Take a fresh look at your lifestyle.

దుండిగల్ లోని ఇంజనీరింగ్ కాలేజ్ భవనాల కూల్చి వేత

0 14

దుండిగల్ లోని ఇంజనీరింగ్ కాలేజ్ భవనాల కూల్చి వేత
– అధికారులతో వాగ్వివాదానికి బీఆర్ ఎస్ నాయకులు
– కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇద్దరు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

నిర్దేశం, హైదరాబాద్ :

మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన మల్లారెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చట్ట విరుద్దంగా భవనాలు నిర్మాణం చేశారని ఫిర్యాదులు అందాయి. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేసి యాక్షన్ మొదలు పెట్టింది.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని ఎంఎల్ఆర్ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల కి చెందిన శాశ్వత భవనాలను గురువారం అధికారులు కూల్చివేసారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ శాశ్వత భవనాలను నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ఆడింది ఆట.. పాడింది పాటగా కొనసాగింది. అన్నీ తెలిసిన అధికారులు మౌనంగా ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో విమర్శించుకున్నారు. వ్యక్తిగతంగా మాటలతో దాడి చేసుకోవడం పాఠకులకు విధితమే. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తులపై ఫిర్యాదులు వచ్చాయి. అంతే.. పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండి మైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ మూడు శాఖల అధికారుల ఆధ్వర్యంలో
కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన శాశ్వత భవనాలను కూల్చి వేశారు. ఈ సమాచారం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తదితరులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.

కాంగ్రెస్ పార్టీలోకి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇరువురు నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి ఫ్యామిలీ తమ ఆస్తులను రక్షించుకోవడానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడానికి సీఎం సలహాదారుడిని కలిసినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking