Take a fresh look at your lifestyle.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి ల బలాబలాలు

0 14

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి ల బలాబలాలు

ఎన్డీటీవీ–లోక్నీతి–సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీల  సంయుక్తం సర్వే

న్యూ డిల్లీ మే 24 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత నుంచి ఆ పార్టీ విషయంలో ఒక సానుకూల వాతావరణం కనిపించటం తెలిసిందే. అప్పటివర కు కాంగ్రెస్ మీద వినిపించిన నెగిటివ్ స్టోరీల స్థానే.. ఒకలాంటి పాజిటివ్ స్టోరీలు తెర మీదకు వస్తున్నాయి. ఈ మార్పు పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర నుంచి మొదలైనా.. కర్ణాటక ఫలితాల తర్వాత ఫోకస్ పెరిగిందన్న మాట వినిపిస్తోంది.

ఈ వాదన కు బలం చేకూరేలా తాజాగా ఎన్డీటీవీ–లోక్నీతి–సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఒకటి స్పష్టం చేస్తోంది.ప్రజాభిప్రాయం పేరుతో నిర్వహించిన ఈ సర్వే కాంగ్రెస్ బలాన్ని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నే చాలామంది ఇష్టపడుతున్న విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం. మొత్తం 19 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లోని 7202 మందితో నిర్వహించిన సర్వే ప్రకారం.. 43 శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వైపే మొగ్గు చూపారు. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని వారి నోటి వెంట వచ్చినట్లు సర్వే వెల్లడించింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ ఓటు బీజేపీకే అని అత్యధికులు చెప్పగా.. 38 శాతం మంది మాత్రం బీజేపీకి తాము ఓటు వేయమన్న విషయాన్ని పేర్కొన్నారు. ఓట్ల శాతంలో చూస్తే బీజేపీ 43 శాతంతో ముందు ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమంటే.. ఇదే తరహాలో 2019లో నిర్వహించిన సర్వేలో బీజేపీకి 44 శాతం రాగా.. ఇప్పుడు ఒక శాతం తగ్గింది.

అదే సమయంలో 2019లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 శాతం మాత్రమే ఓటర్లు మొగ్గుచూపగా.. తాజా సర్వేలో మాత్రం మరో పది శాతం అదనంగా 29 శాతం పెరుగుదలను నమోదు చేయటం గమనార్హం. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు చేస్తున్న అభివృద్ధి తమకు సంతృప్తినిస్తున్నట్లు 55 శాతం మంది చెబితే..అందులో ఫర్లేదన్న మాట 38 శాతం మంది నోటి నుంచి వచ్చింది. కేవలం 21 శాతం మంది మాత్రమే తమ అసంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం. ఇక.. సర్వేలో  పాల్గొన్న వారిలో 43 శాతం మంది మోడీని ప్రధానిగా తమ ఓటు వేస్తే.. రాహుల్ కు 27 శాతం మంది మొగ్గు చూపారు.2019తో పోలిస్తే మోడీ ఒక శాతం ఓట్ల ను కోల్పోతే.. రాహుల్ గాంధీకి మాత్రం మూడు శాతం ఓట్లు అదనంగా పెరిగాయి.

అయినప్పటికీ ఇరువురికి మధ్య ఓట్ల వ్యత్యాశం16 శాతం ఉంది. మూడో స్థానంలో మమతా బెనర్జీకి 4 శాతం ఉంటే.. అదే 4 శాతంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఇక.. మూడు శాతం మంది మాత్రం అఖిలేశ్ యాదవ్ పేరు చెప్పటం గమనార్హం. ప్రధాని రేసులో ఉన్నట్లుగా మీడియాలో వచ్చే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు ఒక శాతం మంది మాత్రమే ఓటేశారు.ఇంతకీ మోడీలో మీకు నచ్చిందేమన్న ప్రశ్నకు ఆయన ప్రసంగాలు నచ్చుతాయని 25 శాతం మంది చెబితే.. 20 శాతం మంది మోడీ చేసిన డెవలప్ మెంట్ తో తాను అభిమానులం అయినట్లు చెప్పగా.. 13 శాతం మంది మాత్రం ఆయన కష్టపడే తత్త్వానికి ఫిదా అవుతున్నట్లు పేర్కొన్నారు. 11 శాతం మంది మాత్రం ఆయన విధానాల కు తాము అభిమానులమని చెప్పటం కనిపించింది. మొత్తంగా మోడీకి తిరుగులేదన్న విషయం తాజా సర్వే స్పష్టం చేసింది. కాకుంటే.. గతంలో పోలిస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కాస్తంత మెరుగు పడినట్లుగా చెప్పక తప్పదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking