Take a fresh look at your lifestyle.

‘యోగి’గా మారక పోతే.. ప్రజాస్వామ్య పరిహాసం తప్పదేమో?

0 12

‘యోగి’గా మారక పోతే..

ప్రజాస్వామ్య పరిహాసం తప్పదేమో?

ప్రతి పౌరుడు ఒక యోగి కాగలిగినపుడు మాత్రమే మన మేధావి గణం కల గనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అనుకుంటా!. ఇపుడు యోగి పదం ఊసెత్తినా, యుపి ముఖ్య మంత్రి బుల్డోజర్ యోగిని స్మరించి, మంచి జరిగినా ఆ పార్టీ పేరుతో యాగీ చేస్తరు కావచ్చు కొందరు! అలా అనుకోవడము తప్పే!

మరి, ప్రజాస్వామ్యం యొక్క అంతిమ లక్ష్యం చేరడానికి ప్రతీ సాధారణ పౌరుడు చిత్త శుద్ధి, సంకల్పం, ప్రేరణ, స్మరణ, తపన, అకుంఠిత దీక్ష, నిరంతర సాధన గుణం కల్గిన వాడై ఉండాలి. ఇవన్నీ మనకెన్ని కలలున్నా, కళలున్నా, ఎన్నికల ప్రకటన వినగానే వెంటనే ద్యాసకు రావు, ఔపోసన (ఉపాసన నుండి పుట్టినపదమే అనుకుంట) పట్టాలి.

నిజానికి ఈ గుణాలన్నీ, ప్రతి వ్యక్తి విజయానికి సోపానాలని చెప్పాలి. ఇక్కడ నేను వాడిన పదాలన్నీ పతంజలి అష్టాంగ యోగ యమ నియమాది శబ్ధాన్వయాలు అంటే అతిశయోక్తి కాదు!

మరి మొదట, మేధావి గణాలంతా చర్విత చర్వణాలు సన్యసించి, సాధారణ పౌరుల కంటె ముందు, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే బాధ్యత గల అపర యోగులుగా ఎప్పుడు పరిణతి చెందుతారో, ఎప్పుడు పరిణామం పొందుతారో, అప్పుడు గానీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు. స్వీయ ప్రయోజనాల కోసం రాజ్యం సంకన చేరే కుహనా మేధావి సన్నాసులు మౌనంగా గానీ, భజనలో గానీ ఉన్నంత కాలం ప్రజాస్వామ్య పరిహాసం తప్పదేమో..?

డాక్టర్ చిలువేరు రవీందర్

Leave A Reply

Your email address will not be published.

Breaking