Take a fresh look at your lifestyle.

అమరుల ఆశయాలను నెరవేర్చడానికి యువత ముందుకు రావాలి

0 278

అమరుల ఆశయాలను నెరవేర్చడానికి  

యువత ముందుకు రావాలి

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

 హైదరాబాద్, (ఉస్మానియా యూనివర్సిటీ) మార్చి 29 : తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల ఆశయాలను నెరవేర్చడానికి  ముందుకు రావాలని పిలుపునిచ్చారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. దుర్మార్గులు, వక్ర బుద్ది కలవారు, విద్యార్థులను రోడ్ల మీదికి తీసుకొచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఆయన. సిర్పూర్ నియోజకవర్గంలో ఒక బ్రిడ్జి కూలిపోయింది. అక్కడి ఇంజనీర్లు ఏం చెబితే అక్కడ సంతకాలు పెట్టి కాంట్రాక్టర్లకు న్యాయం చేశారు. నిజాం కాలంలో కట్టిన కట్టడాలు చెక్కుచెదరలేదన్నారు ప్రవీణ్ కుమార్.

ఉస్మానియా యూనివర్సిటీ జెఎసీ ఆధ్వర్యంలో లైబ్రరీలో TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై నిర్వహించిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో  బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తప్పు పట్టారు.  ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తే నలుగురు మహిళలు మరణించారు. చిలుము పట్టిన కత్తులతో ఆపరేషన్ చేయడం వల్ల, క్వాలిఫికేషన్ లేని, డబ్బులతో ఉద్యోగం కొనుక్కున్న అధికారి ఉంటే ఇలా జరుగుతదన్నారు ఆయన.

డబ్బుతో పేపర్లు కోనుక్కొని,ఇతరులతో పరీక్ష రాయించి ఉద్యోగం పొందితే ఇలాగే జరిగే ప్రమాదం ఉందన్నారు ప్రవీణ్ కుమార్. అందుకే అంబేడ్కర్ 315 నిబంధన ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేయాలని చెప్పారన్నారు ఆయన. ఇలాంటివి జరగద్దనే నేను ఆమరణ నిరాహార దీక్ష చేశానన్నారు ఆయన. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజిపై అసలే మాట్లాడడం లేదు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి. దేశంలోనే అత్యంత ఎక్కువ జీతం తీసుకునే సిఎం కెసిఆర్ అన్నారు ప్రవీణ్ కుమార్.

పేపర్ లీకేజ్ దోషులెవరో ముఖ్యమంత్రికి తెలుసన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. జనార్దన్ రెడ్డి ని రాజీనామా చేయించి ఆఘమేఘాల మీద రాత్రికి రాత్రే పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్ చేశారు. ఎందుకు అలా చేశారో చెప్పలేదు. అతని కంటే మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారన్నారు ఆయన. పేపర్లు రూపొందించి,భద్రపరిచే బాధ్యత చైర్మెన్ దే. అయినా అతనికి తెలియకుండా పేపర్లు ఎలా లీకవుతాయని ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తి 100 కు కాల్ చేయడంతో లీకేజిల గురించి తెలిసిందన్నారు ఆయన.

11 వ తేదీన కేవలం 4 లైన్లలో కేసు నమోదు చేశారు. కానీ కేసు నమోదు చేసిన తర్వాత నేర జరిగిన చోట ఎందుకు ఆ స్థలాన్ని సీజ్ చేయలేదు? అని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. కంప్యూటర్లు,ఫోన్లు ఎందుకు తీసుకొని సీజ్ చేయలేదని అధికారులను నిలదీశారు. ఒక్క నిమిషంలో సాఫ్ట్ వేర్ మార్చవచ్చాని తెలిసి కూడా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. హ్యాకింగ్ మరియు హనీట్రాప్ పేరుతో తప్పుదోవ పట్టించలేని పరిస్థితి ఉందన్నారు ఆయన.

ప్రవీణ్ ఓఎమ్ఆర్ బయటకు రాకుంటే,అబ్బాయి 100 కు డయల్ చేయకుంటే ఇది ఇలాగే కొనసాగేదన్నారు ఆయన. 14వ తేదీన పత్రికా సమావేశం పెట్టి,ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయి కానీ క్వాలిఫై కాలేదని చెప్పారు. చాలా చిన్న అంశంగా చెప్పారు. వంద మార్కులు దాటిన వారు చాలా మంది ఉన్నారని చెప్పారు. నేను పత్రికా సమావేశం పెట్టి చెప్పే వరకు నిందితులను అరెస్టు చేయలేదన్నారు ఆయన.

ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసే రాజశేఖర్ రెడ్డి మేనబావ లింగారెడ్డి కమీషన్ సభ్యులుగా ఉన్నాడు. లింగారెడ్డి పి.ఎకు 127 మార్కులు వచ్చాయి. ఇంటర్ పేపర్ లీకేజి చేసిన వ్యక్తి కమీషన్ సభ్యుడిగా ఉన్నారు. కెటిఆర్ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మొదట ప్రవీణ్ ,రాజశేఖర్ రెడ్డి అన్నారు. రెండోసారి ఎవరికి తెలియని అధికారిక సమాచారం చెప్పారు. అతనికి ఎలా తెలిశాయి? జనార్దన్ రెడ్డే అతనికి ఇచ్చి ఉంటారు. సిఎం కు చెడ్డపేరు రావద్దని పోలీసులు చేస్తరు. అందుకే సిబిఐ కి కేసును అప్పగించాలి.

సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. గ్రూప్ 1 500 టాపర్ల హాల్ టికెట్లు,ఫోన్ నెంబర్లు మరియు కమీషన్ అధికారులు,ఉద్యోగుల ఫోన్ నెంబర్లు తీసుకొని విచారణ చేస్తే దొరుకుతారు. కానీ పోలీసులు ఇది చేయడం లేదన్నారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking