Take a fresh look at your lifestyle.

మహిళా పోలీసుల సేవలు అభినందనీయం

0 49

మహిళా పోలీసుల సేవలు అభినందనీయం
 : ఎస్పీ అన్బురాజన్
కడప : కడప జిల్లా లో బాల్య వివాహాలు అరికట్టడంలో, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో మహిళా పోలీసుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్  పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఇటీవలి కాలంలో విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన 30 మంది మహిళా పోలీసులను అభినందించి ప్రశంసా పత్రాలు అందచేశారు.

ఆయా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వర్తించే మహిళా పోలీసులు స్కూల్ డ్రాప్ ఔట్స్ గుర్తించి తిరిగి స్కూళ్లలో చేర్పించేలా కృషి చేయడం, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యక్రమాల గురించి క్షేత్ర స్థాయిలో ఆరా తీసి ఉన్నతాధికారులకు సమాచారమివ్వాలని సూచించారు.

ఇదే స్పూర్తితో మున్ముందు విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్.పి ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) తుషార్ డూడి,  ప్రొద్దుటూరు ఏ.ఎస్పీ ప్రేర్ణాకుమార్,  ‘దిశ’ డి.ఎస్.పి ఆర్.వాసుదేవన్, జిల్లాలోని  డి.ఎస్.పి లు, సి.ఐ లు పాల్గొన్నారు.

ప్రశంసా పత్రాలు అందుకున్న మహిళా పోలీసుల వై.ఝాన్సీ రాణి కడప వన్ టౌన్ పి.ఎస్
కె.సుజాత, బద్వేల్ రూరల్ రిహానా,  ప్రొద్దుటూరు టూ టౌన్ పి.ఎస్ ఎస్.అయేషా తబస్సుమ్, వేంపల్లి పి.ఎస్ వనిపెంట వరలక్ష్మి, బద్వేల్ పి.ఎస్ పి.పుష్పకుమార్, పులివెందుల పి.ఎస్ హిమబిందు, వేంపల్లి పి.ఎస్ బి.సంధ్య, ప్రొద్దుటూరు టూ టౌన్ పి.ఎస్ ఆర్.రెడ్డెమ్మ, పెండ్లిమర్రి పి.ఎస్టి.హరిత, ప్రొద్దుటూరు వన్ టౌన్ పి.ఎస్ జి.వినోలియా, జమ్మలమడుగు పి.ఎస్ పి.తులసి, దువ్వూరు పి.ఎస్ ఏ.శ్రీలక్ష్మి, బద్వేలు పి.ఎస్ చల్లా శ్రీవాణి, కడప వన్ టౌన్ పి.ఎస్ ఎం.విమల, సింహాద్రిపురం పి.ఎస్
కె.సృజని, కడప రూరల్ పి.ఎస్ మునగపాటి దీప్తి, కడప రూరల్ పి.ఎస్ సి.సౌభాగ్య లక్ష్మి, రాజుపాలెం పి.ఎస్ పి.నాగేంద్రమ్మ, వల్లూరు పి.ఎస్ కుందూ గాయత్రీ, చక్రాయపేట పి.ఎస్ కుప్పల రాజేశ్వరి, బద్వేల్ పి.ఎస్ పుట్టా సుభద్ర, జమ్మలమడుగు పి.ఎస్ ఈ.ఖాసీం బీ, కలమల్ల పి.ఎస్ హైమావతి సురేష్, కలమల్ల పి.ఎస్ కె.నాగలక్ష్మి, జమ్మలమడుగు పి.ఎస్ ఎం.ప్రశాంతి, సింహాద్రిపురం పి.ఎస్ కె.సుజాత, కడప టూ టౌన్ పి.ఎస్ గోపాలదాసు ప్రశాంతి, మైలవరం పి.ఎస్ సాకే స్వాతి, జి.ఆర్ పల్లి పి.ఎస్ .సుధారాణి, సిద్దవటం పి.ఎస్,అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ‘దిశ’ సిబ్బందికి జిల్లా ఎస్.పి ప్రశంసా పత్రాలు అందచేశారు. మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించాలన్నారు.

ప్రశంసా పత్రాలు అందుకున్న వారు
డేటా ఎంట్రీ ఆపరేటర్ పెండ్లికట్ల సుధారాణి,
కస్టమర్ సపోర్ట్ ఫర్ పెర్సోనేల్ చెంచుగార్ల రమాదేవి, కస్టమర్ సపోర్ట్ ఫర్ పెర్సోనెల్ అంబటి నాగజ్యోతి, ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking