Take a fresh look at your lifestyle.

మానవ మృగానికి ఉరి శిక్ష విదించిన కోర్టు

0 14

మానవ మృగానికి ఉరి శిక్ష విదించిన కోర్టు

విజయవాడ, ఆగష్టు 22: సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి పశువులా మారిన మానవ మృగానికి కోర్టు ఉరి శిక్ష విదించింది. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానంతో గుర్తించిన తల్లీబిడ్డల హత్య,  మైనర్ బాలికపై  అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఏడిజే కోర్టు తీర్పు వెల్లడించిందని వివరించారు ఆంధ్రప్రదేశ్ డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి.

అన్నమయ్య  జిల్లా, తంబళ్లపల్లి మండలం, గంగిరెడ్డిపల్లి కు చెందిన తల్లి బిడ్డ లు సరళమ్మ, గంగులమ్మ లను అదే ఊరికి చెందిన సయ్యద్ మౌలాలి అక్రమ సంబంధం పెట్టుకుని వ్యవహారం బయటకి రావడం తో తల్లీ  బిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేసి అనంతరం  12 ఏళ్ళ చిన్నారిపైన అత్యాచారానికి పాల్పడ్డ ఘటన జనవరి 01, 2021లో జరిగింది.

ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు గత  సంవత్సరం(2022) నుండి అమలు చేస్తున్న కన్విక్షన్ బేస్ పోలింగ్ ద్వారా ఈ కేసు విచారణ ను మరింత వేగంగా చేపట్టడం తో కేవలం 20 నెలల కాలంలోనే కేసు దర్యాప్తు, న్యాయస్థానం లో విచారణ పూర్తి కావడంతో ఈ రోజు చిత్తూరు కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది.

మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు

: డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి

ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసు శాఖలో అమలు చేస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుంది. మహిళలు, చిన్న పిల్లలకు  సంబందించి  నమోదైన కేసుల్లో  తప్పనిసరిగా నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  అలాంటి వాటిని అత్యంత ముఖ్యమైన కేసులను కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా  ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో స్వయ పర్యవేక్షణలో ప్రతిరోజు డే టూ డే  షెడ్యూల్ ద్వారా  కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్  పురోగతిపై క్రమం తప్పకుండ  సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ వ్యవస్థ ద్వారా కేసు యొక్క ట్రైల్ సమయాన్ని ఘననీయంగా  తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే తప్పు చేసిన నేరస్తులకు జీవిత ఖైదు అంతకంటే ఎక్కువ శిక్షలు పడేవిధంగా చేయడం, అంతేకాకుండా తప్పు చేసిన  ఏ ఒక్క నేరస్థుడు చట్టం నుండి తప్పించుకోకుండా చేయడం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ముఖ్య ఉద్దేశం.

Leave A Reply

Your email address will not be published.

Breaking