Take a fresh look at your lifestyle.

పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన – రామావత్ చందు నాయక్

0 56

AP 39TV 16మార్చ్ 2021:

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సేవాలాల్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రామావత్ చందు నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కృషి ఎనలేనిదన్నారు. 1901 మార్చి 16న మద్రాసు జార్జి టౌన్ అణ్ణపిలై వీధిలో పొట్టి శ్రీరాములు జన్మించారని ఆనాడు మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల ప్రదర్శిస్తున్న తీరును గమనించి మద్రాసు నగరంపై ఆంధ్రుల హక్కు ఉందని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ద్వారానే ఆంధ్ర జాతికి న్యాయం జరుగుతుందని భావించి 1952 అక్టోబర్ 19న తేదీన మద్రాసులోని మైలాపూరులో నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. చివరకు 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యారని, అంతేగాక స్వాతంత్ర ఉద్యమంలో కూడా శ్రీ పొట్టి శ్రీరాములు గాంధీ మార్గంలో నడిచి అనేక ఉద్యమాలలో ప్రముఖపాత్ర వహించి స్వాతంత్ర్య సమరయోధునిగా గుర్తింపబడ్డారని తెలిపారు. వీరి జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి చరిత్రలో మహాపురుషునిగా నిలిచారని రమావత్ చందు నాయక్ తెలిపారు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముఖ్య కారకులు అయ్యారని తెలిపారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు తన జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు.పొట్టి శ్రీరాములు జాతికి చేసిన సేవలు మరువరానివని రమావత్ చందు నాయక్ గారు తెలిపారు హరిజనోద్ధరణకు పొట్టి శ్రీరాములు ఎంతగానో కృషి చేశారని, అంతేగాక ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని శ్రీ పొట్టి శ్రీరాములు కార్యదీక్ష పరుని గా ఎదిగి అమరజీవి అయినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking