Take a fresh look at your lifestyle.

మేడిగడ్డకు పోయి ఏమి పీకుతావ్.. : కేసీఆర్

0 1

మేడిగడ్డకు పోయి ఏమి పీకుతావ్..

  • కేసీఆర్ నోట గవ్వే మాటలు.. గవ్వే డైలాగ్ లు..
  • ప్రభుత్వం పోయిన సోయితో ఘాటు విమర్శలు..
  • సెంటిమెంట్ కోసం కేసీఆర్ ప్రయత్నం..

(యాటకర్ల మల్లేష్)

కేసీఆర్ స్పీచ్ లో గవ్వే డైలాగ్ లు.. ‘మేడిగడ్డకు పోయి ఏమి పీకుతావ్.. పీకు..’ అంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. కేసీఆర్ పాలన పాలిచ్చే బర్రెనట.. కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతట తెలంగాణ యాసలో మాట్లాడిన మాటలో పసలేదు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు తప్పు చేశారనే వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నించారు కేసీఆర్. కేసీఆర్ ఫ్రస్టేషన్ తో మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి ప్రజలకు చెప్పడానికి యత్నించారు.

ప్రజలు ప్రతిపక్ష హెదా ఇచ్చినందుకు జీర్ణించుకోలేక పోతున్నాడనేది అతని స్పీచ్ లో స్పష్టంగా కనిపించింది. జనం ఓటుతో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెబితే నిజాలను గ్రహించకుండా మళ్లీ మన ప్రభుత్వం వస్తోందని ప్రజలకు భరోసా ఇవ్వడంలో అతని ఆంతర్యం ఏమిటో అర్థం కాని ప్రశ్న..

సెంటిమెంట్ కోసం కేసీఆర్ ప్రయత్నం..

ఔను.. కేసీఆర్ లో ఫ్రస్టేషన్ తగ్గలేదు. అతను చేసిన తప్పులను తెలుసుకోలేదు. జనాలను భ్రమల్లో ఉన్నారని కేసీఆర్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడించిన ప్రజలది తప్పు అన్నట్లుగా అతని స్పీచ్ కొనసాగింది. ‘చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేనే తెచ్చాను’ అంటూ పదే పదే చెప్పుకోవడం విడ్డూరంగా కనిపించింది. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల కంటే కేసీఆర్ పెద్దోడు కాదు అనేది నిజం.

నేను ఓట్లను అడుగటానికి రాలేదు. నంగనాశి కబుర్లు చెప్పి ఓట్ల కోసం వస్తారు జాగ్రత్తగా ఉండండి. నా గడ్డ.. నా ప్రజలు అనే ఆరాటం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి  ఏదైనా సాధించుకోవాలనే సోయి  లేదంటూ పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘పక్కనే కృష్ణమ్మ ఉన్న ఫలితం లేక పాయే..’ అంటూ నల్గొండ జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యలపై నేనే పాట రాసినట్లుగా కేసీఆర్ చెప్పుకోవడం విశేషం.

కేసీఆర్ నోట కాంగ్రెస్ మాట..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే మాట కేసీఆర్ నోటి నుంచి రావడం విశేషం. అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కృష్ణ జలాల వివాదం అడ్డురావద్దని వ్యూహంలో భాగంగా ఒప్పుకున్నామని కేసీఆర్ లాజిక్ పాయింట్ చెప్పారు. కేసీఆర్ మాటలో ఫ్రస్టేషన్, అహంకారపూరిత ధోరణి స్పష్టంగా కనిపించింది. ప్రజలు అధికారంకు దూరం చేశారనే కోపంతో అతని స్పీచ్ కొనసాగింది.

నోరు పారేసుకున్న కేసీఆర్..

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో కూడా కేసీఆర్ నోరు పారేసుకున్నారు. సభకు హాజరైన జనాలను తనదైన తెలంగాణ బాషలో తిట్టాడు. ఇగో.. నల్గొండ సభలో కూడా అధికారం పోయిన సోయిని మరిచి పోయి కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ ఎస్ ను ఓడించారనే కడుపు మంటతో మాట్లాడారు కేసీఆర్. ‘మీరు భ్రమల్లో ఉండి గెలుపించుకున్నారు.’ అంటూ అతని స్పీచ్ లో పేర్కొనడం విశేషం. మేం ఓడిపొతే మాకు పోయేదేమి లేదు. ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకుంటా.. మీకు నష్టం అంటూ అసెంబ్లీ ఎన్నికల సభలో మాట్లాడారు. అయినా.. జనాలు ఓటుతో తగిన బుద్ధి చెప్పారనే సోయి లేకుండానే కేసీఆర్ స్పీచ్ దంచాడు.

కాలు విరగ్గొట్టుకుని వచ్చానని..

‘కాలు విరుగొట్టుకుని ఇక్కడికి వచ్చా.. కట్టే కాలే వరకు ప్రజల కోసం పని చేస్తా..’నని కేసీఆర్ సెంటిమెంట్ డైలాగ్ లను జనాలపై విసిరారు. పదేళ్లు సీఎం గా పాలన చేసిన కేసీఆర్ లో హూందాతనం కనిపించలేదు. అతని స్పీచ్ లో దిగజారుడు మాటలే వినిపించాయి. ‘‘అవును.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగినాయి..’’ అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేయడం ఆ పార్టీ నేతలకు కూడా నచ్చలేదు. ‘రైతు బంధు ఇవ్వ చాతాకాదా..? అడిగితే చెప్పుతో కొడతామంటారా..? అని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన కేసీఆర్ మాటలకు అంతగా స్పందన  రాలేదు.

అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తుంటే ‘‘తెలంగాణ తెచ్చిన నన్నే తిరగనియ్యరా.. చంపుతారా.. రా.. దమ్ముందా..’’ అనే స్పీచ్ కేసీఆర్ నోటి నుంచి ఎందుకు వచ్చిందో అర్థం కాని ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల తరువాత తుంటి ఎముక విరిగి విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ నల్గొండ సభలో చికాకు, ఫ్రస్టేషన్, అహంకారపూరిత, సమర్థింపు మాటలతో స్పీచ్ కొనసాగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking