Take a fresh look at your lifestyle.

ఏస్…మాది కుటుంబ పాలనే మంత్రి కేటీఆర్

0 57

ఏస్…మాది కుటుంబ పాలనే మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : శనివారం శాసనసభ వాడివేడిగా కొనసాగింది. మంత్రి కేటీఆర్ ఘటుడా సమాధానిచ్చారు. అవును మాది కుటుంబ పాలనేనని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబసభ్యులని అన్నారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తున్నామని కెటిఆర్ అన్నారు.

శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగం సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకపడ్డారు. సెటైర్లు వేశారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడని, కానీ బీజేపీలోకి వెళ్లాక ఆయనలో మార్పు వచ్చిందని అన్నారు.

కమలం పార్టీలోకి వెళ్లాక మనుషులు మారిపోతారని అయన అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాక ముందు కరెంట్ ఎలా ఉండేదో వచ్చాక ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. అప్పట్లో పవర్ హాలిడేస్ ఉంటే.. ఇప్పుడు పవర్ ఫుల్ డేస్ అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking