Take a fresh look at your lifestyle.

గంజాయితో ముగ్గురు మహిళల అరెస్ట్

0 41

చీరాల కొత్తపేటలో గంజాయి పట్టివేత,

ముగ్గురు మహిళల అరెస్ట్

బాపట్ల : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో శుక్రవారం రాత్రి గంజాయి పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మహిళలను చీరాల టూ టౌన్ సి. ఐ సోమశేఖర్ అరెస్టు చేశారు. సిఐ కధనం ప్రకారం రోశయ్య కాలనీకి చెందిన దేవర లక్ష్మీ, దేవర రాణి, దేవర సింధుజలనే మహిళలు చీరాల రామ్ నగర్ కు చెందిన రేవంత్ అనే వ్యక్తి నుండి గంజాయి కొని దాన్ని ప్యాకెట్లుగా కట్టి అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు వారి నివాసం పై మెరుపు దాడి 24 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఒక్కో ప్యాకెట్ లో 10 గ్రాముల గంజాయి ఉంది.దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. పరారీలో ఉన్న ముద్దాయి.. రేవంత్ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking