Take a fresh look at your lifestyle.

 కేటీఆర్ ప్రకటనతో ఆలోచనలలో పడ్డ ఆంధ్ర సెటిలర్స్

0 18

 కేటీఆర్ ప్రకటనతో

ఆలోచనలలో పడ్డ ఆంధ్ర సెటిలర్స్, సాప్ట్ వెర్ ఉద్యోగులు

నిర్దేశం, హైదరాబాద్ :

అసెంబ్లీ ఎన్నికలల ఆంధ్ర సెటిలరుల ఓటర్ల పాత్ర కీలకం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలతో పాటు జిల్లాలలో కూడా వారి ప్రభావం బాగానే ఉంటుంది. అయితే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత బీఆర్ ఎస్ పార్టీ ఆంధ్ర సెటిలర్స్ కు మద్దతుగా నిలిసింది. అక్కడక్కడా మినహా సెటిలరులు ఓట్లు బీఆర్ ఎస్ కే వేశారు. అయితే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఆంధ్ర సెటిలరులు సాప్ట్ వెర్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. వీరి ఆందోళనను బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యతిరేకించారు.

నారా చంద్రబాబును ఆంధ్రలో అరెస్టు చేస్తే ఇక్కడ ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ నీ అయ్యా జాగీరా.. అంటూ నిలదీశారు ఆయన. కేటీఆర్ ప్రకటన ఆంధ్ర సెటిలరులలో.. సాప్ట్ వెర్ ఉద్యోగులలో వ్యతిరేకత ఏర్పాడి ఎన్నికలలో నష్టం జరుగుతుందని భావించిన మంత్రి హరీష్ రావు తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. అయితే.. ఆంధ్ర సెటిలర్ తో పాటు సాప్ట్ వెర్ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

Leave A Reply

Your email address will not be published.

Breaking