Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ షర్మిల దూరం

0 14

అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ షర్మిల దూరం
– కాంగ్రెస్ కు భేషరతుగా మద్దతు
– కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యం
– గెలువడానికంటే త్యాగం గొప్పది
– సోనియా ప్రేమను మరిచి పోలేను
నిర్దేశం, హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలతో సంచలనం సృష్టించింది. సీఎం కేసీఆర్ అవినీతి పాలనను బొంద పెట్టడానికి తాను ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని చేసిన ప్రకంపన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అందుకు కార్యకర్తలు తనను క్షేమించాలని ఆమె పెద్ద మనసుతో విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని భావించి తాను అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు షర్మిల.. కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశ్యం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వవద్దు అని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు… తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని తెలిపారు. మేము పోటీ చేస్తే కేసిఆర్ కి లాభం జరుగుతుందని మేధావులు చెప్పారు. అందుకే తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం ఇది. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
కార్యకర్తలలో గందరగోళం
షర్మిల నిర్ణయంతో లోటస్ పాండ్ లో కొద్దిసేపు గందరగోళం ఏర్పాడింది. తమ మనోభావాలను షర్మిల పట్టించుకోలేదని పార్టీ కార్యకర్తలు, నాయకులు వాపోయారు. పార్టీ కోసం గత కొంతకాలంగా పనిచేసినా, కనీసం ఆఖరి క్షణం లో పిలిచినా పట్టించుకోలదేని అన్నారు. రెండు వర్గాలకు చీలిన నాయకులు కు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా పార్టీ కార్యాలయం లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking