- ఇండియాలో చిత్ర పరిశ్రమ ఉంది
- బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదం హాలీవుడ్ నుంచి వచ్చింది
- ఆ అవమానకరమైన పదాన్ని తిరస్కరించండి
బాలీవుడ్ లో నెలకొన్న డ్రగ్స్ సంస్కృతి, నెపోటిజం తదితర అంశాలపై పోరాడుతున్న హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశంలో కళాకారులున్నారు, బఫూన్లు ఉన్నారు, భారత చిత్ర పరిశ్రమ ఉంది, బాలీవుడ్ కూడా ఉంది.
బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదాన్ని హాలీవుడ్ నుంచి కాపీ చేశారు. అక్కడి నుంచి దొంగిలించారు. ఈ అవమానకరమైన పదాన్ని దయచేసి తిరస్కరించండి’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను దివంగత జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
There are ARTISTS and there are BHANDS there is INDIAN FILM INDUSTRY and there is BOLLYWOOD #IndiaRejectBollywood
most ridiculous word BOLLYWOOD itself copied and stolen from HOLLYWOOD. Please reject this derogatory word #IndiaRejectBollywood 🙏— Kangana Ranaut (@KanganaTeam) October 15, 2020