పాపం కేటీఆర్..
సిరిసిల్ల క్యాంపు ఆఫీస్ గోడకు వినతి పత్రం
నిర్దేశం, కరీంనగర్ :
కేటీఆర్ పరిస్థితి చూస్తుంటే పాపం అనాల్సిందే.. మొన్నటి వరకు అతను యువరాజు.. తెలంగాణ రాష్ట్రానికి పరోక్షంగా సీఎం.. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేటీఆర్ మాములు ఎమ్మెల్యేగా మిగిలి పోయారు. ఇగో ఇప్పుడు సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ కు గోడకు అంటించిన వినతి పత్రి సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. 22 రోజులుగా పని లేక తాము అవస్థలు పడుతున్నామని పవర్ లూమ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి రెండు రోజులు సిరిసిల్లలో ఉంటానని ఎన్నికలలో కేటీఆర్ హామి ఇచ్చి అడ్రసు లేకుండా పోయారని వారు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.