Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన సీఎం

ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ ఎస్ నేతలు సీబీఐ విచారణ కోరాడం లేదెందుకు..?

0 299

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన సీఎం

  • ఎస్ ఐబీ ఆఫీస్ లో పరికరలు ధ్వంసం..
  • ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ ఎస్ నేతలు సీబీఐ విచారణ కోరాడం లేదెందుకు..?

ఫోన్ ట్యాపింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్ ఐబీని తమ బీఆర్ ఎస్ కార్యకర్తల్లా ఉపయోగించుకుని ప్రతిపక్షాలను దెబ్బ తీసిన పోలీసు అధికారులు ఇప్పటికే జైలు కూడు తింటున్నారు.

అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినప్పటికీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై స్పందించలేరు రేవంత్ రెడ్డి. అయితే.. ఢిల్లీలో మీడియాతో మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై అతను మాట్లాడారు.

ఫోన్ ట్యాపింగ్ పైనా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు గుర్తించారని, ఈ క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటికి వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు సమీక్ష జరపలేదన్నారు ఆయన.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని సీఎం చెప్పారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు, ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు కోరడం లేదని సీఎం ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్‌ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయదని ముఖ్యమంత్రి చెప్పారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్ప, తనతో కాదన్నారు. 1980, 90ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో? బ్యాకప్ కూడా ఉందో లేదా దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Breaking