Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల‌కు ముంచి ఉన్న మ‌రో ప్ర‌మాదం

అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

0 37

నిర్దేశం, హైద‌రాబాద్ః ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరిపినిచ్చాయి. దీంతో కాస్త రిలీఫ్ కలిగినా.. ఏపీతో పాటుగా తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. గురువారం దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని వాతావరణ శాఖ‌ నిపుణులు తెలిపారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఏఏ జిల్లాలకు ఏ‌ అలర్ట్‌ ఉందో.. ఇప్పుడు తెలుసుకుందామా..

ఏపీలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఓ గంటపాటూ భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా మోస్తరుగా కురుస్తాయి. ఇవాళ రాయలసీమలో మాత్రం వర్షాలు లేవు. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

మరోవైపు తెలంగాణకు భారీ వర్ష సూచన అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసిన అధికారులు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆల్రెడీ మంగళవారం రాత్రి నుంచి తెలంగాణలో వాన పడుతోంది. ఇక హైదరాబాద్‌లోనూ ఇవాళ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking