Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

0 12

కేసీఆర్ స్పూర్తిగా తీసుకున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు
– కాంగ్రెస్ లో చేరడానికి రహస్య మంతనాలు
– రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే
– కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు
నిర్దేశం, హైదరాబాద్ :
ఔను.. బీఆర్ ఎస్ అగ్రనేత కే. చంద్రశేఖర్ రావును బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు స్పూర్తిగా తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి పక్ష పార్టీలను తమ బీఆర్ ఎస్ లో చేర్చుకున్న సందర్భంలో ‘‘బంగారు తెలంగాణ’’ కోసం పార్టీలో చేరితే స్వాగతం పలుకుతానని తనదైన శైలిలో సమర్థించుకున్నారు. ఇగో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ చూపిన మార్గం లోనే వారి ఎమ్మెల్యేలు నడువడానికి సిద్దమవుతున్నారు. ముఖ్యంగా విపక్షల ఎమ్మెల్యేల నియోజక వర్గ అభివృద్దికి నిధులు కెటాయించక పోవడంతో తప్పని సరి అధికార పార్టీలోకి వచ్చే పరిస్థితులు కల్పించేవారు కేసీఆర్. మారిన రాజకీయ పరిస్థితులలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.

నాడు హరీశ్ రావు – కేసీఆర్ ల మధ్య విభేదాలతో..

రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన మేనల్లుడు హరీశ్ రావును దూరం ఉంచడం వెనుక ఎమ్మెల్యేలను చీల్చుతారని భయ పడటమే అంటున్నారు. అందులో భాగంగానే కొంత కాలం హరీశ్ రావును మంత్రి పదవికి దూరంగా ఉంచాల్సి వచ్చింది. 2018లో జరిగిన ఎన్నికల ఫలితాలకు ముందే హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నాడని కేసీఆర్ కు ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే సమాచారంతోనే అల్లుడిని దూరం ఉంచినట్లు తెలిసింది. ఒకవేళ హరీశ్ రావు పార్టీని చీల్చితే ప్రభుత్వం పడి పోకుండా ఉండటానికి విపక్షల ఎమ్మెల్యేలను తన పార్టీలో చట్ట విరుద్దంగా చేర్చుకున్నారు కేసీఆర్. బంగారు తెలంగాణ కోసం తమ పార్టీలో విపక్షాలు చేరితే స్వాగతం పలుకుతామని తన దైన శైలిలో పేర్కొన్నారు కేసీఆర్. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking