Take a fresh look at your lifestyle.

జూన్ 1 నుంచి వైఎస్ఆర్‌ – జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు – సీఎం వైఎస్ జగన్‌

0 44

AP 39TV 06 మే 2021:

జూన్ 1 నుంచి వైఎస్ఆర్‌ – జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు.తొలి దశ ఇళ్లపై 25 నాటికి ఏర్పాట్లు అన్నీ పూర్తి కావాలి అని సీఎం వైఎస్ జగన్‌.కర్ఫ్యూ సమయంలోనూ పనులేవీ ఆగకూడదు, మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్మాణ పనులు సాగాలి.నీటి సదుపాయం, విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉండాలి.ఇళ్ల పనుల్లో జాప్యం ఉండకూడదు.కోవిడ్ విపత్తులోనూ గృహ నిర్మాణాలతో ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది.కార్మికులకు ఇళ్ల వద్దే పెద్ద ఎత్తున పని దొరుకుతుంది.స్టీల్, సిమెంట్ , తదితర సామాగ్రి కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి.ప్రతి లేవట్‌లో తప్పనిసరిగా మోడల్ హౌజ్‌.ఇళ్ల నిర్మాణానికి 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి.ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటానంటే కాదనొద్దు, వారికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వండి.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – వైఎస్ఆర్‌ అర్బన్‌ -బీఎల్సీ తొలి దశ కింద మొత్తం 15,60,227 ఇళ్లు మంజూరు కాగా కోర్టు వివాదాల్లో 71,502 ఇళ్లు ఉన్నాయి. వీటి ప్రత్యామ్నాయం కోరుతూ లేఖ రాశారు. మిగిలిన 14,88,725 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు మంజూరు ప్రక్రియ పూర్తి. ఇప్పటికే 13,71,592 ఇళ్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో మ్యాపింగ్.టిడ్కో ఇళ్లలో 81,040 దాదాపు పూర్తయ్యే దశ (90 శాతం) లో ఉండగా మరో 71,448 ఇళ్లు 75 శాతం పూర్తి.ఎకానమికీ బూస్ట్ కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం ఆర్ధిక వృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటే కార్మికులకు సొంత ఇళ్ల దగ్గరే పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది.కార్పెంటర్లు, ప్లంబర్‌లు లాంటి రకరకాల వృత్తిదారులకు దీర్ఘకాలం ఉపాధి దొరకుతుంది. స్టీల్, సిమెంట్, తదితర గృహ సామాగ్రి కొనుగోలు చేయడం ద్వారా వ్యాపార లావాదేవీలు జరిగి ఎకానమీ బూస్ట్ అవుతుంది.కాబట్టి ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవలింగ్ చాలా ముఖ్యం.దాదాపు 1.95లక్షల ఫ్లాట్‌లకు ఈ సమస్య ఉంది.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking