Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత

0 12

ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత

నిర్దేశం, హైదరాబాద్:

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్ అమీర్ అలిఖాన్ లను నియమించారు. గవర్నర్ కోటా నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కర్రె సత్యనారాయణ నియామకాలను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై దాఖలైన మరో పిటిషన్ పై తీర్పు వెలువరించింది.

కేబినెట్ పంపిన ఫైలును వెనక్కిపంపే అధికారం ఉంది కాని, తిరస్కరించే అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ లను నియమిస్తూ ఫైల్ పంపగా, గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారగా, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఓకే చేశారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వీరి ప్రమాణానికి జనవరి 30 న కోర్టు స్టే విధించింది. గురువారం తుది తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking