Take a fresh look at your lifestyle.

విను తెలంగాణ -11 కామారెడ్డి ఒక దిక్సూచి…

0 15

విను తెలంగాణ -11 కామారెడ్డి ఒక దిక్సూచి…

అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ‘కామారెడ్డి నియోజకవర్గం’ బి ఆర్ ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్కు కూడా అభివృద్ధి నమూనాను ఎదిరించే విషయంలో ఒక దిక్సూచి గానే మారబోతున్నదనే చెప్పాలి.

కామారెడ్డి లో 8 గ్రామాల ప్రజలు నష్టపోతున్న మాస్టర్ ప్లాన్ విషయంలో మూడవసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న కెసిఆర్ గారి ఎన్నికల సభా ప్రసంగంలో గాని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చూస్తున్నా రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో గానీ మాస్టర్ ప్లాన్ ను తప్పక రద్దు చేస్తామని చెప్పకపోవడంతో తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రైతులు వీరు.

నిజానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులను విడగొట్టి పాలించిన కారణంగా వారు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయకపోయినప్పటికీ మోరల్ గా వారు గెలిచారని చెప్పాలి.

అభివృద్ధి నమూనాను సరికొత్తగా నిర్వచించుకునే దిశలో ఇప్పటికే ఇక్కడి రైతాంగం చేపట్టిన నిరసన కార్యక్రమాల వల్ల కామారెడ్డితో పాటు జగిత్యాల నిర్మల్ తదితర రాష్ట్రంలో చేపట్టనున్న ఇతర మాస్టర్ ప్లాన్లు holdలో ఉండటం విశేషం.

గెలుపు విషయం పక్కన పెడితే కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డిల కన్నా బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి రైతులకు ఆప్తుడిగా మారడం, క్రమక్రమంగా అతడి ఓటు బ్యాంకు బలపడడం క్షేత్రస్థాయిలో గమనించదగ్గ పరిణామం.

మొత్తం మీద ఈ కామారెడ్డి రైతుల నిరసన ఈ ఎన్నికల అనంతరం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా, పోరాటకారులకు ఒక దిక్సూచిగా మారబోతున్నదని రెండు రోజుల పర్యటనలో తెలిసిన సానుకూల అంశం.

బాగా చీకటి పడ్డప్పటికీ, జరిగిన విషయాలన్నీ అప్పటికప్పుడు చెప్పడానికి సమావేశమైన లింగాపూర్ గ్రామస్తులకు ధన్యవాదాలు.

కందుకూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.

Breaking