Take a fresh look at your lifestyle.

లాభాల్లో పడిన జెన్ కో

0 42

21.28 కోట్లు ఆదాయం

విజయవాడ, మార్చి 2,  లాభనష్టాలపై జెన్‌కో అంచనాలను సిద్ధం చేసింది. ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది రూ.కోటి అదనంగా లాభం వస్తుందని అంచనాకు అధికారులు వచ్చారు. ఆదాయం, వ్యయం లాభ నష్టాలతో కూడిన నివేదికను కూడా జెన్‌కో అధికారులు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదిక ఆధారంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనాకు వచ్చారు.

వచ్చే ఏడాది రూ.13,677.68 కోట్లు ఆదాయంగా సమకూరుతుందని చెబుతున్నారు. ఇందులో విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.13,624.89 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.52.79 కోట్లు సమకూరుతుందని అంచనా. వ్యయానికి సంబంధించి మొత్తం రూ.13,649.47 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో అంతర్రాష్ట్ర విద్యుత్‌ కింద రూ.67.86 కోట్లు, ఇంధన వ్యయం కింద రూ.8,247.70 కోట్లు, నిర్వహణకు రూ.1653.67 కోట్లు, తరుగు కింద రూ.663 కోట్లు, అప్పుల చెల్లింపులు, వడ్డీలకు రూ.3,027.24 కోట్లు అవసరమవుతుందని భావిస్తున్నారు.

ఈ గణాంకాల నేపథ్యంలోనే మొత్తం ఏడాదికి రూ.21.28 కోట్లు లాభంగా మిగులుతుందని అంచనా వేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వచ్చే నెలాఖరుతో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి రూ.20.06 కోట్ల లాభంతో ముగియనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆదాయం రూ.12,948.59 కోట్లుగా, వ్యయం రూ.12,921.86 కోట్లుగా గుర్తించారు.ఈ ఏడాది 23,735 మిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగ్గా, వచ్చే ఏడాది 29,920 మిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అంచనా వేశారు. ఇందులో థర్మల్‌ విద్యుత్‌ ద్వారానే 25,916 మిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతుందని చెబుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 21,762 మిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగ్గా, నాలుగేళ్లలోనే అది 29,920 మిలియన్‌ కిలోవాట్లకు చేరుకుంటురడడం గమనార్హం. ఇందులో 27,566 మిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ అమ్మకానికి అరదుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కో కిలోవాట్‌పై రూ.4.94 వరకు ఆదాయం వస్తురదని కూడా అంచనా వేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking