Take a fresh look at your lifestyle.

మృత దేహం పై సర్వ హక్కులూ.. దాని వారసులకే చెందుతాయి !

0 15

మృత దేహం పై సర్వ హక్కులూ..
దాని వారసులకే చెందుతాయి !

బ్రతికిన కాలంలో మన ఆలోచనలు.. సిద్ధంతాలు.. ఆచరణ అన్నీ బాగానే ఉంటాయి. కానీ.. మనం చనిపోతే.. మన మృతదేహంపై వారసులకు సర్వహక్కులుంటాయి. మనం బ్రతికున్నప్పుడు “దేహదానం & అవయవదానం” అనే నిర్ణయాలు తీసుకుంటే అది అమలు కావాలంటే మన కుటుంభీకుల చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే..? ఆ నిర్ణయాలను అమలు పరచాల్సిన సమయంలో మనం విగతజీవిగా పడి ఉంటాం.

మన దేహ దానం నిర్ణయాన్ని & అవయవ దానం నిర్ణయాలను (లేదా తత్సంబంధమైన మన కోరికలను) మన చట్టబద్దమైన వారసులు (అంటే మన లీగల్ హేర్) మాత్రమే అమలు జరపవలసిన ఉంటుంది. వారి సమ్మతి/ ఆమోదం లేకుండా మృతుల దేహదానాన్ని or బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవాల దానాలను మృతుల కుటుంబానికి చట్టపరంగా సంబంధం వ్యక్తులు అమలు జరపలేరు. తన దేహదానం విషయమై.. (తాను బ్రతికి ఉన్నప్పుడే), తన కుటుంబ సభ్యులను కన్విన్స్ చేయగలిగిన “దేహదాత”, మన మిత్రుడు కీ.శే. సురేష్ గారు !

ఆయన కుటుంబ సభ్యులు సమ్మతించడంతోనే.. నిన్న సురేష్ గారి భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజ్ కు, డొనేట్ చేయడం, మన జేవీవీ బృందానికి సులభతరమైంది.
– చెలిమెల రాజేశ్వర్ జెవివి తెలంగాణ

Leave A Reply

Your email address will not be published.

Breaking