నా భార్యకు టికెట్ ఇవ్వండి

నా భార్యకు టికెట్ ఇవ్వండి
– కాంగ్రెస్ అధిష్ఠానానికి జగ్గారెడ్డి వినతి
– టికెట్ ఇస్తే సంగారెడ్డిలో ప్రచారం చేస్తారా అనేదే చర్చ
– అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత సంగారెడ్డికి రానని శపథం

నిర్దేశం, మెదక్:
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏది చేసినా సంచలనమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు షాక్ తగిలింది. దీంతో నియోజకవర్గానికి రానని శపథం చేశారు. కానీ జగ్గారెడ్డి ఇప్పుడు సడన్‎గా మెదక్ ఎంపీ సీట్ తన భార్య నిర్మలా జగ్గారెడ్డికి ఇవ్వాలని అధిష్టానంను కోరారట. ఇదే విషయంపై నిర్మలా జగ్గారెడ్డి కూడా గాంధీభవన్‎లో మీడియా సమావేశం పెట్టి మరి తన మనసులో మాట చెప్పేశారు. ప్రస్తుతం నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు.

ఇప్పుడు ఆమె పేరు ఆశావహుల లిస్ట్‎లోకి వచ్చి చేరడంతో ఇప్పుడు చర్చ మొత్తం ఆమెకు ఎంపీ సీట్ వస్తుందా లేదా అనే దానికంటే ఆమె తరపున జగ్గారెడ్డి ప్రచారానికి వస్తాడా లేదా అనే టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా చర్చకు దారి తీసింది జగ్గారెడ్డినే అని అంటున్నారు స్థానిక పార్టీ నేతలు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేసి ఓటమి పాలు అయ్యాక జగ్గారెడ్డి మొత్తం హైదరాబాద్‎కే పరిమితం అయ్యారు.ఇక సంగారెడ్డి నియోజకవర్గనికి రాను అని నేరుగా మీడియా ముందే చెప్పేసారు. తాను నియోజకవర్గ పరిధిలోకి రాను కానీ, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను అని చెప్పారు. అలా చెప్పి మొత్తం హైదరాబాద్‎లోనే ఉంటూ నిత్యం సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇక ఎంపీ ఎన్నికల్లో సైతం తాను పోటీ చేయను అని చాలా సార్లు చెప్పారు జగ్గారెడ్డి. అసలు ఎంపీ ఎన్నికలపై పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నట్లే పలుమార్లు మాట్లాడారు. కానీ ఏం జరిగిందో తెలీదు సడన్ గా మెదక్ ఎంపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని ఇటీవలే అధిష్టానం పెద్దలను కలిశారు జగ్గారెడ్డి. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసాం అని, ఈ సారి ఎంపీ టికెట్ తన భార్య నిర్మాల జగ్గారెడ్డికి ఇవ్వాలని కొరారు. ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే నియోజకవర్గంపై కోపం పెట్టుకొని, అసలు ఇక నియోజకవర్గానికే రాను అని తెగేసి చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంకి వస్తారా..

రారా అనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా మొదలైంది. ఒకవేళ మెదక్ ఎంపీ టికెట్‎ను కాంగ్రెస్ అధిష్టానం నిర్మలా జగ్గారెడ్డికి ఇస్తే, జగ్గారెడ్డి ఆమె తరపున ప్రచారం చేయాలంటే నియోజకవర్గానికి రావాల్సిందే. మరి ఆయానేమో ఇది ఏది ఆలోచించకుండా నియోజకవర్గానికి రాను అని చెప్పారు. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేస్తారో అనే ఆసక్తి క్యాడర్లో మొదలైంది. మరి జగ్గారెడ్డి చెప్పిన మాట మీద ఉంటారా.. ఆయన స్టైల్లో అప్పుడు ఏదో డైలాగ్‎లో పవర్ కోసం ఆ పదాలు వాడను అని సింపుల్‎గా చెప్పేస్తారా అనేది వేచి చూడాలి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »