పోలీసుల అతి ఉత్సాహం
– సీఎంకు ఫిర్యాదు చేసిన రైతు సంఘం
నిర్దేశం, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లా పరిధిలోమోర్తాడ్ హైవే రోడ్డు నిర్మాణ విషయంలో రైతుల అభిప్రాయాలు తీసుకునే సందర్భంగా పోలీసులు అతి ఉత్సాహంతో అక్రమ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేసిన ఘటనపై చర్య తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల చర్యలపై లేఖ రాశారు ఆయన.
నిజామాబాద్ జిల్లా పరిధిలో మోర్తాడ్ ఎంపీడీవో కార్యాలయంలో హైవే రోడ్డు నిర్మాణం విషయంలో 2023 గెజిట్ ప్రకారం పనులు జరగాలని రైతులు ఆర్డీవో ఏర్పాటుచేసిన మీటింగ్ లో ఏకగ్రీవంగా కోరారన్నారు ఆయన. అయితే.. ఆర్డీవో, ఏసీపీ ఇద్దరు మాట్లాడుకుని తమపై దౌర్జన్యం చేశారన్నారు ఆయన. ఇదేమి పద్ధతి అని ప్రశ్నించినందుకు నా ఎడమ చేతు నొప్పి ఉండంగా కూడా (నా చేతుకు బ్యాండేజ్ ఉండగా) బలవంతంగా లాక్కెళ్ళి పోలీస్ జీప్ లో ఎక్కించారన్నారు ప్రభాకర్. పోలీసుల దౌర్జన్యాలను ఫోటోలు తీస్తున్న విలేకరుల ఫోన్లు కూడా లాక్కున్నరననారు. ఆ తరువాత తిరిగి ఇచ్చారన్నారు. తమ కార్యకర్త నరేందర్ ఫోటోలు తీస్తుండగా బెదిరించి ఫోన్ గుంజుకుని తిరిగి ఇవ్వలేదన్నారు ఆయన. పోలీసుల చర్యలపై విచారణ జరిపించి తమ సెల్ ఫోన్ ను ఇచ్చే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు వి. ప్రభాకర్.