రూ.99కే హైదరాబాద్ టూ బెంగళూరు ఏసీ ప్రయాణం
ఈ సందర్భంగా రూ. 99కే టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాలని..
నిర్దేశం, హైదరాబాద్ః రూ.99కే హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం.. ఏంటి.! వార్త వినగానే షాక్ అవుతున్నారా.. నిజమండీ బాబూ.. ఫ్లిక్స్ బస్ సర్వీసుల గురించి మీరు వినే ఉంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బ్రాండ్‌ను విస్తరించే క్రమంలో ఈ రూ. 99 ఆఫర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే ఫ్లిక్స్ బస్ సంస్థ బెంగళూరు టూ చెన్నై, బెంగళూరు టూ హైదరాబాద్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. చెన్నై, హైదరాబాద్‌తో పాటు బెంగళూరు నుంచి మరో 31 నగరాలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది ఫ్లిక్స్ బస్ సంస్థ. ఈ సందర్భంగా రూ. 99కే టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాలని.. అలాగే ప్రయాణ తేదీలు సెప్టెంబర్ 11- అక్టోబర్ 6 మధ్య ఉండాలని పేర్కొంది.