్మించారు. విశాఖపట్నంలో ఉన్నత పాఠశాల విద్య, కాకినాడ పి.ఆర్. కాలేజీలో పట్టభద్రత, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పఠాభి కవిత్వం పై పరిశోధన చేసి పీహెచ్‌డి పొందారు.

    పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేసి పదవీ విరమణ చేశారు. అయినా సాహిత్య సేవను అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నారు. ‘మువ్వల చేతి కర్ర’, ‘చిలక్కొయ్య’, ‘కిర్రు చెప్పుల భాష’, ‘నల్లగేటూ నందివర్ధనం చెట్టు’ వంటి ముఖ్య రచనలు చేశారు.

    1987లో ‘మువ్వల చేతి కర్ర’కు ‘ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు’, 1988లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘సాహితీ పురస్కారం’, 1989లో ‘ఉమ్మడి శెట్టి’ అవార్డు, 2007లో ‘నల్లగేటూ నందివర్ధనం చెట్టు’కు ‘సినారె కవితా పురస్కారం’ వంటి గౌరవాలు అందుకున్నారు.

    *ఈరోజు కాఫీ టైం కవిత: అమ్మ*

    అమ్మ జ్ఞాపకానికొచ్చినప్పుడల్లా
    నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను
    శరీరాన్ని ఇక్కడే ఉంచి, ధరించిన దుస్తులకే వదిలేసి…

    అలా అలల మీద నడుచుకుంటూ సముద్రం మీదకు వెళ్తాను.
    అక్కడ కన్నీటి సముద్రమై నన్ను నేను ద్రవింపచేసుకుంటాను.
    పువ్వుల మీద నుంచి, పుప్పొడి మీద నుంచి పాక్కుంటూ,
    వెలుతురు సోకని చీకటి దుర్గమారణ్యాల గుండా ప్రయాణించి,
    ఊపిరాడని చిక్కటి చీకటిలో చీకటిగా నిలబడిపోయి,
    నన్ను నేను ఘనీభవింప చేసుకుంటాను…

    అభిశప్త ఆత్మల మీద, అణగారిన అగ్నుల మీద ప్రవహించి,
    చివరికి ఏ చీకటి అగాధంలోనో గుప్పెడు బూదిగా మారి దిక్కులు చూస్తాను.

    అక్కడ అమ్మ…
    సముద్రం మీద చందమామై, ధవళ శీతుమయూఖాంగుళులతో ప్రేమగా నా వొళ్లంతా నిమురుతుంది.

    అక్కడ అమ్మ…
    అరణ్యంలో పులుగుల ఎలుగుల్లో తన గొంతు కలిపి నన్ను పిచ్చిగా పిలుస్తుంది.

    అక్కడ అమ్మ…
    సగరపుత్రులను శాపవిముక్తులను చేయడానికి భగీరథుడు తీసుకొచ్చిన గంగలా,
    ప్రచండ వాయు తరంగమై వచ్చి నన్ను కేల ధరించి తనతో పాటు తీసుకెళ్తుంది.

    అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సిరియాళుని తల్లి గుర్తుకొస్తుంది.
    తన ప్రేమను ప్రకటించడానికి తానే చనిపోయిన ఆ తల్లి…
    నా పిచ్చి తల్లి కూడా అలాగే చేసిందని అనిపిస్తుంది.

    అన్నం ముందు కూర్చొని ఆకలితో ముద్ద నోటికందించబోతే… అప్పుడూ అమ్మే గుర్తుకొస్తుంది.
    తొమ్మిది నెలలు నులివెచ్చని రక్త స్పర్శతో కాపాడిన రక్షణ వలయాన్ని ఛేదించి,
    ఆయుధాలు కోల్పోయిన అభిమన్యుడిలా ఈ భూమి మీద పాదం మోపిన క్షణం నుంచి…

    ఎన్ని రక్త కణాలను కూడగట్టి పాలపొంగుగా చేసి, అమృత కలశం లాంటి గోరువెచ్చని స్తన్యం ఇచ్చిన అమ్మ…
    నేను ఆమెకు గురు దక్షిణ ఇవ్వకుండా, ఆమె చావును వరమడిగిన శాపగ్రస్తుణ్ణి అయ్యాను.

    ఇప్పుడు నేను నెలల శిశువునైపోయి,
    బాల భరతుడు సింహాలతోను ఏనుగులతోను ఆటలాడినట్లు
    అమ్మ వక్షస్థలం మీద ఆడుకోవాలనుంది…
    ఆడి ఆడి అలసి సొలసి అక్కడే నిద్రపోవాలనుంది.

    *శిఖామణి గారు!!*

    అమ్మ కవిత్వం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అమ్మకు సాటి లేదు. అమ్మ UNIVERSAL. అమ్మ కవిత్వం కూడా సార్వజనీనం.

    లోకంలో అమ్మను మించిన కవిత్వం మరొకటి లేదు. అమ్మే కవిత్వం. అమ్మే కావ్యం. అమ్మ వున్న చోటే అక్షరం, అమ్మ వున్న చోటే ఆలయం.

    శిఖామణి గారి ఈ కవిత చదివినప్పుడు కళ్లు తడిసిపోతాయి. మాతృవియోగం యొక్క లోతైన వేదనను, అమ్మ ప్రేమ యొక్క అపారతను అద్భుతంగా కవిత్వీకరించారు. ఈ కవితలో శిఖామణి నిజంగా “మణి” అని నిరూపించుకున్నారు.

    • ఎ. రజాహుస్సేన్

  • సీఎం గారు..! మహిళలు పిల్లలు కనే యంత్రాలా..?*

    సీఎం గారు..! మహిళలు పిల్లలు కనే యంత్రాలా..?*

    సీఎం గారు..! మహిళలు పిల్లలు కనే యంత్రాలా..?*

    *జనాభా పెరుగుదలకు మహిళల శరీరాలు బలి అవ్వాలా?*

    (చైతన్య పింగళి, సినీ రచయిత)

    పని చేయగల సామర్థ్యం, వయసు ఉన్న యువత తక్కువ ఉండటం వల్ల జనాభా పెరుగుదల కోసం కొన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించారు చంద్రబాబు గారు.

    ఎవరు కనాలి? ఆడవాళ్లం కనాలి. తొమ్మిది నెలలు నిండా మోయాలి. పదో నెలలో పుడతారు. బిడ్డకు బిడ్డకు మూడేళ్ల గ్యాప్ ఉండాలని, అప్పుడే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారనేది సత్యం. ప్రభుత్వం కూడా ప్రకటనలు ఇస్తుంది.

    ఈ లెక్కన ముగ్గురు పిల్లలు అనుకోండి — మోసే సమయం దగ్గర దగ్గరగా రెండున్నర ఏళ్లు, గ్యాప్ ఆరు ఏళ్లు. మొత్తం ఎనిమిదిన్నర ఏళ్లు. నలుగురు బిడ్డల్ని కనాలనుకోండి — దగ్గర దగ్గరగా పన్నెండు ఏళ్లు.

    బిడ్డను కన్నాక వచ్చే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎంత కాలం ఉంటుందో తెలియదు. మన సమాజం అసలు అలాంటిది ఒకటి ఉందని గుర్తించదు. కాబట్టి దాన్ని వదిలేసి, కేవలం బయోలాజికల్ గా పెట్టాల్సిన సమయం మాత్రమే చూద్దాం. పిల్లలతో ఆడుకోవటానికి, పాడుకోవటానికి, ఊసులు చెప్పటానికి, ఆరు నెలలు నిండాక పోషక ఆహారం విడిగా వండి పెట్టడానికి కావాల్సిన సమయం ఎంతో ఎవరూ చెప్పలేం. అది బిడ్డ బట్టీ కూడా ఉంటుంది. ఆ బిడ్డకు ప్రత్యేక అవసరాలు ఉంటే, తల్లిదండ్రులు పెట్టాల్సిన సమయం ఊహించలేం కూడా.

    ప్రతి బిడ్డకీ తల్లి పాలు ఇవ్వాలి. మెటర్నిటీ సెలవు ఆరు నెలలు ఇస్తారు. కడుపుతో ఉన్నప్పుడు ఎనిమిదో నెల నిండిన దగ్గర నుండే సెలవు పెడతారు. అంటే అటు ఇటు రెండు మూడు నెలలు. బిడ్డ పుట్టాక మరో మూడు నెలలు మిగిలిన సెలవు వాడతారు. కొంతమంది జీతం లేని సెలవు మీద ఇంట్లోనే ఉండి ఇంకొంత కాలం బిడ్డను చూసుకుంటారు.

    కానీ ఈ ఆరు నెలల సెలవు అన్ని కంపెనీలు ఇవ్వవు. ముఖ్యంగా ఇంటి పనులు చేసే వాళ్లు, నిర్మాణ కార్మికులు లాంటి నిర్వ్యవస్థీకరించిన రంగాల మహిళలకు ఏమీ ఉండదు. ఈ తక్కువ జీతం ఉద్యోగాల్లో ఉన్న స్త్రీలకు మొదలే శారీరక బలం ఉండదు. అందుకే వాళ్ల జీవితకాలం కూడా తక్కువ. ఆ స్త్రీ ఎంత బలహీనంగా ఉన్నా, దిక్కులేకో, ఇతరత్రా కొనలేకో ఆ కాస్త రక్తాన్ని పాలుగా మార్చి ఇస్తుంది. ఈ పాలు ఇచ్చే కాలంలో పోషకాహారం లేకపోతే స్త్రీలు మరింత బలహీనపడతారు. యునిసెఫ్ లెక్కల ప్రకారం బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పాలు ఆరు నెలలు ఇవ్వాలి. దీన్ని ప్రభుత్వం కూడా ప్రకటనల్లో చెబుతుంది.

    చెప్పండి, వ్యవస్థీకరించిన రంగాల్లో పని చేసే మహిళలు అన్ని నెలలు పూర్తిగా బిడ్డకు పాలు ఇస్తున్నారా? ఇవ్వగలరా? బిడ్డను తెచ్చుకుని చూసుకోవటానికి మన పని స్థలాల్లో కనీస సౌకర్యాలు ఉంటాయా? ఆఫీసుల్లో, పబ్లిక్ స్థలాల్లో బాత్‌రూములు వాడితే కడుపుతో ఉన్న తల్లి, బాలింత రోగాలు వచ్చిపోతారు. తల్లిని వదిలేయండి, బిడ్డను ఎక్కడ ఉంచగలం? ఆ వాతావరణం, స్థలం స్త్రీలు పని చేసే చోట్ల ఉంటుందా? నిర్వ్యవస్థీకరించిన రంగాల్లో పని చేసే స్త్రీల, వాళ్ల బిడ్డల మాటేమిటి?

    ఇంతకు ముందు తరాల్లో కనలేదా? కన్నారు. కానీ ఎంత మంది పుట్టారో అందులో సగం మంది కూడా బతికేవారు కాదు. పుట్టకుండానే చనిపోయే పిల్లలు ఎక్కువ. కన్నప్పుడు చనిపోయే తల్లులు ఎక్కువ. తల్లి లేని పిల్లల్ని చూసుకోవటానికి, వంటింట్లో పొయ్యి వెలిగించడానికి ఇంకో పెళ్లి. సవతి తల్లి కాన్సెప్ట్‌తో కథలు రాసుకోవటానికి మాత్రమే పనికొచ్చింది. కానీ ఆ వ్యవస్థలో పిల్లలు, స్త్రీ, మగవాడు, మొత్తం కుటుంబం భద్రంగా, సంతోషంగా ఉందా?

    కుటుంబ వ్యవస్థ, స్త్రీల జనాభా నాశనం అవుతున్నాయని ఎన్ని పరిశోధనలు చేసి సురక్షిత ప్రసవం కోసం మందులు, శస్త్రచికిత్సలు కనిపెట్టారు? ఆస్పత్రిలోనే కనండి అని ఇదే ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తుంది? ఇంకా ప్రసూతి మరణాలు, నవజాత శిశు మరణాలు మన దేశంలో ఉన్నాయి. డోలీ మీద మోసుకొస్తే, కొండ దిగేప్పుడు కనేసిన తల్లి లాంటి వార్తలు ఇంకా చూస్తున్నాం.

    ‘పురిటి నొప్పులు దాటితే పునర్జన్మ’ అనే సామెతలు ఎందుకు పుట్టాయో మాకు మాత్రమే తెలిసిన సత్యాలు. మేము ప్రతి సురక్షిత ప్రసవానికి పునర్జన్మ ఎత్తుతాం. మీరు ఇచ్చే ముప్పై వేల కోసం మళ్లా చావుకి రెడీ అవ్వమంటారా? ముందు పుట్టిన ఇద్దరు పిల్లల్ని గాలికి వదిలేయమంటారా? అసలే స్త్రీ-పురుష జనాభా నిష్పత్తిలో తేడా ఉంది. ఆ తేడాని మళ్లీ పెంచుతారా?

    పని చేయగల సామర్థ్యం ఉన్న యువత తగ్గకుండా ఉండేందుకు మూడో బిడ్డ, నాలుగో బిడ్డని కనాలంటున్నారు. మమ్మల్ని పని శక్తిగా పరిగణించరా? కుటుంబ నియంత్రణ పాటించి, మా సమయాన్ని పనిలో పెట్టడం వల్ల ఎన్ని మార్పులు, ఎంత అభివృద్ధి జరిగింది? డబ్బు తీసుకునే పని, డబ్బు లేని పని రెండింట్లోనూ ఈ తరం స్త్రీల వాటా లెక్కేస్తే మీ తాతల తాతల నుండి మనవళ్ల వరకు కష్టపడ్డా తిరిగి చెల్లించలేరు.

    మనిషి ఉండేది కేవలం పని చేయటానికేనా? పని శక్తిగా, ఉత్పాదకంగా ఉండటం తప్ప జీవితానికి ఇంకేం అర్థం లేదా? ఈ దేశంలో స్త్రీ-పురుషులందరికీ చేసిన పనికి తగ్గ జీతం, సౌకర్యాలు, గౌరవం దక్కుతున్నాయా?

    ఇవన్నీ ఆడవాళ్ల సమస్యలే కాదు. మగవాళ్లవి కూడా. భార్య ఆరోగ్యంగా లేకపోతే భర్తకు దిగులు ఉండదా? ఆమె తిప్పలు పడుతుంటే అతను ప్రశాంతంగా ఉండగలడా? ముగ్గురు నలుగురు పిల్లల ఆరోగ్యం, విద్య, పెద్ద రోగాలు, ప్రత్యేక అవసరాలు — ఇవన్నీ కుటుంబ ఆర్థిక భారం మీద పడతాయి. ఈ అసమతుల్యత కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది, ఆనందాన్ని హరిస్తుంది.

    భూమి మీద మనం మాత్రమే ఉన్నామా? మనుషుల జనాభా ఎంత పెరిగింది? మన దెబ్బకి ఎన్ని జీవులు అంతరించిపోతున్నాయి? మన కాలుష్యం, వనరుల వాడకం మిగిలిన జీవరాశికి ఎంత నష్టం కలిగిస్తున్నాయి?

    మానవ ఆవిష్కరణల్లో అత్యంత ఉపయోగమైనది గర్భనిరోధకాలు. అవి లేకుండా మన జనాభా, సమాజం ఎలా ఉండేదో ఊహించండి. అభివృద్ధి అంటే కొంతమంది సంపన్నులు కావడానికి అందరినీ పని చేసే యంత్రాలుగా పుట్టించడమా?

    ప్రభుత్వాలుగా, మగవాళ్లుగా మీరు మాకేం ఇస్తున్నారు? ఏ అవకాశాలు, ఏ వసతులు, ఏ భరోసా ఇస్తున్నారు? ముప్పై వేలు, నలభై వేల ప్రోత్సాహకాలకు ఆశపడి పిల్లల్ని కనే స్థితిలో జనాలు ఉన్నారంటే — మీ వ్యవస్థలు విఫలమైనట్టే కదా.

    ఈ ప్రశ్న చంద్రబాబు గారికి మాత్రమే కాదు, ఈ సిద్ధాంతాలను సమర్థించే వారందరికీ.

    – చైతన్య పింగళి ఫేస్ బుక్ నుంచి…

  • జర్నలిస్టులకు గుడ్ న్యూస్…

    జర్నలిస్టులకు గుడ్ న్యూస్…

    జర్నలిస్టులకు గుడ్ న్యూస్…

    ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

    నిర్దేశం, హైదరాబాద్ :
    సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లాబీలో ఇవాళ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
    జర్నలిస్టుల హౌజింగ్ పాలసీ *యూనివర్సల్*‌గా ఉంటుందని, అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు.
    “జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎలా కేటాయించాలనే విషయం నేను స్వయంగా చూసుకుంటాను. నాకు వదిలేయండి” అని ఆయన భరోసా ఇచ్చారు.
    సొసైటీల ద్వారా కేటాయింపులు జరగాలని కోరిన ప్రశ్నకు స్పందిస్తూ, “సొసైటీలకు కాదు, *ప్రతి జర్నలిస్టుకు వ్యక్తిగతంగా* ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

  • పిత్తాశయ వ్యాధులపై అవగాహన అవసరం

    పిత్తాశయ వ్యాధులపై అవగాహన అవసరం

    పిత్తాశయ వ్యాధులపై అవగాహన అవసరం

    ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పిత్తాశయ రాళ్లు (Gallbladder Stones) , వాటికి సంబంధించిన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. నిపుణులు దీనిని ఒక ప్రజారోగ్య హెచ్చరికగా భావిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ సమస్యను ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండడం అవసరం.

    1. పిత్తాశయం అంటే ఏమిటి?

    పిత్తాశయం (Gallbladder) అనేది మన కాలేయం (Liver) క్రింద ఉండే ఒక చిన్న పియర్ (బేరి) పండు ఆకారపు అవయవం. కాలేయం ఉత్పత్తి చేసే ‘పిత్త రసం’ (Bile juice) ఇక్కడ నిల్వ చేయబడుతుంది. మనం తినే ఆహారంలోని కొవ్వులను (Fats) జీర్ణం చేయడానికి ఈ పిత్త రసం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే, ఈ రసంలో కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ పరిమాణం పెరిగినప్పుడు, అది గట్టిపడి రాళ్లుగా మారుతుంది.

    2. పిత్తాశయ రాళ్ల లక్షణాలు

    చాలా మందిలో ఈ రాళ్లు ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించవు (వీటిని సైలెంట్ స్టోన్స్ అంటారు). కానీ, రాయి పిత్తవాహిక అడ్డుపడినప్పుడు క్రింది లక్షణాలు కనిపిస్తాయి…
    * కడుపు నొప్పి: కడుపుకు కుడివైపు పైభాగంలో లేదా ఛాతీ ఎముక కింద అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం.
    * నొప్పి వ్యాపించడం: ఈ నొప్పి కుడి భుజానికి లేదా వీపు భాగానికి పాకవచ్చు.
    * జీర్ణ సమస్యలు: తరచుగా అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావడం.
    * వికారం మరియు వాంతులు: ఆహారం తిన్న తర్వాత వికారంగా అనిపించడం లేదా వాంతులు అవ్వడం.

    3. కారణాలు , ప్రమాద కారకాలు (Risk Factors)

    పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి…
    * ఆహారపు అలవాట్లు: ఎక్కువ కొవ్వు (Fat), కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోవడం, పీచు పదార్థం (Fiber) తక్కువగా తినడం.
    * అధిక బరువు (Obesity): శరీరంలో అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడతాయి.
    * లింగం మరియు వయసు: పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ప్రమాదం ఎక్కువ.
    * త్వరగా బరువు తగ్గడం: కొందరు డైటింగ్ లతో అతి తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గుతారు. దీనివల్ల కాలేయం అదనపు కొలెస్ట్రాల్‌ను విడుదల చేసి రాళ్లు ఏర్పడేలా చేస్తుంది.
    * జన్యుపరమైన కారణాలు: కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వచ్చే అవకాశం ఉంది.
    * మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది.

    4. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు (Complications)

    సకాలంలో చికిత్స తీసుకోకపోతే పిత్తాశయ రాళ్లు ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు…
    * పిత్తాశయ వాపు (Cholecystitis): రాయి పిత్తాశయ ద్వారానికి అడ్డుపడటం వల్ల తీవ్రమైన వాపు, ఇన్ఫెక్షన్ వస్తుంది.
    * కామెర్లు (Jaundice): పిత్త రసం ప్రవహించే పైప్ (Bile duct) లో రాయి అడ్డుపడితే, పిత్త రసం రక్తంలో కలిసి కామెర్లకు దారితీస్తుంది.
    * ప్యాంక్రియాటైటిస్ (Pancreatitis): పిత్తాశయ రాయి ప్యాంక్రియాటిక్ నాళాన్ని అడ్డుకుంటే, ప్యాంక్రియాస్ తీవ్రమైన వాపునకు గురవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.
    * పిత్తాశయ క్యాన్సర్: చాలా అరుదుగా, దీర్ఘకాలంగా పిత్తాశయ రాళ్ల సమస్య ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

    5. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

    క్రింది తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని (Gastroenterologist / Surgeon) సంప్రదించాలి.

    -కడుపులో భరించలేనంత తీవ్రమైన నొప్పి రావడం (కనీసం కూర్చోలేనంత నొప్పి).
    -చర్మం మరియు కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్ల లక్షణాలు).
    -వణుకుతో కూడిన తీవ్రమైన జ్వరం రావడం.
    -నిరంతరాయంగా వాంతులు అవ్వడం

    పిత్తాశయ రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి , క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasound Scan) ద్వారా సమస్యను గుర్తించి, వైద్యుల సలహా మేరకు చికిత్స (అవసరమైతే లాపరోస్కోపిక్ సర్జరీ) తీసుకోవడం ఉత్తమం.

    — వి. వి. ప్రసాదరావు,
    జన విజ్ఞాన వేదిక

  • మెలోడీ చాక్లెట్ నుంచి మెలోనీ వరకు…!

    మెలోడీ చాక్లెట్ నుంచి మెలోనీ వరకు…!

    మెలోడీ చాక్లెట్ నుంచి మెలోనీ వరకు…!

    ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల అంతర్జాతీయ పర్యటన చివరి రోజున ఇటలీ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన సమావేశం ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీ భారత్ కు నాల్గవ అతిపెద్ద ఆర్థిక భాగస్వామిగా ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో ఈ సంబంధాలు ఇంకా బలపడటమే కాకుండా సాంకేతిక బదిలీ (టెక్నాలజీ ట్రాన్స్ఫర్) దశకు కూడా చేరుకున్నాయి.

    జార్జియా మెలోనీ తీవ్ర సంప్రదాయవాద, కరుడుగట్టిన జాతీయవాద భావజాలానికి ప్రతీక. ఆమె ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ అనే రైట్ వింగ్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇటీవల గల్ఫ్, మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాల్లో కూడా ఇలాంటి భావజాలాలు బలపడుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భావజాలాలు కలిసినప్పుడు ద్వైపాక్షిక బంధుత్వాలు సహజంగా పెరుగుతాయి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

    ఒకప్పుడు ఉదారవాదానికి (లిబరల్) నిలయంగా ఉండే ఐరోపా, ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు కూడా నేడు సంప్రదాయవాదం (కన్జర్వేటివ్) వైపు మొగ్గు చూపిస్తున్నాయని చాలామంది నిపుణులు గుర్తిస్తున్నారు. లండన్ నగరం ‘లండనిస్తాన్’గా మారిన తర్వాత అక్కడి రాజకీయ, సామాజిక వాతావరణంలో గణనీయమైన మార్పు వచ్చిందనే వాదన కూడా ఉంది.

    ఈ పర్యటనలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రధాని మోదీని అమితంగా అభిమానించే మెలోనీకి వారు ‘మెలోడీ చాక్లెట్’ బహూకరించడం. గతంలో టెలివిజన్ ప్రకటనలో “మెలోడీ ఖావో, ఖుద్ జాన్ జావో” అనే స్లోగన్ ప్రసిద్ధిచెందింది. ఇప్పుడు ఆ చాక్లెట్ అంతర్జాతీయ దౌత్యంలో భాగమై, మెలోనీ వ్యక్తిత్వంతో ముడిపడటం చర్చనీయాంశమైంది. హాస్యోక్తిగా చెప్పాలంటే, ఆమె పేరుకు తగ్గట్టుగా ‘మెలోడీ’ అందుకోవడంతో ఇటలీ-భారత్ సంబంధాలు ‘స్వీట్’ అయ్యాయని అంటున్నారు.

    ప్రపంచం కుడివైపు రాజకీయాల వైపు వాలుతున్న ఈ తరుణంలో, ప్రధాని మోదీ చాక్లెట్ దౌత్యంతో సంబంధాలను తీయగా మారుస్తూనే ఉన్నారు. సాంకేతిక బదిలీతో పాటు ఈ ‘మెలోడీ డిప్లమసీ’ భారత్ కు మరిన్ని అంతర్జాతీయ ప్రయోజనాలు తీసుకొస్తుందని ఆశించవచ్చా !.

    — వివరం

  • కాషాయం ముసుగు.. ఆయుధాల స్మగ్లింగ్

    కాషాయం ముసుగు.. ఆయుధాల స్మగ్లింగ్

    కాషాయం ముసుగు.. ఆయుధాల స్మగ్లింగ్

    ఏదో నాలుగు చేతబడులు, వశీకరణాలు చేసుకుంటూ అమాయక జనాన్ని భయపెట్టి బ్రతికేయక ఈ ఆయుధాల స్మగ్లింగ్ అవసరమారా ?

    రీల్స్‌లలో మాయాజాలం

    వాస్తవంలో తుపాకులు, ఆయుధాల రవాణా.
    ‘తాంత్రికుడు’ బాబీ ఆయుధాల స్మగ్లర్‌గా బట్టబయలు; ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం, అతని సోదరుడితో పాటు అరెస్టు

    ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో, సోషల్ మీడియాలో వేలాది మంది అనుచరులు ఉన్నారని గొప్పలు చెప్పుకునే ఒక ‘తాంత్రికుడి’ (మాంత్రికుడు) నేతృత్వంలోని వింతైన నేర ముఠాను పోలీసులు ఛేదించారు. పూజలు చేస్తానని, దెయ్యాలను వదిలిస్తానని, దుష్టశక్తులను తరిమికొడతానని చెప్పుకునే ఈ తాంత్రికుడు, తన సొంత సోదరుడు మరియు ఇంటి యజమానితో కుమ్మక్కై భారీ ఎత్తున అక్రమ ఆయుధాల రవాణాలో నిమగ్నమయ్యాడు.

    – తులసీరాం జీ

  • ఓడించడానికి వాళ్లెవరు?  ఓటమిలో కూడా విజయంనాదే..!!

    ఓడించడానికి వాళ్లెవరు? ఓటమిలో కూడా విజయంనాదే..!!

    ఓడించడానికి వాళ్లెవరు?

    ఓటమిలో కూడా విజయంనాదే..!!

    నొప్పిస్తే కూడా జన్మ ఇస్తుంది స్త్రీ….!!

    కరిగి పోయిన కాలమంతా కన్నీటి జతే..!!

    చిట్టికవితల మాహిమొహమ్మద్ ఈ మధ్య తన దారి
    మార్చుకొని మెయిన్ స్ట్రీమ్ వచనకవితల్లోకి వచ్చే..
    సింది..స్త్రీ ప్రధానంగా స్త్రీవాదకవితలురాస్తోంది.వాటికి
    కొంచెం తాత్వికతను కూడా మిక్స్ చేస్తోంది.ఈరోజు కాఫీటైమ్ కవిత కూడా ఇలాంటిదే.మీరుకూడాఓసారి
    ఈ కవిత చదవండి. ఆనక దీనిగురించి మాట్లాడు
    కుందాం.!

    “కరిగి పోయిన కాలం అంతా
    కన్నీటి జతే
    కాలం కాటేసిన కథలో
    ముగింపు అంతా వ్యధే

    కవితనో ,కావ్యాన్నో లిఖించని నన్నిలా
    గెలవడానికి ప్రయత్నం నేనే చేశాను
    ఓడించడానికి వాళ్లెవరు
    ఓటమిలో కూడా విజయంనాదే

    నా జీవిత కధనం అంతా నేనే లిఖించుకుంటాను
    నా దేశం సర్వ మతాలను సమానంగా ఆహ్వాని
    స్తుంటే భయమేముంది…
    వాక్ స్వాతంత్ర్యం అయినా లభించినoదుకు సంతోషం..

    నొప్పిస్తే కూడా జన్మ ఇస్తుంది స్త్రీ
    ఓర్పుతో ఓరిమితో బ్రతకాలి
    స్త్రీ అంటుంది సమాజం

    తను నొచ్చుకున్నా
    అతను నొచ్చుకున్నా
    స్త్రీ నే కప్పేస్తుంది భూమి
    వడిలో చేర్చుకుని
    శాంతిపజేస్తుంది భూమాత
    అమ్మ కదా! బిడ్డను అర్ధం జేసుకుని
    తనలో ఐక్యం చేసుకుంటేనే
    స్త్రీ మనసుకు శాంతి అని తెలుసు కాబోలు “

    *మాహి మొహమ్మద్..!!

    మన్నెం శారదగారి గురించి పరిచయమే అక్షర మాలనుపరిచయం చేయడమే..చిత్రకారుడి మిగ
    తా,కవయిత్రిగా,కథ,నవలా రచయిత్రిగా,సంగీత కారిణిగా.. ఒకటేమిటి..పేరుకు తగ్గట్టే..సర్వకళల సమాహారం శారద ఆమె..ఆల్ ఇన్వన్ఆమె.అయి
    తే నిజానికి శారద గారికి రచయిత్రికావాలనో ,ఆర్టి
    స్ట్ కావాలనో,ఇంకేదో కావాలనో,ఆశయాలూ కోరిక
    లేం లేవు. ఏదో సరదాగా డాన్స్ కూడా కాస్తంత
    తెలుసు. శాస్త్రబద్ధంగా ఏవీరావంటారామె.అయి
    తే ఇవన్నీ అంటే పిచ్చి. ఇష్టం.రచనల విషయాని
    కొస్తే కేవలంఆమె మనసు లోంచి వచ్చిన ఆలోచన
    ల్ని అలా రాసుకుంటూ పోయేవారు. .బొమ్మలు
    కూడా అంతే… !!

    “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
    యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః

    *ఎక్కడ మహిళలు గౌరవింపబడుతారో అక్కడ దేవ
    తలు సంచరిస్తుంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవింప
    బడతారో,ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజి
    స్తారో, అక్కడ సర్వ…సంపదలూ ఉండడమేకాక రధ,
    గజ, తురగ పదాదుల కూడిన లక్ష్మీ దేవి అచంచల
    యై వసిస్తుందట…!!

    స్త్రీలను గౌరవించే ఏకైకసమాజంమనది..మాతృదేవో
    భవ అంటూ అమ్మను తొలిదైవంగా భావించిన భార
    తీయ సమాజం మనది.!!

    ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి ప్రారంభం నుంచి
    కూడా స్త్రీ మూర్తులకు విశేషమైన,గౌరవప్రదమైన
    స్థానాన్ని కల్పించింది మన భారతీయ సమాజం. అన్నిరంగాల్లో కూడా రాణించి దేశ కీర్తిప్రతిష్ఠలను వినువీధులకు విస్తరింప జేశారు మన స్త్రీ మూర్తులు
    పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే మహి
    ళలకు కాస్తంతఎక్కువ ప్రాధాన్యతేశఉంది.

    అయితే…

    ఆకాశంలో సగం అంటూనే స్త్రీలను వంటింటికే పరి
    మితం చేసి,వారి హక్కులను హరించింది మన…
    సమాజం. ఆధునిక యుగంలో మహిళలు అన్ని
    రంగాల్లో పురుషులకు దీటుగా దూసుకుపోతున్నా
    రు.రాజకీయ, పరిపాలన,వ్యాపారరంగాల్లో ఎంద
    రో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు..అయినా..
    ఆడవాళ్ళకే ఎందుకో యింకా చిన్నచూపే..!

    అసలు మహిళలకు సహజంగా,చట్టపరంగాసంక్ర
    మించినహక్కులు,గౌరవం,ప్రాధామ్యాల విషయంలో పోరాటాలు చేసే దుస్థితి ఎందుకు వస్తోంది.సృష్టిలో
    స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే.ఆకాశం చెరిసగం
    గా పెంచేశారు కదా!ఇంకాఎందుకీవివక్ష?చిన్నచూపు.
    ఏ విధంగా చూసినా పురుషులకన్నా స్త్రీలు తక్కువేం
    కాదు..అయితే మార్పు మన ఆలోచనల్లో నుంచి.. మొదలవ్వాలి. మన కుటుంబాల్లో నుంచి మార్పు రావాలి.. ముఖ్యంగాఆడైనా,మగైనా.. తల్లిదండ్రులు
    వివక్ష చూపని రోజే,స్త్రీలకుగౌరవం,గుర్తింపు దక్కు
    తుంది..ఆరోజు కోసం ఎదురు చూద్దామంటోంది
    మాహి మొహమ్తీస్తుంది
    జీవిత కథనాన్ని ఎవరౌ లిఖించడమేంటి..?
    తానే లిఖించు కుంటానంటోంది మాహి.దేశంలో
    స్త్రీలకు కనీసం వాక్ స్వతంత్రమైనా లభించినoదు
    కు సంతోషమంటోంది. తరతరాల వివక్షతో స్త్రీ నలిగి
    పోతోంది. మానసికంగా దెబ్బతింటోంది.. అయినా..
    ఇదేంలోకం.. తనను నొప్పిస్తే కూడా జన్మ ఇస్తుంది
    కదా స్త్రీ..అలాంటి స్త్రీని చిన్నచూపు చూస్తారెందుకో?
    అంటోంది మాహి.

    సమాజంకూడా చిత్రమైంది. ఆడపిల్ల పుట్టింది మొద
    లు ఓర్పుతో, ఓరిమితో, బ్రతకాలంటుంది సమాజం.
    స్త్రీలునొచ్చుకున్నా, లేక మగవారు నొచ్చుకున్నా…
    చివరకొచ్చేసరికి వేలు స్త్రీలవైపుకే తిరుగుతుంది..
    ఆడాళ్ళకు ఆమాత్రం సహనం వుండొద్దా అంటూ..
    నీతులు చెబుతుంది. పరోక్షంగా స్త్రీ అభ్యున్నతికి
    గోతులు తీస్తుంది.స్త్రీలు భూమాత బిడచడలుకదా..
    స్త్రీలకు కష్టంవస్తే ఒడిలో చేర్చుకుని ఓదారుస్తుంది.
    అమ్మ కదా! బిడ్డను అర్ధం జేసుకుని తనలో ఐక్యం చేసుకుంటుంది భూమాత..కరిగి పోయిన కాలం
    కూడా కన్నీటితోనే జతకడుతుంది.కాలం కాటేసిన
    కథలో స్త్రీ కథముగింపంతా వ్యధే.

    ఈ పరిస్థితుల్లో మాహి ధైర్యం చూపింది.. తన
    మార్గాన్ని తానే ఏర్పరచుకుంది. కవితో, ,కావ్యమో
    లిఖించు కుంటూ తనను తాను గెలవడానికి ప్రయ
    త్నం చేస్తోంది.

    అయినా… ఓడించడానికి వాళ్లెవరు ఓటమిలో
    కూడా విజయంతనదే నంటూ విజయపతాకను..
    ఎగరేస్తున్నానంటోంది..

    స్త్రీలు స్వయం ప్రభలు కావాలన్నది ఈ కవిత..
    సారాంశం.. మంచి సందేశాత్మక కవిత ఇది..

    అభినందనలమ్మా..మాహిమహి..!,

    • ఎ. రజాహుస్సేన్..!!

  • అవినీతి డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు!

    అవినీతి డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు!

    అవినీతి డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు!

    నిర్దేశం, హైదరాబాద్:

    అక్రమాలు, అవినీతి ఆరోపణలతో సంచలనం సృష్టించిన డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలను సస్పెండ్ చేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
    షర్మిల చాలా కాలంగా డిప్యుటేషన్‌పై హెచ్‌ఎం‌డీఏలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కాలంలో ఆమెపై అవినీతి, అక్రమాల ఆరోపణలు విజిలెన్స్ నుంచి సీఎం ఆఫీసు వరకు అనేక ఫిర్యాదులు చేరాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు, ఆమెను హెచ్ ఎం డిఏ నుంచి బదిలీ చేయాలని నిర్ణయించారు.

    ఈ మేరకు కొంతకాలం క్రితం ఆమెను **ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ రెవెన్యూ డివిజన్ అధికారి గా, అలాగే జిల్లా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా బదిలీ చేశారు. అయితే షర్మిల మాత్రం హెచ్ ఎం డిఏ లోని తన కుర్చీని వదలకుండా తిష్ట వేశారు. ఉన్నతాధికారులు అనేక సార్లు మౌఖికంగా, రాతపూర్వకంగా బదిలీ స్థలానికి వెళ్లాలని ఆదేశించినా ఆమె ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించారు.

    ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్, ప్రభుత్వ పెద్దల సూచన మేరకు *టీసీఎస్ (సీసీ అండ్ ఎ) నియమావళి 1991లోని నియమం-8 ప్రకారం డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలను **మే 19న సస్పెండ్* చేశారు.

    సస్పెన్షన్ ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ కమిషనర్ కీలకమైన విషయాలను స్పష్టం చేశారు:

    • బదిలీ అయిన ఉట్నూర్‌లో జాయిన్ కాకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో *స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్* పనులకు భంగం కలిగింది.
    • తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు షర్మిల సస్పెన్షన్‌లోనే కొనసాగుతారు.
    • సస్పెన్షన్ కాలంలో సీసీఎల్ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వీడకూడదు.

    ఈ సస్పెన్షన్ ఉత్తర్వులతో షర్మిల అధికారిక వృత్తిపరమైన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

  • సొంత ఆస్తుల మాయా తనఖా: బయటపడ్డ రూ.30 కోట్ల భారీ కుంభకోణం!

    సొంత ఆస్తుల మాయా తనఖా: బయటపడ్డ రూ.30 కోట్ల భారీ కుంభకోణం!

    సొంత ఆస్తుల మాయా తనఖా: బయటపడ్డ రూ.30 కోట్ల భారీ కుంభకోణం!

    సాకేత్ ఇంజనీర్స్, విస్ట్రా ఐటీసీఎల్ సంస్థలపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదు

    నిర్దేశం, హైదరాబాద్:

    ఇతరుల విల్లాలు, ఫ్లాట్లను చట్టవిరుద్ధంగా తనఖా పెట్టి ఏకంగా రూ.30 కోట్ల మేర రుణాలు పొందిన సంచలన కుంభకోణం సైబరాబాద్ పరిధిలో వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (EOW) పోలీస్ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదైంది.
    అసలేం జరిగింది?
    నగరానికి చెందిన వ్యాపారి రోహిత్ రెడ్డి కుటుంబానికి మేడ్చల్ పరిధిలోని గౌడవెల్లిలో 13 ఎకరాల భూమి ఉంది. 2009లో ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ రవికుమార్ గొల్లపూడితో వారు జీపీఏ (GPA) ఒప్పందం చేసుకున్నారు. అక్కడ విల్లా ప్రాజెక్టు చేపట్టాలన్నది అసలు ఉద్దేశం.
    ఒప్పందం ప్రకారం వాటాలు: భూయజమానులకు 36%, అభివృద్ధి చేసిన బిల్డర్‌కు 64% చొప్పున వాటాలు ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఫేజ్-1 కింద మొత్తం 220 విల్లాలు నిర్మించాలని ప్రతిపాదించారు.
    8 విల్లాల కేటాయింపు: ఆ తర్వాత 2019లో జరిగిన మరో ఒప్పందం ప్రకారం రోహిత్ రెడ్డి కుటుంబానికి 8 విల్లాలు కేటాయించారు. అందులో ఒక నిర్మాణం 2021లో పూర్తయింది. దీనిని రోహిత్ రెడ్డికి ఆయన తండ్రి గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేశారు.

    ఈసీ (EC) తీస్తే అసలు రంగు బయటపడింది!

    రోహిత్ రెడ్డి ఈ విల్లాను తాకట్టు పెట్టి 2025లో రుణం తీసుకున్నారు. అయితే, ఈ నెల 2వ తేదీన ఈ విల్లాలకు సంబంధించిన ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC) కోసం ఆరా తీయగా షాకింగ్ నిజం బయటపడింది. ఆస్తి రికార్డుల్లో రోహిత్ రెడ్డి కుటుంబానికి బదులుగా రవికుమార్ గొల్లపూడి, రాధాకృష్ణ తిమ్మరాజు, ప్రియా తిమ్మరాజు తదితరులు యజమానులుగా ఉన్నట్లు వెలుగుచూసింది. అంతేకాకుండా, ఆ ఆస్తిని అక్రమంగా తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు కూడా తేలింది.

    5 విల్లాలు, 36 ఫ్లాట్లు స్వాహా..

    బాధితుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నిందితుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇదే తరహాలో సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఇతరులకు చెందిన మొత్తం 5 విల్లాలు, 36 ఫ్లాట్లను అక్రమంగా తనఖా పెట్టి రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని రుణంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది.
    ఎఫ్‌ఐఆర్ (FIR) లో నమోదైన నిందితుల పేర్లు:
    బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

    ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల వివరాలు:

    1. రవికుమార్ గొల్లపూడి
    2. రాధాకృష్ణ తిమ్మరాజు
    3. ప్రియా తిమ్మరాజు
    4. సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్
    5. విస్ట్రా ఐటీసీఎల్ లిమిటెడ్
    ఈ భారీ మోసానికి సంబంధించి నిందితుల పాత్రపై, బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

  • మంత్రాలొస్తే అన్నం వస్తుందా?

    మంత్రాలొస్తే అన్నం వస్తుందా?

    మంత్రాలొస్తే అన్నం వస్తుందా?

    ఈ మధ్యకాలంలో మనం ప్రాక్టికల్ లైఫ్‌ని పక్కనపెట్టి, ‘భక్తి చానెళ్ల’ సబ్‌స్క్రిప్షన్లు పెంచుకోవడంలోనే ఎక్కువ బిజీగా ఉన్నాం. పొలాల్లో రైతులు చెమటోడ్చి, ఎండనక వాననక కష్టపడితేనే ప్లేట్లోకి అన్నం వస్తుందనేది ఒకప్పటి పాతకాలపు ముతక నమ్మకం. ఇప్పుడంతా అప్‌గ్రేడ్ అయిపోయాం కదా! ఒక చిన్న తిండిగింజ కూడా పండించలేని మంత్రాలు, ప్రేయర్లు, దువాలు మన జీవితాల్ని మార్చేస్తాయని ఎంత గట్టిగా నమ్ముతున్నామంటే… రేపు పొద్దున వంటగదిలో బియ్యం అయిపోతే షాపుకి వెళ్లడం మానేసి, గ్యాస్ స్టవ్ ముందు కూర్చుని గంటల తరబడి స్తోత్రాలు చదివినా ఆశ్చర్యం లేదు! ఆకాశం నుండి నేరుగా బిర్యానీ పొట్లాలు రాలిపోవాలని కోరుకోవడం ఎంత అమాయకత్వమో, చేతులు కదపకుండా కేవలం మత విశ్వాసాలతో బతుకులు మారిపోతాయనుకోవడం కూడా అంతే అమాయకత్వం.

    చిత్రం ఏంటంటే, వర్షాలు పడకపోతే చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం లాంటి లాజికల్ పనులు చేయకుండా, పెద్ద ఎత్తున హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు చేసి మేఘాలను బెదిరించాలని చూస్తాం. చదువుకుని బుర్ర పెంచుకోవడం శ్రమతో కూడుకున్న పని కాబట్టి, పరీక్షల్లో పాస్ అవ్వడానికి రాత్రింబవళ్ళు చదవకుండా పెన్నుకు పూజ చేసి వెళ్లే సరికొత్త ‘భక్తి సైన్స్’ని కనిపెట్టాం. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లే ఓపిక లేక, ఏ బాబా పాదాల దుమ్మో లేక పవిత్ర తీర్థమో తాగేసి సూపర్ మ్యాన్ అయిపోవాలని చూస్తున్నాం.

    దేవుడిపై నమ్మకం అనేది మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందేమో కానీ, ఆకలి వేసినప్పుడు ప్లేటులో అన్నాన్ని మాత్రం తెచ్చివ్వలేదు. ఆ అన్నం గింజ వెనుక ఒక రైతు శ్రమ ఉంది, ఆ గింజ మొలకెత్తడం వెనుక ఒక సైన్స్ ఉంది. విజ్ఞానం లేని విశ్వాసం గుడ్డిది మాత్రమే కాదు, సమాజాన్ని వెనక్కి నెట్టేసే ఒక పెద్ద భ్రమ. అందుకే, మంత్రాలు చదివి సమయం వృథా చేయడం కాసేపు ఆపి… ఆకలి తీరడానికి వ్యవసాయాన్ని, బతుకు మారడానికి విజ్ఞానాన్ని నమ్ముకుంటే దేశానికి, మన బుర్రకి కూడా చాలా మంచిది!

    — వి. వి. ప్రసాదరావు,
    జన విజ్ఞాన వేదిక

  • చరిత్రను మార్చిన ఆ సముద్ర ప్రయాణం

    చరిత్రను మార్చిన ఆ సముద్ర ప్రయాణం

    చరిత్రను మార్చిన ఆ సముద్ర ప్రయాణం

    మే 20, 1498… ప్రపంచ చరిత్ర గమనాన్ని పూర్తిగా మార్చేసిన రోజు. ఐరోపా ఖండం నుండి ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుంటూ, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల ఉప్పెనలను దాటుకుంటూ పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా నేతృత్వంలోని నౌకలు భారతదేశంలోని కాలికట్ (ప్రస్తుత కోజికోడ్, కేరళ) తీరానికి చేరుకున్నాయి. అప్పటివరకు పశ్చిమ దేశాలకు భారతదేశం అంటే ఒక అందమైన కల, సుగంధ ద్రవ్యాల నిలయం. వాస్కోడగామా కనుగొన్న ఈ కొత్త సముద్ర మార్గం భారతదేశ చరిత్రను, ఆర్థిక వ్యవస్థను, రాజకీయ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ అన్వేషణ భారతదేశంపై చూపిన బహుముఖ ప్రభావాలపై ప్రత్యేక విశ్లేషణ.

    అంతర్జాతీయ వ్యాపారంలో కొత్త శకం – అరబ్బుల ఆధిపత్యానికి గండి

    వాస్కోడగామా రాకకు ముందు భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాల (మిరియాలు, యాలకులు, లవంగాలు) వ్యాపారం భూమార్గం ద్వారా లేదా ఎర్ర సముద్రం మీదుగా అరబ్ వర్తకుల ద్వారా సాగేది. దీనివల్ల ఐరోపా దేశాలకు చేరేసరికి వీటి ధరలు ఆకాశాన్ని తాకేవి.
    పోర్చుగీసు ఏకాధిపత్యం: సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత, పోర్చుగీసు వారు అరబ్ వర్తకులను పక్కకు నెట్టి హిందూ మహాసముద్రంపై పట్టు సాధించారు.
    ‘కార్టాజ్’ విధానం: సముద్రంపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వారు ‘కార్టాజ్’ (Cartaz) అనే పాస్ లేదా లైసెన్స్ విధానాన్ని తెచ్చారు. దీని ప్రకారం ఇతర దేశాల ఓడలు పోర్చుగీసు వారికి పన్ను కట్టాల్సి వచ్చేది. ఇది భారతీయ తీర ప్రాంత వర్తక స్వేచ్ఛను దెబ్బతీసింది.

    వలసవాదానికి నాంది-రాజకీయ సంక్షోభం

    వాస్కోడగామా రాక కేవలం వ్యాపారంతో ముగిసిపోలేదు. అది ఐరోపా సామ్రాజ్యవాదానికి దారి తీసింది.
    ప్రాంతీయ ఆక్రమణలు: పోర్చుగీసు వారు భారతదేశంలోని అంతర్గత రాజకీయ విభేదాలను ఆసరాగా చేసుకుని గోవా, దామన్, దియూ, కొచ్చిన్ వంటి తీర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
    ఇతర శక్తుల ప్రవేశం: పోర్చుగీసు వారి లాభాలను చూసి డచ్, ఫ్రెంచ్, ఆంగ్లేయులు (బ్రిటిష్ వారు) ఒకరి తర్వాత ఒకరు భారతదేశంలోకి ప్రవేశించారు. చివరికి ఈ పరుగులాటలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించి, భారతదేశాన్ని దాదాపు రెండు శతాబ్దాల పాటు గులాంగిరీలోకి నెట్టడానికి వాస్కోడగామా వేసిన బాటనే పునాది.

    వంటగదిని మార్చేసిన విదేశీ పంటలు

    పోర్చుగీసు వారి రాక వల్ల భారతదేశానికి జరిగిన సానుకూల మార్పులలో వ్యవసాయ రంగం ఒకటి. నేడు మన నిత్యజీవితంలో భాగమైన ఎన్నో కూరగాయలు, పంటలను పోర్చుగీసు వారు ‘కొత్త ప్రపంచం’ (అమెరికా ఖండాల) నుండి భారతదేశానికి పరిచయం చేశారు.
    నేడు మన వంటకాల్లో అసలు సిసలైన ఘాటును ఇచ్చే మిరపకాయలు, పొటాటో చిప్స్ లేనిదే గడవని బంగాళాదుంపలు, ప్రతి కూరలోనూ వాడే టమోటాలు వారి ద్వారానే మన దేశానికి వచ్చాయి.
    వీటితో పాటు మొక్కజొన్న, జీడిపప్పు, అనాస (pineapple), బొప్పాయి, పొగాకు పంటలను కూడా పోర్చుగీసు వారే భారత్‌కు తీసుకువచ్చారు. వీరు రాకపోతే మన ఆహార సంస్కృతి మరోలా ఉండేదనడంలో సందేహం లేదు.

    మత, సామాజిక మార్పులు

    పోర్చుగీసు వారు వ్యాపారంతో పాటు తమ మతాన్ని కూడా ఇక్కడ విస్తరించాలని గట్టిగా ప్రయత్నించారు.
    క్రైస్తవ మత వ్యాప్తి: కేరళ, గోవా తీర ప్రాంతాలలో రోమన్ క్యాథలిక్ సంప్రదాయాన్ని వారు విస్తృతంగా ప్రచారం చేశారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వంటి మిషనరీలు ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేశారు.
    సంస్కృతుల కలయిక: పోర్చుగీసు, భారతీయ సంస్కృతుల కలయిక వల్ల ఒక కొత్త జీవన విధానం, వంటకాలు (ఉదాహరణకు గోవా వంటకాలు), ‘ఇండో-పోర్చుగీస్’ నిర్మాణ శైలి రూపుదిద్దుకున్నాయి. గోవాలోని చర్చిలు నేటికీ ఆ కాలపు శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

    సాంకేతిక విప్లవం:

    ప్రింటింగ్ ప్రెస్, ఆధునిక ఆయుధాలు

    మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్: భారతదేశ చరిత్రలో సాంకేతిక పరంగా పోర్చుగీసు వారు చేసిన అతిపెద్ద సహకారం ‘ప్రింటింగ్ ప్రెస్’. 1556 లో గోవాలో భారతదేశపు మొట్టమొదటి ముద్రణా యంత్రాన్ని వారు స్థాపించారు. ఇది దేశంలో విజ్ఞాన వ్యాప్తికి, పుస్తకాల ముద్రణకు పునాది వేసింది.
    యుద్ధ తంత్రాలు: ఐరోపా నావికులు ఉపయోగించిన అధునాతన తుపాకులు, నౌకలపై అమర్చిన ఫిరంగులు భారతీయ రాజుల సాంప్రదాయ యుద్ధ పద్ధతులను మార్చేశాయి.

    హిందూ మహాసముద్రపు అలలపై వాస్కోడగామా నడిపిన నౌకలు భారతదేశ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయి. ఒకవైపు అంతర్జాతీయ వ్యాపార మార్గాలు తెరుచుకుని, ఆధునిక సాంకేతికత, కొత్త పంటలు దేశంలోకి వచ్చినప్పటికీ… మరోవైపు దేశ సార్వభౌమత్వానికి గండం వాటిల్లి వలసపాలనకు దారి తీసింది. ఆనాటి కాలికట్ తీరంలో పడిన అడుగులు, ఆధునిక భారతదేశ చరిత్రను లిఖించడంలో అత్యంత కీలకమైన ఘట్టంగా మిగిలిపోయాయి.

    — వి. వి. ప్రసాదరావు,
    జన విజ్ఞాన వేదిక

  • మతాన్ని పక్కన పెట్టు…

    మతాన్ని పక్కన పెట్టు…

    మతాన్ని పక్కన పెట్టు…

    ముందు మొక్కకి నీళ్లు కొట్టు !

    “2030 కల్లా ఈ దేశాన్ని ఆ మత రాజ్యంగా మారుస్తాం!” అంటాడు ఒకడు !

    “లేదు లేదు, 2035 కల్లా మా మత రాజ్యమే వస్తుంది!” అంటాడు ఇంకొకడు !

    “2040 కల్లా అందరూ మా దేవుడి కిందే ఉంటారు చూసుకోండి!” అంటాడు మరొకడు !

    ” ఫ్రెండ్స్ … ఒక చిన్న బ్యాడ్ న్యూస్. మీరు ప్లాన్ చేసుకునే 2035 కల్లా ఇక్కడ టెంపరేచర్ 60 డిగ్రీలు దాటేలా ఉంది. మీరందరూ పైన ఏసీ రూముల్లో సెటిల్ అయిపోతే… కింద ఈ మత రాజ్యాలు ఎవరితో పెట్టిస్తారు? శవాలతోనా?!” ఒక మానవవాది హెచ్చరిక.. !!

    మన ఫ్యూచర్ ‘అభివృద్ధి’ ఎలా ఉండబోతోందంటే…

    గాలి: ఫ్రీగా పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేదు. ఫ్యూచర్‌లో లవర్స్ “నీకోసం ప్రాణమిస్తా” అని కాదు… “నీకోసం రెండు ఆక్సిజన్ సిలిండర్లు కొనిస్తా” అని లవ్ ప్రపోజల్స్ చేసుకోవాలి!
    నీరు: ఆల్రెడీ కొనుక్కుని తాగుతున్నాం. త్వరలో బంగారాన్ని లాకర్‌లో పెట్టినట్టు, మంచినీళ్ల బాటిల్‌ని బీరువాలో పెట్టి తాళం వేసుకోవాల్సి వస్తుంది.
    వాతావరణం: వర్షం వస్తే ఇళ్లు కొట్టుకుపోతాయి, ఎండ కొడితే రోడ్డు మీదే ఆమ్లెట్ పడిపోతుంది. నీడ కోసం చెట్టు వెతుకుదామంటే… డిజైన్ డిజైన్ సిమెంట్ చెట్లు తప్ప అసలైనవి కనిపించవు.
    ఫుడ్ మెనూ: పొద్దున్న ‘పారాసిటమాల్’ ఇడ్లీ, మధ్యాహ్నం ‘క్యాన్సర్’ బిర్యానీ, రాత్రికి ‘ఫెర్టిలైజర్’ ఫ్రైడ్ రైస్. అంతా కెమికల్ మయం!
    ప్లాస్టిక్: భూమిని తవ్వితే బంగారం దొరకడం ఎప్పుడో ఆగిపోయింది, ఇప్పుడు పొరలు పొరలుగా ప్లాస్టిక్ కవర్లు, స్పూన్లు మాత్రమే దొరుకుతున్నాయి.

    క్లైమాక్స్ సీన్:

    ఇంకో పదేళ్లలో ధ్రువాల్లో మంచు కరిగి, సముద్రాలు ఉప్పొంగి 40% నాగరికత ‘స్వాహా’ అయిపోతుందట. తుఫానులు, భూకంపాలు లైవ్ షో లాగా వస్తుంటాయి.

    బాగుపడదాం రండి (ఇప్పటికీ మించిపోలేదు!

    మన పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ… బ్రతకడానికి కాస్త గాలి, నీరు మిగిల్చితే చాలు. వాళ్ల బుర్రల్లో మతాల విద్వేషపు కెమికల్స్ నింపడం ఆపి, కాస్త చేతనైతే ఇంటికో మొక్క నాటండి.
    * స్మశానాల మీద మత సామ్రాజ్యాలు కట్టడం కంటే…
    * పచ్చని భూమి మీద మనుషులుగా బ్రతకడం బెటర్ కదా!
    మతాలకి పుట్టిన ‘కార్పొరేట్ రోబోలు’ లాగా కాకుండా… కనీసం మనుషులకు పుట్టిన ‘మనుషులుగా’ జీవిద్దాం!

    “మతాన్ని పక్కన పెట్టు… ముందు మొక్కకి నీళ్లు కొట్టు!”

    — వి. వి. ప్రసాదరావు,
    జన విజ్ఞాన వేదిక

  • పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలు అవసరం

    పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలు అవసరం

    – మేయర్ ఉమారాణి

    నిర్దేశం, నిజామాబాద్ :

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా, సమగ్ర శిక్షా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మే 11 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న “విద్యా వారోత్సవాలు”లో “కళా వైభవం – కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్” కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మేయర్ ఉమారాణి తెలిపారు.

    మేయర్ మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పాఠ్యాంశాలతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది వేస్తాయని ఆమె పేర్కొన్నారు.

    “కళా వైభవం” ద్వారా పిల్లలు తమ భావాలను రంగుల రూపంలో వ్యక్తపరచడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో కలిసి విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించిన మేయర్, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా అధికారులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

    విద్యలోనూ, కళల్లోనూ రాణించి విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని మేయర్ ఉమారాణి ఆకాంక్షించారు.

  • బండి భగీరథ్ అరెస్ట్

    బండి భగీరథ్ అరెస్ట్

    సరెండర్ అని బండి సంజయ్.. అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేష్ !

    రాజకీయ లబ్ది కోసం కేంద్ర మంత్రి ‘క్రెడిట్ గేమ్’..

    మీడియాపై రెండు వైపులా ఒత్తిడి!

    మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాలు నమోదు..

    (యాటకర్ల మల్లేష్ ముదిరాజ్)

    : మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి 8.15 గంటలకు పోలీస్ అకాడమీ సమీపంలో అరెస్టు చేశామని సైబరాబాద్ సీపీ రమేష్ ప్రకటించారు. అయితే ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం “మా అబ్బాయి స్వయంగా లొంగిపోయాడు” అని ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు రెండు వ్యతిరేక వార్తలు.. రాజకీయ లబ్ది కోసం బండి సంజయ్ ఆడుతున్న క్రెడిట్ గేమ్ మీడియాకు తలనొప్పిగా మారింది!

    హైకోర్టు షాక్.. ఇంటరిమ్ రక్షణ నిరాకరణ

    తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ టి. మాధవి దేవి శుక్రవారం రాత్రి భగీరథ్ తరపు న్యాయవాదుల అరెస్టు నుంచి ఇంటరిమ్ రక్షణ ఇవ్వాలనే అభ్యర్థనను కొట్టేసారు. బాధితురాలి వాంగ్మూలం చూసి “ఇప్పటి దశలో రక్షణ ఇవ్వడానికి ఇష్టం లేదు” అని స్పష్టం చేశారు. హైకోర్టు షాక్ తర్వాతనే ఆజ్ఞాతంలో ఉన్న భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

    అరెస్ట్ వర్సెస్ సరెండర్.. ఎవరి వార్త నిజం?

    పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు: “పోలీసుల కథనం ప్రకారం మేరకు సైబరాబాద్ ఎస్ వోటీ బృందం నర్సింగి పరిధిలోని మంచీరేవుల టెక్ పార్క్ సమీపంలో భగీరథ్‌ను పట్టుకుంది. సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని ప్రకటించారు.”

    అయితే బండి సంజయ్ కార్యాలయం నుంచి వచ్చిన స్టేట్‌మెంట్ ఇంకా భిన్నంగా ఉంది: “చట్టంపై గౌరవంతో న్యాయవాదుల ద్వారా మా అబ్బాయిని విచారణకు అప్పగించాం.”

    ఈ డ్యూయల్ నెరేటివ్‌తో మీడియాపై ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు బండి సంజయ్ కార్యాలయం నుంచి తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. “లొంగిపోయాడని స్క్రోలింగ్ వేయండి” వర్సెస్ “అరెస్టు చేశామని వార్త ఇవ్వండి” అని రెండు వైపులా ఫోన్లు, మెసేజులు వస్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

    బండి భగీరత్ కేసు వివరాలు

    • మే 8, 2026న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం సెక్షన్ 5(1), 6 మరియు BNS సెక్షన్ 64(2)(m) కింద కేసు నమోదు.
    • దర్యాప్తు అధికారి బాధితురాలి, తల్లి వాంగ్మూలాలు రికార్డు చేశారు. BNSS సెక్షన్ 183 కింద మేజిస్ట్రేట్ ముందు నమోదు.
    • కరీంనగర్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో బృందాలు పంపి, లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.
    • శనివారం రాత్రి పోలీస్ అకాడమీ సమీపంలో నాకా-బందీలో భగీరథ్ అదుపులోకి వచ్చాడు.
    • పంచ సాక్షుల సమక్షంలో విచారణలో నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వైద్య పరీక్షలు, మేజిస్ట్రేట్ హాజరు అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు.

    బాధితురాలి వాంగ్మూలాలు.. హైకోర్టు ముందు కీలకం

    శనివారం మేడ్చల్ మేజిస్ట్రేట్ ముందు 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి 40 నిమిషాల పాటు వాంగ్మూలాలు ఇచ్చారు. బాధితురాలి తరపు న్యాయవాది పప్పు నాగేశ్వర్ రావు హైకోర్టులో సమర్థవంతమైన వాదనలు చేసి ఇంటరిమ్ రక్షణను అడ్డుకున్నారు. బండి సంజయ్ అధికార పలుకుబడిని ఉపయోగించి వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని, కరీంనగర్ ఏక్తా యాత్రలో బెదిరింపులు చేశారని ఆరోపించారు. మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీ, రాష్ట్రపతికి లేఖలు రాశారు.

    రాజకీయ దుమారం.. అన్ని వైపులా విమర్శలు

    • బీఆర్‌ఎస్ నాయకులు (డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్): కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహించిందని, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని ఆరోపణ.
    • మహిళా సంఘాలు: బండి సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి లేఖలు.
    • సీఎం రేవంత్ రెడ్డి: “కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించాలి” అని సూచన.

    బండి సంజయ్ భావోద్వేగ ప్రకటన

    “మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. చట్టం ముందు అందరూ సమానమే. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం” అని బండి సంజయ్ భావోద్వేగంగా ప్రకటించారు.
    కేసు ట్విస్ట్: బాధితురాలికి రెండు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని, ఆమె మైనర్ కాదని భగీరథ్ వైపు నుంచి కౌంటర్ ఆరోపణలు. భగీరథ్ కూడా బాలిక, తల్లిపై కౌంటర్ ఫిర్యాదు చేశాడు.

    దిశా నిర్దేశం:
    ఈ కేసు చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశం ఇస్తోంది. రాజకీయ ప్రభావాలు, అధికార పలుకుబడి లేకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. బాధితురాలి గోప్యత, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక హామీ ఇవ్వాలి. న్యాయం త్వరగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజల్లో చట్టం పట్ల నమ్మకం పెరుగుతుంది. కోర్టు తీర్పు ఏమైనా.. న్యాయం జరగాలి!

  • మాక్సిం గోర్కీ రచించిన “అమ్మ”

    మాక్సిం గోర్కీ రచించిన “అమ్మ”

    మాక్సిం గోర్కీ రచించిన “అమ్మ” నవల ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక ధ్రువతార వంటిది. ఈ పుస్తకం, కేవలం ఒక కథ మాత్రమే కాదు, అణచివేతకు వ్యతిరేకంగా సామాన్యులు సాగించిన పోరాట ప్రతిబింబం.

    1. నేపథ్యం మరియు రచయిత

    రచయిత: మాక్సిం గోర్కీ (రష్యన్ విప్లవ రచయిత).
    కాలం: 1906లో అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు గోర్కీ దీనిని రాశారు.
    నేపథ్యం: 1905 నాటి రష్యా విప్లవ విఫలయత్నం తర్వాత, కార్మికులలో స్ఫూర్తిని నింపడానికి ఈ నవల ఒక గొప్ప ఆయుధంగా పనిచేసింది.

    2. ప్రధాన కథాంశం

    నవల ప్రధానంగా ‘పెలాగియా నిలోవ్నా’ అనే ఒక సాధారణ మధ్యతరగతి స్త్రీ (అమ్మ) చుట్టూ తిరుగుతుంది.
    ఆమె భర్త తాగుబోతు, హింసాప్రవృత్తి కలవాడు. అతని మరణం తర్వాత, ఆమె కొడుకు ‘పావెల్ వ్లాసోవ్’ విప్లవం వైపు ఆకర్షితుడవుతాడు.

    మొదట్లో తన కొడుకు భద్రత గురించి భయపడే పెలాగియా, క్రమంగా విప్లవ సిద్ధాంతాలను అర్థం చేసుకుంటుంది.
    కేవలం కొడుకు మీద ప్రేమతో మొదలైన ఆమె ప్రయాణం, ప్రపంచంలోని పీడిత ప్రజలందరి మీద ప్రేమగా మారి, ఆమెను ఒక విప్లవ కార్యకర్తగా మారుస్తుంది.

    3. నవలలోని ముఖ్యమైన అంశాలు

    సామాజిక స్పృహ: శ్రమ దోపిడీని, ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను గోర్కీ కళ్ళకు కట్టినట్లు వివరించారు.

    స్త్రీ చైతన్యం: భయం భయంగా బతికే ఒక గృహిణి, వ్యవస్థను ప్రశ్నించే స్థాయికి ఎదిగే తీరు ఈ నవలలో అద్భుతంగా ఉంటుంది.

    మానవీయ సంబంధాలు: విప్లవకారుల మధ్య ఉండే స్నేహం, త్యాగం మరియు పరస్పర గౌరవాన్ని గోర్కీ ఎంతో ఆర్ద్రతతో చిత్రించారు.

    4. ప్రాముఖ్యత

    సోషలిస్ట్ రియలిజం: ఈ నవల “సోషలిస్ట్ రియలిజం” (సామాజిక వాస్తవికత) అనే సాహిత్య ధోరణికి పునాది వేసింది.

    ప్రపంచ ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా వందలాది భాషల్లోకి అనువదించబడింది. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు నాట కమ్యూనిస్ట్ మరియు అభ్యుదయ ఉద్యమాలపై దీని ప్రభావం అపారం.

    ప్రేరణ: “మన రక్తాన్ని ధారబోసి అయినా రేపటి తరానికి వెలుగును ఇవ్వాలి” అనే సందేశం పాఠకుల్లో విపరీతమైన స్ఫూర్తిని నింపుతుంది.

    ముగింపు:

    “అమ్మ” పుస్తకం చదవడం అంటే ఒక చారిత్రక ఉద్యమాన్ని అనుభవించడమే. వ్యక్తిగత స్వార్థాన్ని వీడి, సమాజం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ఒక పాఠ్యగ్రంథం వంటిది. మీకు విప్లవ సాహిత్యం లేదా సామాజిక మార్పు మీద ఆసక్తి ఉంటే, తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

    – ఉయ్యాల సురేందర్