Take a fresh look at your lifestyle.

టెన్త్ హాల్ టిక్కెట్లు విడుదల

0 16

టెన్త్ హాల్ టిక్కెట్లు విడుదల

తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్‌టికెట్లను కూడా విడుదల చేశారు. తమతమ పాఠశాలల లాగిన్‌ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ప్రకారం.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానుండగా.. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలుముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి.
పదోతరగతి హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ పదోతరగతి హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి – https://bse.telangana.gov.in/
➥ అక్కడ హోంపేజీలో హాల్‌టికెట్లకు సంబంధించి ‘SSC Public Examinations March 2024 Hall Tickets’ లింక్‌‌పై క్లిక్ చేయాలి.
➥ తర్వాత వచ్చే పేజీలో పదోతరగతి రెగ్యులర్, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్‌టికెట్లకు సంబందించిన లింక్స్ కనిపిస్తాయి.
➥ అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి, Submit బటన్‌ మీద క్లిక్ చేయాలి.
➥ తర్వాతి పేజీలో పదోతరగతి హాల్‌టికెట్‌ను కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.

Leave A Reply

Your email address will not be published.

Breaking