Take a fresh look at your lifestyle.

స్పీకర్ చేసినోళ్లు ఓడి పోవడం ఖాయం

0 25

స్పీకర్ చేసినోళ్లు ఓడి పోవడం ఖాయం
– ఇదో అనావాయితీగా వస్తుంది..
– స్పీకర్ పోచారం గెలుపు పై చర్చా..
– స్పీకర్ గా పని చేసి ఓడిన నేతలు..

అసెంబ్లీ స్పీకర్… ఈ పదవి చేపట్టినోళ్లు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టరనేది నానుడి. గతంలో స్పీకర్ గా పని చేసినోళ్లు ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయినోళ్లే ఎక్కువ. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నందున నిజామాబాద్ జిల్లాలో చర్చా ప్రారంభమైంది. ఈ సెంటిమెంట్ ను నమ్ముకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్ వాడ కాంగ్రెస్ అభ్యర్థిగా స్పీకర్ పై పోటీ చేస్తున్నారు. స్పీకర్ గా పని చేసి ఎలక్షన్ లో పోటీ చేసినోళ్లు గెలిసిన సందర్భాలు తక్కువే.
నిర్దేశం, నిజామాబాద్ :
కే.ఆర్. సురేష్ రెడ్డి మళ్లీ గెలువాలే..
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే.ఆర్. సురేష్ రెడ్డి తిరుగులేని నాయకులు. ఎన్టీఆర్ హవాలో కూడా1989లో బాల్కొండ ఎమ్మెల్యేగా అతను మొదటి సారి గెలిసారు. ఆ తరువాత 1994, 1999, 2004లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిసారు. వైఎస్ ఆర్ ప్రభుత్వంలో స్పీకర్ గా పని చేసి మంచి పేరు సంపాదించారు. కానీ.. బాల్కొండ నియోజక వర్గంలో కూడా తనకు పొలిటికల్ గా పోటీ లేరు. అయినా.. ఆ తరువాత బాల్కొండ, ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడి పోయిన చరిత్ర అతని స్వంతం. స్పీకర్ గా పని చేసినందున ఆ తరువాత గెలువలేరంటున్నారు.
సిరికొండ మధుసూదన్ చారి కూడా ఓడాడు..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిరికొండ మధుసూదన్ చారి వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిసారు. ఆ తరువాత మొదటి అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. 2018లో జరిగిన ఎన్నికలలో మధుసూదన్ చారి ఓడి పోయారు. ఆ తరువాత రాజకీయాలలో కనిపించకుండా పోయారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్..?
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారైంది. గతంలో స్పీకర్ గా పోటీ చేసిన వారంతా ఓడి పోయిన చరిత్ర ఉన్నందున పోచారం ఈసారి ఎన్నికలలో గెలుపుపై చర్చా ప్రారంభమైంది. బాన్స్ వాడ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే… ఎలాగైన గెలువాలని పోచారం పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఆంధ్ర వలస వాదులు అధిక సంఖ్యలో ఉంటారు. అందుకే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖండించారు.
ఇద్దరూ నాన్ లోకల్ అభ్యర్థులే..
బాన్స్ వాడు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న వారిలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్ లోకల్.. బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణది నిజామాబాద్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీంధర్ ది ఎల్లారెడ్డి. అయితే.. లోకల్ వాసిగా పోచారం బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అభివృద్దిపైనే పోచారం ఆశలు..
బాన్సువాడ‌లో మొత్తం 11 వేల డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి పేద‌ల‌కు పంచారు. అలాగే రూ.200 కోట్లతో సిద్దాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు జ‌రుగుతున్నాయి. కేటీఆర్ ఈ రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. పైగా 2100 మంది గిరిజ‌నుల‌కు పోడు ప‌ట్టాలు అంద‌జేశారు. ఇక పోచారం వ్యవ‌సాయ శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్రారంభించిన రైతుబంధు, బీమా ఇవ‌న్నీ ప‌థ‌కాలు ఈసారి క‌లిసి వ‌స్తాయ‌న్న ధీమాతో ఉన్నారు. పైగా బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలో 41 వేల మందికి ఆస‌రా పింఛ‌న్లు అంద‌జేస్తున్నారు. వీరంతా బీఆర్ఎస్‌కు అండ‌గా ఉంటార‌ని పోచారం న‌మ్మకంగా ఉన్నారు. ద‌శాబ్దాల కాలంగా ఉన్న స్పీక‌ర్ ఓట‌మి సెంటిమెంట్‌ను త‌న విజ‌యంతో తుడిచిపెట్టాల‌ని దృఢనిశ్చయంతో ఉన్నారు.
స్పీకర్ గా పని చేసినోళ్లు ఓడిన సందర్భాలు ఉన్నందున పోచారం పొలిటికల్ భవిష్యత్ ఎన్నికల ఫలితాలలో తేలనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking