Take a fresh look at your lifestyle.

కవిత కన్న ప్రేమ – జైలు కెళుతూ కొడుకును ముద్దాడిన కవిత..

0 21

కవిత కన్న ప్రేమ
– జైలు కెళుతూ కొడుకును ముద్దాడిన కవిత..

అమ్మ ప్రేమ.. ఆ ప్రేమకు డబ్బులతో విలువ కట్టలేము. పేదోళ్లైనా.. ధనవంతులైనా తల్లి ప్రేమ స్వచ్ఛమైనదే. అందుకే దేశానికి రాజైనా తల్లికి కొడుకు అంటారు. దేశ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా తల్లీ హీరాబెన్ దీవెనల కోసం ఆహ్మదబాద్ వెళ్లొచ్చిన సందర్భాలు చూశాం.

కానీ.. ఈ వార్త భిన్నం.. జైలుకు వెళుతూ తన బిడ్డను చూసి తల్లిడిల్లింది కల్వకుంట్ల కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కాం.. కల్వకుంట్ల కవిత జీవితంలో మాయని మచ్చగా మిగులుతుంది. కన్న తండ్రి కేసీఆర్ సీఎం పదవిని అడ్డం పెట్టుకుని అడ్డదారులలో డబ్బులు సంపాదించిన కవిత అడ్డంగా ఈడీ అధికారులకు దొరికి పోయింది. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన ఆమె జైలులో చిప్పకూడు తినాల్సి వస్తోంది.

సందర్భం..
కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లుతున్న సందర్భం.. ముద్దుల చిన్న కుమారుడు ఆర్యా డాగ్ తీసుకుని అమాయకంగా తల్లి కవితను చూస్తుంటాడు. అగో.. అప్పటికే ఈడీ అధికారుల ఆధీనంలో ఉన్న కవిత చేతు లెత్తి పిడికిలి బిగించింది. ఆ తరువాత విక్టరీ సింబల్ చూపుతూ తాను ఏదో సాధించినట్లు ఫోటోలకు పోజు ఇచ్చింది.
అప్పటికే డాగ్ తో అమాయకంగా కనిపించిన కుమారుడు ఆర్యా వద్దకు వచ్చిన కవిత చేతితో అతని తలనిమిరి తల్లి ప్రేమను వ్యక్తం చేసింది.

నిజమే.. అమ్మ ప్రేమ అలాంటింది..
పిల్లలకు తల్లిదండ్రులే హీరో – హీరోయిన్.. కానీ.. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కొని జైలుకు వెళ్లేటప్పుడు చిన్న కుమారుడు ఆర్యా ఎంత బాధ పడ్దాడో.. డబ్బులు వస్తాయి.. పోతాయి.. కానీ.. కవిత దోషిగా తేలి జైలు శిక్ష పడితే ఆమె కుమారుల బాధ ఎలా ఉంటుందో..?

Leave A Reply

Your email address will not be published.

Breaking