Take a fresh look at your lifestyle.

మిర్యాలగూడలో రౌడీ షీటర్ జునేయిద్ ను అరెస్ట్

0 43

మిర్యాలగూడలో రౌడీ షీటర్ జునేయిద్ ను అరెస్ట్

మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాం పురం వాసి, రౌడీషీటర్ జునేయిద్ శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు రెండో పట్టణ సీఐ ఎన్. సురేష్ విలేకరులకు తెలిపారు. గతనెల 23న సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిన వివాహానికి జునేయిద్ అనుచరులతో కలిసి వెళ్లాడు. అక్కడ వినయ్ అనే యువకుడితో వివాదం జరిగి ఫంక్షనాల్లోనే ఘర్షణకు దిగాడు.

వినయ్ నేరేడుచర్ల పోలీసు స్టేషన్లో అదేరోజు ఫిర్యాదు. చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జునేయిడ్ గత నెల 24న వినయక్కు ఫోన్ల్చేసి కేసు విరమించుకో వాలని బెదిరించాడు. దీంతో పాటుగా ఆయన అనుచరులు 20 మంది బుల్లెట్లు, ఇతర ద్విచక్రవాహనాలపై మిర్యాలగూడ శాంతి నగర్లో నివాసం ఉండే వినయ్ ఇంటిపైకి దాడికి వెళ్లారు.

బుల్లెట్ బైక్లు భారీ శబ్దం చేసుకుంటూ వినయ్ ఇంటిచుట్టూ తిప్పుతూ. భయానక వాతావరణం సృష్టించారు. వినయ్ రెండో పట్టణ పోలీ సులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని నాలుగు బుల్లెట్ వాహనాలు స్వాధీనం చేసుకోగా యువకులు పరారయ్యారు. ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని నిందితుడు జునేయిద్ కోసం గాలిస్తున్నారు. నిందితుడిని శుక్రవారం ఆదు పులోకి తీసుకుని రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking