Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజెపికి వేసినట్లే :బీఎస్పీ నేత డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

0 12

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజెపికి వేసినట్లే
:బీఎస్పీ నేత డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
నిర్దేశం, సిర్పూర్ :
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దహేగాం మండలంలోని మొట్లగూడ, రావులపల్లి, శంకరాపురం, రాంపూర్, గెర్రివెళ్లి, గెర్రె, లోహ, పికలగూడెం, చర్చిగుడా, కొంచవెల్లి, ఖర్జిలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్,బిజెపిలు ఒక్కటై రహస్య ఒప్పందంతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని,ఆ రెండు పార్టీలు దోపిడీ పార్టీలేనని అన్నారు.సిర్పూర్ నియోజకవర్గంలోని పోలీసులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారు ఆరోపించారు. జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అనుకులంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న ఆయన ఎన్నికలు సజావుగా జరగాలంటే జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.నియోజకవర్గంలో బీఎస్పీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఒక్కటయ్యారని ఆరోపించారు. ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేసిన వారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో లోపాయి కార ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అన్ని పార్టీలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారన్న ఆయన హామీలు చూసి మోసపోవద్దని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ జిల్లా నాయకులు పిల్లల తిరుపతి, అధ్యక్షులు ఎల్కూరి ప్రశాంత్,దుర్గం దేవదాస్, షాకీర్, కవిత, లక్ష్మీ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking