Take a fresh look at your lifestyle.

ప్రధాన మంత్రికి సీఎల్పీ నేత భట్టి బహిరంగ లేఖ

0 70

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

మంచిర్యాల ఏప్రిల్ 8, (వైడ్ న్యూస్) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో 30 ప్రశ్నలతో కూడిన లేఖను భట్టి విడుదల చేశారు. లేఖలో ప్రధాని మోదీకి భట్టి పలు ప్రశ్నల సందించారు.‘‘ మీ 9ఏళ్ల పాలనలో రాష్ట్రానికి కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి..? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏమయ్యాయి..?

కాళేశ్వరం ప్రాజెక్టుపైసీబీఐ విచారణఎందుకు జరపడం లేదు..మీకు కేసీఆర్‎కున్నలోపాయికార ఒప్పందం ఏమిటీ..? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహారా, ఈఎస్ఐ కుంభ కోణాలపైఎందుకు మౌనం పాటిస్తున్నారు?. కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్న మద్యం కుంభకోణం కేసులోపురోగతి ఎందుకు లేదు.? మీకు కేసీఆర్‎కు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా..? విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు.ఝ.గిరిజన యూనివర్సిటీ ఏమైంది’’ అని మోదీకి లేఖలో భట్టి విక్రమార్క ప్రశ్నించారు.కాగా,..సీఎల్పీ నేత భట్టి విక్రమార్కప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం విక్రమార్క పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భట్టి పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజల సమస్యలను, వారి బాధలను తెలుసుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇప్పుడు భట్టి చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ మరింత ఊపందుకుంది. దీంతో హస్తం శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking