Take a fresh look at your lifestyle.

About Us

నిర్దేశం.
మన దిశా నిర్దేశం

పాలన వ్యవస్థలో పెరిగిన అవినీతి.. అక్రమార్జన.. అన్యాయాల వల్ల
ప్రజాస్వామ్యానికి పెద్ద సవాల్ గా మారింది.

సాతంత్ర్యం సిద్దించి ఏడు దశబ్దాలు దాటినా
నేటికి మన వ్యవస్థ ఇలా కావడానికి కారణం..???
పొలిటికల్ (ప్రజాస్వామ్య) వ్యవస్థనే..

ప్రజాస్వామ్యంకు మూల స్థంభాలు నాలుగు

1.లెజిస్లేచర్ – శాసనములు,

2. ఎగ్జిక్యూటివ్ – శాసనములు అమలు పరుచు యంత్రాంగం,

3.జ్యూడిషరీ – న్యాయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలోని లొసుగులను వేలేత్తి చూపడం వల్లే

4. ప్రెస్ – పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాను ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం అని పిలుస్తున్నారు.
కానీ, గంజాయి వనంలో తులసి మొక్కలా కొందరు నిజాయితీగా ప్రజా సేవా ధ్యేయంగా పని చేస్తున్నవారున్నారు. అలాంటి నిస్వార్థులకు తల వంచి సెల్యూట్ చేద్దాం..
అయినా.. ఈ సమాజం అవినీతి కంపుతో, స్వార్థ రాజకీయాలతో కుళ్లి పోయింది.
కుళ్లిన ఈ వ్యవస్థకు శస్త్ర చికిత్స చేయడానికి ‘‘నిర్దేశం’’ అక్షరాలను ఆయుధంగా చేసుకుని మీ ముందుకు వస్తోంది.

ఈ సమాజంలోని కుళ్లును ‘‘ప్రజాకోర్టు’’లో క్లీన్ చేయడానికి సిద్దంగా ఉన్నాం…
‘‘నిర్దేశం’’ ఎవరికి తలవంచ కుండా నిస్వార్థంగా వార్త కథనాలు ఇస్తోంది.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
ఎడిటర్ ఇన్ చీఫ్

Breaking