రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ‘బీస్ట్’

  • ఈ నెల 13న వచ్చిన ‘బీస్ట్’
  • పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ 
  • తనదైన స్టైల్ తో మేజిక్ చేసిన విజయ్
  • ప్రధానమైన బలంగా అనిరుధ్ సంగీతం
విజయ్ తాజా చిత్రంగా ఈ నెల 13వ తేదీన ‘బీస్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, రెండో రోజుకి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 
తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా అయినా, తొలి రెండు మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతూ ఉంటుంది. ఆయనకి ఉన్న ఫాలోయింగ్ ..  మార్కెట్ అలాంటిది. ఇక అనిరుధ్ సంగీతం కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

నిజానికి ఆయన స్వరపరిచిన ‘అరబిక్ కుతు’ సాంగ్, ఈ సినిమా ఓపెనింగ్స్ లో ప్రధానమైన పాత్రను పోషించిందనే చెప్పాలి. ఇక దర్శకుడిగా రెండు భారీ హిట్లు నెల్సన్ దిలీప్ కుమార్ ఖాతాలో ఉండటం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. కథలో కొత్తదనం లేకపోయినా, తనదైన స్టైల్ తో విజయ్ చేసిన మేజిక్ బాగానే వర్కౌట్ అయింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!