Take a fresh look at your lifestyle.

రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పూజలు

0 11

రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

నిర్దేశం, వరంగల్ : ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వాగతం పలికిన వారిలో అంజన్ కుమార్ యాదవ్, టి. సుబ్బిరామిరెడ్డి, రేణుక చౌదరీ, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, నిరంజన్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్, సమీరుల్లా, ఫేహెం ఖురేషి, ఫేహీం, మెట్టు సాయి కుమార్ తదితరులున్నారు.


అక్కడి నుంచి హెలీకాప్టర్ లో బయలు దేరి ములుగు జిల్లా పాలంపేట కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు హెలీప్యాడ్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, పొంగులేటి, సీతక్క ఘన స్వాగతం పలికారు. అనంతరం రామప్ప ఆలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking