Take a fresh look at your lifestyle.

మందు తాగే అలవాటు ఉంటే ఈ విషయం తెలుసుకోండి

60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. వాటర్ లాగే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. కాక్‌టెయిల్స్‌ మిక్సింగ్‌లో వోడ్కాను ఎక్కువగా వాడతారు

0 97

నిర్దేశం, హైదరాబాద్: మందు బాబులు వివిధ రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగుతారు. కొందరు బీర్లు ఇష్టపడితే, మరికొందరు విస్కీ, ఇతర డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. వీటన్నింటిలో ఇథనాల్ కంటెంట్ ఉంటుంది. అయితే.. బీర్, విస్కీ, వోడ్కా, రమ్, వైన్.. వీటిలో దేని స్పెషాలిటీ దానికే ఉంటుంది. రంగు, రుచి, వాసన, తయారుచేసే విధానం కూడా వేరువేరుగానే ఉంటుంది. వీటితో పాటు ఆల్కహాల్ కంటెంట్ కూడా వేరువేరుగానే ఉంటుంది. ఆల్కహాల్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే, ఈ డ్రింక్స్‌లో ఏది తాగితే ఎక్కువ కిక్కు ఎక్కుతుందో తెలుసుకుందాం.

బీరు
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది తాగే చిల్డ్ ఆల్కహాలిక్ డ్రింక్ బీరు. నీరు, హాప్స్, ఈస్ట్, బార్లీతో బీర్లు తయారు చేస్తారు. బార్లీ నుంచి షుగర్ తీసి, తర్వాత దాన్ని ఈస్ట్‌తో పులియబెడతారు. అయితే రైస్, గోధుమ, మొక్కజొన్నలతో కూడా ఈ డ్రింక్‌ను తయారు చేస్తారు. కాగా, బీర్లలో 4 నుంచి 6 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

వైన్
వైన్ లో ఆల్కహాల్ కంటెంట్ 5.5 శాతం నుంచి 25 శాతం వరకు ఉంటుంది. సాధారణంగా వైన్ టేస్ట్ కొంచెం స్వీట్‌గా ఉంటుంది. ఎరుపు లేదా నలుపు రంగు ద్రాక్ష పండ్లను పులియబెట్టి రెడ్ వైన్ తయారు చేస్తారు. ఈ పండ్ల రసం తీసి పులియబెడతారు.

రమ్
రమ్‌లో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇది చెరకు రసం తీసిన తర్వాత మిగిలే బైప్రొడక్ట్స్‌ను డిస్టిల్ చేసి తయారు చేస్తారు. అయితే ఈ డ్రింక్‌కు ముదురు రంగు, స్పెషల్ ఫ్లేవర్ రావడానికి కాల్చిన ఓక్ బారెల్స్‌లో మాగబెడతారు. అవసరమైతే మొలాసిస్, గ్రాన్యులేటెడ్ షుగర్ లేదా పంచదార పాకం కూడా యాడ్ చేస్తారు. రమ్‌లో 40 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది.

విస్కీ
విస్కీ ఒక డిస్టిల్డ్ డ్రింక్. బార్లీ, గోధుమలు, మొక్కజొన్నలను పులియబెట్టి తయారు చేస్తారు. సాధారణంగా స్పెషల్ ఫేవర్ కోసం కాల్చిన తెల్లటి ఓక్ కలపతో చేసిన బ్యారెల్స్‌లో విస్కీని పులియబెడతారు. దీంట్లో 40-50 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

వోడ్కా
ఎక్కువగా అయితే బంగాళదుంపలు లేదా తృణధాన్యాలను పులియబెట్టి వోడ్కా తయారు చేస్తారు. స్టార్చ్, జొన్న, మొక్కజొన్న లేదా గోధుమలతో కూడా అప్పుడప్పుడు తయారు చేయవచ్చు. కొన్ని కంపెనీలు పండ్లు, మొలాసిస్ నుంచి వోడ్కా తయారు చేస్తాయి. ఈ డ్రింక్‌లో 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది వాటర్ లాగే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. కాక్‌టెయిల్స్‌ మిక్సింగ్‌లో వోడ్కాను ఎక్కువగా వాడతారు. అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల, ఈ డ్రింక్ తాగితే త్వరగా మత్తు ఎక్కుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking