హరీశ్ రావు ఎమ్మెల్యేలతో వస్తే తగిన ప్రధాన్యం ఇస్తాం.

హరీశ్ రావు ఎమ్మెల్యేలతో వస్తే తగిన ప్రధాన్యం ఇస్తాం.
– మంత్రి సంచలన వ్యాఖ్యాలు
నిర్దేశం, హైదరాబాద్ :

హరీష్ రావు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామన్నారు రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ ల పేర్ల మీద విడిపోతుందని అన్నారు. టీఆర్ఎస్ లో నాలుగు పార్టీలు అవుతాయని అన్నారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని పేర్కొన్నారు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని తెలిపారు. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడు… ఆయన పులి ఎట్లా అవుతాడు? అని ప్రశ్నించారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే… 86 కిలోలు ఉన్న నేనేం కావాలని ప్రశ్నించారు. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని చూస్తే గ్రామీణ వాతావరణం ఉట్టి పడాలి. చాకలి ఐలమ్మ గుర్తుకు రావాలి. అందుకే రూపురేకలు మార్చాలని చూస్తున్నామన్నారు. గాంధీ కుటుంభం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించింది..అందుకే వారి విగ్రహాలు పెడుతున్నామన్నారు. గద్దర్ పేరు మీద అవార్డు ఇస్తున్నామన్నిరు ఆయన. రెండు రోజుల్లో గద్దర్ అవార్డు కమిటీ ఏర్పాటు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »