Take a fresh look at your lifestyle.

ఓటును అమ్మెటోళ్లు పిచ్చోళ్లే..

0 14

ఓటును అమ్మెటోళ్లు పిచ్చోళ్లే..

ఔను.. ఓటును అమ్మెటోళ్లు నిజంగా పిచ్చోళ్లే..
అలా పిచ్చోళ్లు అంటున్నందకు కొందరికి కోపం వస్తే రావచ్చు..
కానీ.. ఆ పబ్లిక్ లో కొందరు మాత్రమే మంచోళ్లు కూడా ఉన్నారు.. నిజాయితీగా బతికేటోళ్లు.. ఒకరిని మోసం చేయకుండా జీవించేటోళ్లు..
ఎన్నికల వేళ..
పబ్లిక్ ను పిచ్చోళ్లు అంటే కోపం వచ్చి నాకు ఓటు వేయారనే భయం లేదు. ఎందుకంటే నేను ఎన్నికలలో పోటీ చేయడం లేదు. అయినా.. పోటీ చేసే వాళ్లు దుర్మార్గులు అని తెలిసీ కూడా ఓటు వేసే వాళ్లను ఏమంటారు..? పిచ్చోళ్లే అనాల్సింది గదా..?
అందుకే.. నవంబర్ 30న పోలింగ్.. ప్రజలంతా ఓటు వేయాల్సిందే.. కానీ.. ఓటు ఎవరికి వేయాలి..? డబ్బులు ఇచ్చినోడికా..? మద్యం పంపినోడికా..? ప్రెషర్ కుక్కర్ ఇచ్చినోడికా..? చీరెలు పంచినోడికా..? అయినా.. వీటికి లొంగకుండా ఓటును నిజాయితీగా వేస్తే మీకు తలవంచి సెల్యూట్ చెబుతా.. లేదంటే మీరు పిచ్చోళ్లు అనుకుంటా..
తల్లి లాంటి మీ ఓటును అమ్మద్దు.. నిజాయితీ పరులకు ఓటు వేయండి..
ఇగో.. నేనే కాదు.. లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా నాలానే పబ్లిక్ ను పిచ్చోళ్లు అన్నారు. ఉచిత మానిఫెస్టోను చూసి ఓట్లు వేసే వాళ్లంతా పిచ్చోళ్లేనట.. ఇగో అతని మాటల్లో మాట్లాడిన ఈ ముచ్చట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
– వయ్యామ్మెస్ ఉదయశ్రీ
ఉచిత పథకాల మానిఫెస్టో చూసి ఓటు వేసే పిచ్చోల్లారా…
రాజకీయ పార్టీలు మిమ్మలని తాకట్టు పెట్టే ఆ ఉచిత పథకాలు ఇస్తున్నాయి రా… ఏ నాయకుడు వాడి జేబులో నుండి ఇవ్వటం లేదు… రాజకీయ పార్టీలు పెట్టిన మానిఫెస్ట్ లో ఎక్కడైన విద్య కి.. రోడ్ లకు మౌలిక వసతులకు ఒక్క హామీ ఉందా… ఇది తీసుకో అది తీసుకో అన్ని పంచే పథకాలు తప్పా ఏమీ లేవు.
ఉచితం గా ఇచ్చే విద్యుత్ కూడా అప్పుతోనే ఇస్తున్నారు. భవిష్యత్ లో మీరే ఆ అప్పులు కట్టాలి. నాయకులు వేల కోట్ల ఆనందంగా గడుపుతారు. రోడ్ పై గుంటలు కూడా పుడ్చలేరు. ఆస్పత్రుల లో కనీసం మందుల సౌకర్యాలు లేకుండా పోతాయి. మీరు ఇప్పుడు ఆలోచన చెయ్యక పోతే భవిష్యత్ అంధకారం అవుతుంది.
– జయప్రకాష్ నారాయణ, లోక్ సత్తా

Leave A Reply

Your email address will not be published.

Breaking