Take a fresh look at your lifestyle.

 సీలీ మ్యాట్రెస్ గ్యాల‌రీ ప్రారంభోత్స‌వం

0 260

 హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో గ్యాల‌రీ ఏర్పాటు

 ఓపెనింగ్ సెరిమొనీలో పాల్గొన్న సీలీ ఇండియా డైరెక్ట‌ర్ జి.ఎస్.ఎస్ జ‌గన్నాథ్, ఇత‌ర ప్ర‌ముఖులు

హైద‌రాబాద్, 23 జ‌న‌వ‌రి – 2023: అమెరికాకు చెందిన ప్ర‌ముఖ మ్యాట్రెస్ కంపెనీ సీలీ.. హైద‌రాబాద్ లో మరో మ్యాట్రెస్ గ్యాల‌రీని ప్రారంభించింది. బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని మిడ్ టౌన్ ప్లాజాలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇండియాలో ఇది సెకండ్ కంపెనీ ఓన్డ్ స్టోర్ కావ‌డం విశేషం.

మ‌న దేశంలో సీలీ మ్యాట్రెస్ 25వ స్టోర్ కూడా ఇదే. 1,000 sq ft విస్తీర్ణంలో దీన్ని నెల‌కొల్పారు. ఇందులో రూ. 68 వేల నుంచి రూ. 8 ల‌క్ష‌ల ధ‌ర‌ల్లో మ‌న్నికైన‌ మ్యాట్రెసెస్ ల‌భ్య‌మ‌వుతాయి. హైద‌రాబాద్ లో సీలీ మ్యాట్రెస్ కు ఇప్ప‌టికే రెండు స్టోర్స్ ఉండ‌గా తాజాగా మూడోదాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఈ కొత్త మ్యాట్రెస్ గ్యాల‌రీకి సంబంధించిన వివ‌రాల‌ను సీలీ ఇండియా డైరెక్టర్ శ్రీ. జి.ఎస్.ఎస్ జ‌గ‌న్నాథ్ వివ‌రించారు. “వినియోగ‌దారుల‌కు సౌకర్యవంతమైన నిద్ర‌ను అందించ‌డ‌మే మా ల‌క్ష్యం. మ‌న్నిక‌, విశ్వాసం, సౌక‌ర్యం.. ఈ మూడింటికీ మా ఉత్ప‌త్తులు నిద‌ర్శ‌నం. భార‌తీయుల జీవ‌న విధానం, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఈ మ్యాట్రెసెస్ రూపొందిచాము” అని తెలిపారు.

భార‌తీయ వ్య‌వ‌స్థీకృత మ్యాట్రెసెస్ మార్కెట్ విలువ ప్ర‌స్తుతం రూ. 15,000 కోట్ల‌కు పైగా ఉంది. ముఖ్యంగా ల‌గ్జ‌రీ సెగ్మెంట్ ఏటా 50 శాతం వృద్ధితో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి సాధిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రీమియం, ల‌గ్జ‌రీ విభాగాల‌పై సీలీ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. సీలీ భార‌త్ లో 23 ఫ్రాంచైజీస్-ఓన్డ్ లొకేష‌న్ల ద్వారా కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోయంబ‌త్తూర్, ఈరోడ్, త్రిపుర‌, ఇండోర్ లో అవి ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశంలోని ముఖ్య‌మైన అన్ని న‌గ‌రాల్లో నెట్ వ‌ర్క్ విస్త‌రించాల‌ని సీలీ భావిస్తోంది. 2023 చివ‌రి నాటికి లేదా 2024 మొద‌ట్లో హైద‌రాబాద్ లో తొలి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

సీలీ గురించి:
అమెరికాలోని టెక్సాస్ లో 1881లో హై క్వాలిటీ మ్యాట్రెసెస్ త‌యారు చేసే కంపెనీగా సీలీ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. 1949లో తొలి సీలీ పోశ్చ‌ర్పెడిక్ బ్రాండ్ మ్యాట్రెస్ ను ప‌రిచ‌యం చేసింది. ఆర్థోపెడిక్ స‌పోర్ట్ ఇచ్చే విధంగా ఈ స్ప్రింగ్ మ్యాట్రెస్ ను రూపొందించింది. బెడ్డింగ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి రీసెర్చ్, డెవ‌ల‌ప్ మెంట్ లో సీలీ పోశ్చ‌ర్పెడిక్ లీడింగ్ పొజిష‌న్ లో నిలిచింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా అమ్ముడు పోయింది. అంతేకాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా పేరుపొందిన అనేక హోట‌ల్స్ లో ఈ ర‌క‌మైన మ్యాట్రెస్ నే ఉప‌యోగిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking