బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నిర్దేశం, హైదరాబాద్ :
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం అంబర్పేట్ అసెంబ్లీ, నల్లకుంట డివిజన్, చైతన్య నగర్, సంజీవయ్య నగర, ఇందిరానగర్, వెజిటేబుల్ మార్కెట్, వెంకటేశ్వర నగర్ లో పర్యటించారు. ఈ పర్యటన లో కిషన్ రెడ్డి కి కాలనీల్లో అడుగడుగునా సాధారస్వాగతం లభించింది మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు, కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు బీజేపీ కార్యకర్తలు కిషన్ రెడ్డి ని అక్కున చేర్చుకున్నారు, కాలనీ పెద్దలను పుర ప్రముఖులను కార్యకర్తలను పలకరిస్తు ముందుకు సాగారు అనంతరం వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించారు
తరువాత గోల్నాక వెజిటేబుల్ మార్కెట్లో కూరగాయలు కొన్నారు. తోపుడు బండ్లపై పై కూరగాయలు కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ పే యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేశారు