Take a fresh look at your lifestyle.

ముస్లింలు ఎవరి వారసులు? భారతదేశానికి ఎలా వచ్చారు?

ప్రవక్త ముహమ్మద్ ఇస్లాం మతాన్ని ప్రారంభించారు. ప్రవక్త ముహమ్మద్ క్రీ.పూ. 630 నాటికి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసి అరేబియాలోని చాలా ప్రాంతాలను ఏకం చేశారు

0 225

నిర్దేశం, హైదరాబాద్: ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం ఇస్లాం. వారి జనాభా దాదాపు 118 కోట్లు. ఇస్లాం ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా, సాహెల్, మధ్య ఆసియా, దక్షిణాసియా వంటి దేశాలలో అధికంగా వ్యాపించింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఇస్లాం మతస్తులు ఉంటారు. మక్కా ముస్లింలకు ప్రధానమైన తీర్థయాత్ర. ప్రపంచం నలుమూలల నుంచి ముస్లింలు హజ్ కోసం ఇక్కడికి వస్తారు. అయితే ఇస్లాం మతానికి పూర్వీకులు ఎవరు? ఈ మతం భారతదేశంలో ఎలా వ్యాపించిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఇస్లాం మతం
ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ వారసులని అంటారు. ఆయనే ఇస్లాం మతాన్ని ప్రారంభించారు. ఆయన జీవితంలో ఎక్కువ భాగం వ్యాపారవేత్తగానే గడిచింది. 40 సంవత్సరాల వయస్సులో అల్లా నుంచి ఆయన ఖురాన్ జ్ఞానాన్ని పొందాడని అంటారు. ఇది ఇస్లాం మత పునాదికి ప్రధాన కారణం. ప్రవక్త ముహమ్మద్ క్రీ.పూ. 630 నాటికి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసి అరేబియాలోని చాలా ప్రాంతాలను ఏకం చేశారు. మహమ్మద్ ప్రవక్త తన జీవితకాలంలో చాలా సమస్యలను ఎదుర్కున్నారు. పుట్టకముందే తండ్రి చనిపోవడంతో తాత, మేనమామ వద్ద పెరిగారు.

భారతదేశంలో ఇస్లాం
అరేబియాలో ఇస్లాం ఆవిర్భవించిన కొద్దికాలానికే, గుజరాత్ అరబ్ తీర వాణిజ్య మార్గం ద్వారా భారతీయ సమాజంలో ఇస్లాం తన స్థానాన్ని సంపాదించుకుంది. ఇస్లాం 7వ శతాబ్దం నాటికి భారత ఖండాల్లోని లోతట్టు ప్రాంతాలకు చేరుకుంది. ఆ తర్వాత అరబ్బులు సింధ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తరువాత 12వ శతాబ్దంలో మహమూద్ గజ్నీ పంజాబ్ మీదుగా ఉత్తర భారతదేశానికి వచ్చారు. అనంతరం అనేక మంది ముస్లిం పాలకులు, వ్యాపారులు నిరంతరం భారతదేశాన్ని సందర్శించారు. ఇస్లాం సంస్కృతి క్రమంగా భారతదేశంలో పెరిగింది. అయితే, భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యానికి పునాది వేసిన ఘనత కుతుబుద్దీన్ ఐబక్‌ది.

భారతదేశంలోని చాలా మంది ముస్లింలు దక్షిణాసియా జాతి సమూహాలకు చెందినవారు. భారతదేశంలోని ముస్లింలు ప్రధానంగా మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా నుంచి వచ్చారు. ముస్లింలలో అత్యధిక కులం అష్రాఫ్, అత్యల్ప కులం అజ్లాఫ్. భారతదేశంలో మొదటి మసీదు చేరమాన్ జుమా మసీదు. దీనిని క్రీ.శ.629లో నిర్మించబడిందని చెబుతారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking