Take a fresh look at your lifestyle.

కోవిడ్ జర్నలిస్టులకు కోటి సాయం: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్

0 72

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమిలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం తెలంగాణ జర్నలిస్టులకు రక్షణ కవచంలా తయారయ్యింది. ఆ వంద కోట్ల నిధుల నుండి 34.50 కోట్ల రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయి. ఆ నిధి ద్వారా వచ్చిన వడ్డీతో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఒక కోటి 4 లక్షల 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దీనితోపాటు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, దీర్ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు 5 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్ల ఏర్పడిన జర్నలిస్టుల సంక్షేమ నిధి. 2017, ఫిబ్రవరి నుండి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. ఈ నిధి మీద వచ్చిన వడ్డీ నుండి జర్నలిస్టులు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అమలు చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి సంక్షేమ నిధి కాని, జర్నలిస్టులను ఆదుకోవడం కాని, దేశంలో ఎక్కడా లేదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి సగర్వంగా ప్రకటిస్తుందని తెలిపారు.

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆదుకోవడం కోసం మీడియా అకాడమి మే-2020 నుండి కరోనా పాజిటీవ్ వచ్చిన 479 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున, 95 లక్షల 80 వేలు, దీనితోపాటు ప్రైమరీ కాంటాక్ట్ చేత హోంక్వారంటైన్లో ఉన్న 84 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, 8 లక్షల 60 వేలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు. మొత్తంగా సంక్షేమ నిధి నుండి జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఒక కోటి 4 లక్షల 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. దీనితోపాటు లాక్ డౌన్ సమయంలో దాదాపు పన్నెండు వందల మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, సానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశామని ఆయన తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇప్పటి వరకు 260 మంది చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున 2 కోట్ల 60 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని, అలాగే దీర్ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన 94 మంది జర్నలిస్టులకు 50 వేల రూపాయల చొప్పున 47 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఆర్థిక సహాయం, ట్యూషన్ ఫీజు, పెన్షన్లను కలుపుకుని మొత్తంగా వీరందరికీ 5 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

మీడియా అకాడమి కార్యాలయానికి జర్నలిస్టులు ఆర్థిక సహాయం కోసం 25 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు, మరో 15 మంది దీర్ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన వారు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా వైరస్ తగ్గిన వెంటనే ఆయా జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking