Take a fresh look at your lifestyle.

అగ్రతారల చెవుల్లో బీజేపీ ‘కమలం’ పువ్వు కాషాయంపై మహిళల నేతల ఆగ్రహం

0 13

అగ్రతారల చెవుల్లో బీజేపీ ‘కమలం’ పువ్వు
కాషాయంపై మహిళల నేతల ఆగ్రహం
నిర్దేశం, హైదరాబాద్ :
అగ్రతారల చెవుల్లో బీజేపీ ‘కమలం’ పువ్వు పెట్టింది. టికెట్‌ ఆశించిన నాయికలకు కమలం పార్టీ మొండిచెయ్యి చూపించింది. అధ్యక్షా..అనే పిలుపు కోసం ఆశపడ్డ అలనాటి హీరోయిన్లకు బీజేపీ నిరాశే మిగిల్చింది. రెండో, మూడో జాబితాలోనైనా స్థానం దక్కుతుందని ఆశించినా.. భంగపాటే ఎదురవడంతో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో బీజేపీపై మహిళా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాషాయం పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. సికింద్రాబాద్‌ సీటును మాజీ మేయర్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండ కార్తీకారెడ్డి కూడా ఆశించారు. ఆమె సహా మరో నలుగురు మహిళలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ సీటు కోసం పద్మ, కీర్తి, జీవితారాజశేఖర్‌ పోటీ పడగా.. వారిని కాదని దీపక్‌ రెడ్డికి కట్టబెట్టారు. అంబర్‌పేట్‌ టికెట్‌ ఆశించిన మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తికి కూడా నిరాశే ఎదురైంది. సనత్‌నగర్‌ సీటును ఆకుల విజయ కోరగా ఆమెకు నిరాశే మిగిలింది. మాజీ ఎమ్మెల్యే జయసుధ సికింద్రాబాద్‌ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అగ్రనాయకత్వం జయసుధ సికింద్రాబాద్‌ నుంచి బరిలో ఉంటారని సంకేతాలివ్వడంతో ఆమె స్థానికులతోనూ సమావేశమయ్యారు. కానీ చివరకు ఆమెకు బీజేపీ షాకిచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు దీంతో మహిళలకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శలు వస్తున్నాయి. బీజేపీ సీనియర్‌ నాయకురాలు రాములమ్మది మరో కథ. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా.. ఆమె అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్‌ అమాంతంగా పడిపోవడంతో పోటీ చేసినా ప్రయోజనం ఉండదని ఆమె భావిస్తున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking