Take a fresh look at your lifestyle.

ఎన్నికలను బహిష్కరించండి

0 11

ఎన్నికలను బహిష్కరించండి
– మావోయిస్టు నక్సలైట్ల పిలుపు
నిర్దేశం, భద్రాద్రి కొత్తగూడెం :
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ పేర లేఖ విడుదల అయింది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ భారతీయ జనతా పార్టీ ని తన్ని తరమండని, భారతీయ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండని ఆ లేఖలో నక్సలైట్లు పేర్కొన్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేసే ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలన్నారు. విప్లవ ప్రజా రాజ్యాధికార సంస్థలో చేరండి. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేసి సోషలిజాన్ని నిర్మించుకోండి అంటూ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking