Take a fresh look at your lifestyle.

హోళి సంబరాలు..

0 18

హోళి సంబరాలు..
– రంగులతో ఎంజాయ్ చేసిన పబ్లిక్
– కుల, మతాలకు అతీతంగా వేడుకలు

నిర్దేశం, హైదరాబాద్ :
హోళి పండుగ.. తెలంగాణ వ్యాప్తంగా ఉత్సాహంగా.. ఉల్లసంగా జరుపుకున్నారు జనం. హైదరాబాద్‌ నగరంతో పాటు ప్రతి పల్లెలలో రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేసారు జనం. ముఖ్యంగా వెరైటీ రంగులతో పరస్పరం పోసుకుంటూ యూత్ కేరింతలు కొడుతూ సంతోషంగా గడిపారు. డ్యాన్స్‌లు చేస్తూ హెప్పిగా ఉన్నారు.
హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో గడ్చిబౌలి సంధ్యా ఫుడ్ కోర్టులో ఘనంగాతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన ‘కంట్రీ క్లబ్ హోలీ’ సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్‌ డాన్స్‌లు చేశారు.
మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రంగులను ఒకరికి ఒకరు పూసుకో వడం, రంగునీళ్లు చల్లుకుంటూ ఆడుకోవడం, డీజే పాట లకు నృత్యాలు చేస్తుండటం ప్రతీ ఒక్కరికి సరదా. పండగ వేళ రంగులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. పిల్లల ఆనందాలను కాదనలేక తల్లిదండ్రులు పలురకాల రంగు లను కొనిస్తారుముందు రోజు నుంచే హోలీ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా పాండిచ్చేరి నుంచి తెప్పించిన DJ , సంగీత శబ్ధాలకు యువత డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.ఈ వేడుకల్లో రాజస్థానీ, మార్వాడీ కుటుంబాలు పాల్గొని ఉత్సాహంగా, సందడిగా ఒకరికొకరు రంగులు పూసుకోని నృత్యాలు చేస్తూ… హొలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking