Take a fresh look at your lifestyle.

Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!

0 12

Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!

గాజాలో ఆస్పత్రుల ముంగిట మోహరించిన ఇజ్రాయెల్‌ సైన్యం

ప్రధానాసుపత్రి షిఫాలో కరెంటు బంద్‌

ఐసీయూ యూనిట్‌పై బాంబు దాడి

పూర్తిగా నిలిచిపోయిన వైద్య సేవలు

అత్యధిక ఆస్పత్రుల్లో అదే పరిస్థితి

అల్లాడుతున్న రోగులు, పసికందులు

వైద్యమందక 100కు పైగా మృతి!

మృత్యుముఖంలోకి వేలాది మంది రోగులు

దెయిర్‌ అల్‌బలాహ్‌ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్‌ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్‌ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్‌ ఖుద్స్‌ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking