Take a fresh look at your lifestyle.

వామ్మో.. ఢిల్లీ దారుణంగా పడి పోయిన వాయు నాణ్యత

0 16

వామ్మో.. ఢిల్లీ దారుణంగా పడి పోయిన వాయు నాణ్యత
నిర్దేశం, న్యూఢిల్లీ : దేశ రాజాధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత బుధవారం చాలా పేలవంగా ఉందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్పష్టం చేస్తోంది. వరుసగా ఐదవ రోజు బుధవారం దారుణంగా గాలి నాణ్యత దారుణంగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వివరాల మేరకు గాలి నాణ్యత 373గా నమోదైంది. మంగళవారం వాయు నాణ్యత 350గా నమోదవడంతో జాతీయ రాజధాని, దాని శివారు ప్రాంతాలను పొగమంచు చుట్టుముట్టింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) వివరాల మేరకు గాలి నాణ్యత సోమవారం 347, ఆదివారం 325గా నమోదైంది. సోమవారం ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయి ‘తీవ్ర’ జోన్‌లోకి పడిపోయింది. ఢిల్లీకి చెందిన జహంగీర్‌పురి ఆదివారం ‘ప్రమాదకర’ విభాగంలో సీజన్‌లో అత్యధిక ఏక్యూఐని 566 వద్ద నమోదు చేసింది. చాలా కాలంగా ఢిల్లీ విపరీమైన వాయ కాలుష్యంతో సతమతమవుతోంది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. వారం రోజుల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఐదు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking