Take a fresh look at your lifestyle.

తెలంగాణ బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఇబ్రాం శేఖర్

గతంలో ఈ పదవిలోనే ఉన్నారు. కొద్ది రోజుల రాజకీయ అనిశ్చితి అనంతరం.. మరోసారి పార్టీలోకి వచ్చి అదే పదవి దక్కించుకున్నారు

0 70

నిర్దేశం, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బహున్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇబ్రాం శేఖర్ నియమితులయ్యారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన ఆయన.. గతంలో ఈ పదవిలోనే ఉన్నారు. కొద్ది రోజుల రాజకీయ అనిశ్చితి అనంతరం.. మరోసారి పార్టీలోకి వచ్చి అదే పదవి దక్కించుకున్నారు. బీఎస్పీ జాతీయ కోర్డినేటర్ అయిన అశోక్ సిద్ధార్థ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే ఇబ్రాం శేఖర్ ను బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ సిద్ధార్థ ప్రకటించారు. కాగా, ఈ సందర్భంగా ఇబ్రాం శేఖర్ స్పందిస్తూ.. రాష్ట్రంలో బీఎస్పీ ఎదుగుదల కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానని, బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావాతి ఇచ్చిన అవకాశాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకుంటానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking