Take a fresh look at your lifestyle.

కోవిడ్ నివారణకు ప్రజా సహకారం అవసరం – ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

0 51

AP 39TV 01మే 2021:

కోవిడ్ సెకండ్ వేవ్ నివారణకు ప్రజా సహకారం అవసరమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.శనివారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 4 ఏ సి లను ఎన్ ఆర్ ఐ లు,వైకాపా నేతలు వితరణ చేశారు.కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కోవిడ్ ఐసియు వార్డ్ లలో ఏసీ లు తక్కువ ఉన్నాయన్న విషయం తెలుసుకుని వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యయన కమిటీ సభ్యులు కాగజ్ ఘర్ రిజ్వాన్ తన NRI మిత్రులు గోనుగుంట్ల నాగ కిషోర్,కొత్తపల్లి శ్రీనివాసులు సహకారంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కోవిడ్ ఐసియు వార్డ్ కు 3 ఏసీ లను,వైసిపి నాయకులు జయరాం నాయుడు ఒక ఏసీ లను వితరణ చేశారు.అదేవిధంగా సాక్షి విలేకరు సుదర్శన్ రెడ్డి,అశోక్ బాబు,విజయ్ కుమార్ లు వంద మినిరల్ వాటర్ క్యాన్ లను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  పాల్గొన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పర్యటించి కరోనా రోగులను పరామర్శించి వారిలో భరోసా నింపి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ తప్పకుండా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని,మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు.ప్రభుత్వం కూడా కరోనా బారిన నుండి రక్షించేందుకు అనేక చర్యలను చేపడుతుందని స్పష్టం చేశారు.అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసారని తెలిపారు.అంతేకాకుండా కరోనా ను ఆరోగ్యశ్రీ లోకి చేర్చడం,18 వయస్సు పైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్, నెలకు రెండు సార్లు ఉచిత రేషన్ తో పాటు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని తెలిపారు.కరోనా నుండి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వంతో పాటు వైద్యులు,నర్సులు,ఆస్పత్రి సిబ్బంది,ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారు.అనంతపురం జిల్లా కేంద్రంలో కరోనా నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంన్నారని,అందులో భాగంగా సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో 3 వేల పడకలను ఏర్పాటు చేశారన్నారు.కోవిడ్ ఐసీయూ వార్డ్ లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లుతో పాటు పడకలను కూడా పెంచినట్లు స్పష్టం చేశారు.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంలో ప్రజలకు ”అభయమిస్తున్నాం భాధితుడికి అండగా మేము,వైద్య సిబ్బంది ఉంటాం,దయ చేసి ఆస్పత్రిలోని కరోనా బాధితుల వద్ద వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఉండకూడదని” ఆయన సూచించారు.కరోనా బారి నుండి ఒకరినొకరు రక్షించుకోవాల్సిన అవసరం వున్నదని కనుక ప్రతి ఒక్కరు స్పంధించి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞాపించారు.ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking